పూరి దర్శకత్వంలో అల్లరి నరేష్ సినిమా..!

కొన్ని సినిమాల కాంబినేషన్ కుదిరితేనే భలే థ్రిల్ అనిపిస్తుంది. ఒకవేళ అవి సినిమాగా కుదరకపోయినా ప్రేక్షకులు ఆ వార్తను ఎంజాయ్ చేస్తారు. అయితే ఇప్పుడు అలాంటి రేర్ కాంబినేషన్ లో ఓ సినిమా ఉంటుందని ఫిల్మ్ నగర్ లో వార్త చెక్కర్లు కొడుతుంది. అదే డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా సినిమా. ఏంటి కామెడీ హీరోకి బాక్సాఫీస్ బద్దలు కొట్టగల సత్తా ఉన్న దర్శకుడితో సినిమానా అని ఆశ్చర్యపోవచ్చు.

వస్తున్న వార్తలను బట్టి అది నిజమే అని తెలుస్తుంది. పూరి ప్రస్తుతం తీస్తున్న రోగ్ సినిమా పూర్తి కాగానే నందమూరి హీరోలతో సినిమా చేస్తున్నాడు. తారక్ తో చెప్పలేం కాని కళ్యాన్ రామ్ తో రీమిక్స్ కు ఫిక్స్ అయిన పూరి అల్లరి నరేష్ తో సినిమా చేసేందుకు స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటున్నాడట. కొద్దికాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న అల్లరి నరేష్ కు ఇదో గోల్డెన్ ఆఫర్ అని చెప్పొచ్చు.

ప్రస్తుతం బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాణంలో జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తున్న నరేష్ తర్వాత పూరితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట. మరి కామెడీ హీరోతో డ్యాషింగ్ డైరక్టర్ తీసే సినిమా ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు ఇప్పటినుండే ఆలోచించడం మొదలు పెట్టారు. ఏది ఏమైనా ఈ వెరైటీ కాంబినేషన్ కచ్చితంగా వర్క్ అవుట్ అవుతుందని మాత్రం చెప్పొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close