టాలీవుడ్ లో ఇప్పుడు అందరి నోటా.. రాకా మాటే. అల్లు – అర్జున్ – అట్లీ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాకు ‘రాకా’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈరోజు అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఎప్పుడైతే ఈ లుక్, టైటిల్ బయటకు వచ్చిందో, అప్పటి నుంచే ట్రెండింగ్ గా మారిపోయింది. ‘రాకా’ అనే పేరుని డీ కోడ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఫస్ట్ లుక్ నీ పాత సినిమాలతో కంపేర్ చేస్తున్నారు. ముఖ్యంగా విక్రమ్ ‘ఐ’ సినిమాలోని లుక్ కీ, ‘రాకా’లోని బన్నీ లుక్ కీ పోలికలు ఉన్నాయని పాత స్టిల్స్ ని బయటకు తీస్తున్నారు. కొంతమంది ఫ్యాన్స్ అయితే ఒనిడా టీవీ యాడ్ ని గుర్తు చేసేలా ‘రాకా’ ఫస్ట్ లుక్ ఉందని తమ పరిజ్ఙానాన్ని బయటకు తీసుకొస్తున్నారు.
అట్లీపై శంకర్ ప్రభావం గట్టిగా ఉందన్నది అందరి నమ్మకం. ‘జవాన్’ సినిమా చూస్తే, శంకర్ సినిమాలానే అనిపిస్తుంది. ఇప్పుడు ‘ఐ’ని ఫాలో అయ్యాడా? అనే అనుమానాలకు అదే బలం అందిస్తోంది. నిజానికి ‘ఐ’ అనేది ఓ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. దాన్ని కాపీ కొట్టే అవసరం అట్లీకి ఉండకపోవొచ్చు. పైగా అల్లు అర్జున్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ‘పుష్ప 2’ తరవాత చేస్తున్న సినిమా ఇది. పుష్ప సిరీస్ తో అంచనాలు బాగా పెరిగిపోయాయి. వాటిని అందుకోవాలంటే మ్యాజిక్ చేయాల్సిందే. ఇలాంటి తరుణంలో ఓ కాపీ ప్రాజెక్ట్ ని ఒప్పుకొనే ప్రసకి లేదు. అట్లీని నమ్మకపోయినా, కనీసం బన్నీని అయినా గుడ్డిగా నమ్మొచ్చు.
రాక అనే పదాన్ని డీకోడ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ డీ కోడ్ నుంచే ఫన్ పుట్టుకొస్తోంది. బహుశా.. ‘మావిగన్’ స్ఫూర్తి వల్ల.. ఈ డీ కోడ్ లు మొదలెట్టి ఉండొచ్చు. ‘శక్తి’ సినిమాలో విలన్ పాత్ర పేరు కూడా `రాకా`నే అని ఫ్యాన్స్ గుర్తు చేసుకొంటున్నారు. ఓ పెద్ద సినిమా వచ్చినప్పుడు ఇలాంటి పోలికలు బయటకు రావడం మామూలే. కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ సినిమా నుంచి మున్ముందు ఎలాంటి స్టఫ్ బయటకు వస్తుందన్నది కీలకం. ఈసారి వచ్చే కంటెంట్ పై అట్లీ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. `రాకా` అనేది పాన్ ఇండియా స్టఫ్ ఉన్న టైటిల్. ఈజీగా వెళ్లిపోతుంది. ఈ విషయంలో తిరుగులేదు. అట్లీ కూడా పాన్ ఇండియా స్థాయిలో అందరికీ అర్థమయ్యే టైటిల్ ని పెట్టాలనే ఇంతకాలం ఓపిక పట్టాడు. ఒక్క రోజులో ఈ టైటిల్ చేరువు అయిపోయినట్టే.
