ఎన్టీఆర్ కోసం పూరి – ఒక‌టి కాదు … రెండు

ఎన్టీఆర్ భీక‌ర‌మైన ఫామ్‌లో ఉన్నాడిప్పుడు. ఎన్టీఆర్ విజృంభిస్తే ఎలా ఉంటుందో జ‌న‌తా గ్యారేజ్‌తో అర్థ‌మైంది. ఈ సినిమా వంద కోట్లు దాటి టాప్ 3 గ్రాస‌ర్ లిస్టులో చోటు సంపాదించింది. ఎన్టీఆర్ త‌దుప‌రి సినిమా ఎవ‌రితో అన్న‌దే ప్ర‌శ్న‌. అంద‌రి కంటే ముందు వ‌రుస‌లో పూరి జ‌గ‌న్నాథ్ రెడీ గా ఉన్నాడు. ఎన్టీఆర్ – పూరిల బాండింగ్ సమ్ థింగ్ స్పెష‌ల్‌. ఆంధ్రావాలా డిజాస్ట‌ర్ అయినా, టెంప‌ర్‌తో ఎన్టీఆర్‌కి స‌రికొత్త హోప్ ఇచ్చాడు పూరి. టెంప‌ర్‌తోనే ఎన్టీఆర్ ఆలోచ‌నా ధోర‌ణి మారింది. అందుకే.. ఎన్టీఆర్ క‌న్‌స‌ర్న్ పూరిపైనే ఎక్కువ ఉండే అవ‌కాశాలున్నాయి. అయితే ప్ర‌స్తుతం ఎన్టీఆర్ సెంటిమెంట్స్ కు లొంగ‌క‌పోవొచ్చు. ఎవ‌రు క‌థ‌తో మెప్పిస్తారో వాళ్ల‌కే ఓటేసే అవ‌కాశాలున్నాయి. ఈ విష‌యం పూరికి కూడా బాగా తెలుసు. అందుకే త‌న ఏర్పాట్ల‌లో తానున్నాడు.

ప్ర‌స్తుతం ఎన్టీఆర్ కోసం పూరి క‌థ సిద్దం చేస్తున్నాడు. అయితే ఓ క‌థ కాదు.. రెండు క‌థ‌లు. జ‌న‌తా గ్యారేజ్‌కంటే ముందు ఎన్టీఆర్‌కి ఓలైన్ వినిపించాడు పూరి. దానికి ఎన్టీఆర్ ఫిదా అయిపోయాడు. ఆ లైన్ ప‌నిలోనే పూరి ఉన్నాడిప్పుడు. లైన్లు విన‌డానికి బాగుంటాయి. క‌థ‌గా మారే ప్ర‌య‌త్నంలో ఆ ఇంపాక్ట్ త‌గ్గొచ్చు. అందుకే పూరి కూడా… ఆల్ట్ర‌నేటీవ్ గా మ‌రో క‌థ సిద్దం చేస్తున్నాడ‌ట‌. ఈ రెండింటిలో ఒక‌దాన్ని ఓకే చేయించుకొనే ఉద్దేశంలో ఉన్నాడ‌ట‌. ప్ర‌స్తుతం పూరి పొజీష‌న్ కూడా క్రిటిక‌ల్‌గానే ఉంది. ఈమ‌ధ్య కాలంలో టెంప‌ర్‌ని మిన‌హాయిస్తే మంచి సినిమా ఏదీ పూరి నుంచి రాలేదు. అందుకే.. ఓ స్టార్ హీరోతో సినిమా చేసి, హిట్టుకొట్టి మ‌ళ్లీ ఫామ్ లోకి రావాల‌నుకొంటున్నాడు. ఎన్టీఆర్‌తో సినిమా చేస్తే ఆ రేంజ్ ఎలా ఉంటుందో పూరికి బాగా తెలుసు. అందుకే ఈ అవ‌కాశాన్ని వ‌ద‌లుకోవాల‌నుకోవ‌డం లేదు. ఓ క‌థ కాక‌పోతే, మ‌రో క‌థ‌తో మెప్పించ‌డానికి పూరి త‌హ‌త‌హ‌లాడుతున్నాడు. అందుకే.. అద‌న‌పు అస్త్రాల‌ను సిద్దం చేస్తున్నాడు. ఈ రెండు క‌థ‌ల్లో ఎన్టీఆర్ దేనికి ఓకే చేస్తాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలాంటి పెళ్లి చేసుకోను: ఫరియా అబ్దుల్లాతో చిట్ చాట్

‘జాతిరత్నాలు’ సినిమాతో మెరిసింది ఫరియా అబ్దుల్లా. ‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. ఫట్టుమని పేలిందా నా గుండె ఖలాసే’ అంటూ యూత్ హృదయాల్ని కొల్లగొట్టింది. ఇప్పుడు అల్లరి నరేష్ కి జోడిగా...

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close