పాల‌నలో మార్పు కాదు… ప‌రిస్థితి మార్పుపై మాట్లాడాలి..!

భార‌తీయ జ‌న‌తా పార్టీలోకి కొంత‌మందిని కండువా క‌ప్పి, ఆహ్వానించే ఓ కార్య‌క్ర‌మంలో పురందేశ్వ‌రి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ… రాష్ట్రంలో అవినీతి ర‌హిత‌మైన పాల‌న కోసం ఆకాంక్షిస్తున్న‌వారంతా భాజ‌పాలో చేరుతున్నార‌న్నారు. కొత్త‌గా పార్టీలోకి వ‌చ్చేవారు కేవ‌లం కండువాలు క‌ప్పుకుంటే స‌రిపోద‌నీ… రాష్ట్రంలో గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా కేంద్ర ప్ర‌భుత్వంపై జ‌రుగుతున్న దుష్ప్ర‌చారాన్ని తిప్పి కొట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. విభ‌జిత రాష్ట్రమైన ఆంధ్రా కోసం ఎన్డీయే ప్రభుత్వం ‘చాలా’ చేసింద‌ని మ‌రోసారి చెప్పారు!

ఆంధ్రాలో ప్ర‌జ‌లు మార్పు కావాల‌ని ఆకాంక్షిస్తున్నార‌ని పురందేశ్వ‌రి అభిప్రాయ‌ప‌డ్డారు. రాష్ట్రంలో ఒక దృఢ‌మైన పాల‌న‌, సుస్థిరపాల‌నను ప్ర‌జ‌లు కోరుకుంటున్న మాట వాస్త‌వం అన్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు బేరీజు వేసుకుని చూస్తే… ఆ సామ‌ర్థ్యం భాజ‌పాకి మాత్రమే ఉంటుంద‌ని అర్థ‌మౌతుంద‌న్నారు! విభ‌జ‌న త‌రువాత రాష్ట్రాన్ని అన్ని ర‌కాలుగా ఆదుకుంది తామేన‌నీ, కానీ అభివృద్ధికి అడ్డుపడుతున్నామంటూ త‌మ‌పై దుష్ప్ర‌చారం తీవ్రంగా జ‌రుగుతోంద‌న్నారు. ఆ ప్ర‌చారాన్ని తిప్పికొడుతూ, చేసిన మేలును ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల్సిన బాధ్య‌త నాయ‌కులు, కార్య‌కర్త‌ల‌పై ఉంద‌న్నారు పురందేశ్వ‌రి!

ఏపీ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు ఇప్ప‌టికీ భాజ‌పా నేత‌ల‌కు అర్థం కావ‌డం లేదేమో..! అర్థ‌మైనా స‌రే… కావాల‌నే వాటిని పక్కన పడేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారేమో..! పురందేశ్వ‌రి మాట‌లు అచ్చం అలానే ఉన్నాయి. ఆంధ్రాలో సుస్థిర పాల‌న‌, దృఢ‌మైన పాల‌న గురించి చ‌ర్చ లేనే లేదు! ఆ స‌మ‌స్య త‌మిళ‌నాడులో ఉంది. ఆంధ్రాలో రాజ‌కీయ అనిశ్చితి ఎక్క‌డుంది..? విభ‌జ‌న త‌రువాత ఆంధ్రాకి కేంద్రం చెయ్యాల్సిన న్యాయం చెయ్య‌లేదు… కేంద్రంలో అధికార పార్టీగా భాజ‌పా ఆ విష‌యంలో విఫ‌ల‌మైంది… ఇదే ఏపీలో ప్ర‌స్తుత చ‌ర్చ‌నీయాంశం!

పురందేశ్వ‌రి చెప్పిన మాట‌ల్లో ఓ నిజం ఏంటంటే… ఆంధ్రులు పాల‌నలో మార్పు కోరుకుంటున్నార‌న్నది! అయితే, ఆ మార్పు కేంద్రంలో రావాల‌ని కోరుకుంటున్నారు. ఆంధ్రాని అన్ని విధాలుగా ఆదుకునే ప్ర‌భుత్వం ఉండాల‌ని కోరుకుంటున్నారు. ఆ మార్పు ఇప్ప‌టికిప్పుడు భాజ‌పాలో వ‌చ్చినా… హ్యాపీగా ఆద‌రిస్తారు. అది భాజ‌పాలో క‌నిపించ‌డం లేదు కాబ‌ట్టే… మార్పు కోరుకుంటున్న‌ది! రాష్ట్రస్థాయిలో.. పాల‌న మార్పు అనేది చ‌ర్చ కానే కాదు. ప‌రిస్థితుల్లో మార్పు మాత్రమే ఆంధ్రులు కోరుకుంటున్న‌ది. ఈ పాయింట్ వ‌దిలేసి… ఆంధ్రాలోకి భాజ‌పా అధికారంలోకి వ‌చ్చేయ్యాల‌న్న‌ట్టుగా కేడ‌ర్ ని ఎంక‌రేజ్ చేస్తున్నారు పురందేశ్వ‌రి! కేంద్రంలో ప్ర‌స్తుతం అధికారంలోనేగా ఉన్నారు క‌దా… ఆ మార్పేదో ఇప్పుడే చేసి చూపించొచ్చు కదా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

గ్లాసంటే సైజు కాదు… సైన్యం

https://www.youtube.com/watch?v=oZYqzxtg4f8 ఏపీలో ఎన్నిక‌ల వేడి రాజుకొంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడు పూర్తి స్థాయి రాజ‌కీయ నాయ‌కుడి అవ‌తారం ఎత్తాడు. ఆయ‌న్నుంచి సినిమాల‌కు సంబంధించిన అప్ డేట్లు మ‌రో రెండు మూడు నెల‌ల వ‌ర‌కూ రావు......

మీడియా వాచ్ : యూటర్న్‌లో కల్ట్ చూపిస్తున్న ఎన్టీవీ

ఎన్టీవీలోని అపరిచితుడు బయటకు వచ్చేశాడు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం కాంగ్రెస్ పై.. రేవంత్ రెడ్డిపై.. బీఆర్ఎస్ కు ఇష్టం లేని నేతలపై.. వాళ్ల టార్గెట్ ను రీచ్ ...

బీఆర్ఎస్‌లో ఉండను : మల్లారెడ్డి

బీఆర్ఎస్‌లో ఉండేది లేదని మల్లారెడ్డి ప్రకటించారు. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడ్ని కాదని.. పార్ట్ టైమ్ రాజకీయ నేతను.. పూర్తి స్థాయి వ్యాపారవేత్తనని చెప్పుకొచ్చారు. తన వ్యాపారాలకు రక్షణ కోసమైనా...

లేటుగా వ‌చ్చినా ప్ర‌తాపం చూపిస్తున్న‌ ‘హ‌నుమాన్’

ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన `హ‌నుమాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వ‌చ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డా.. 'హ‌నుమాన్‌'...

HOT NEWS

css.php
[X] Close
[X] Close