అరాచక రాజ్యం : రాప్తాడు సభలో దాడిపై కేసే లేదు !

జర్నలిస్టుపై దాడి ఘటనపై అనంతపురం పోలీసులు ఇప్పటి వరకూ కేసులు నమోదు చేయలేదు. హత్యాయత్నం చేసినా పోలీసులు నిర్లిప్తంగా ఉన్నారు. జర్నలిస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసినా కనీసం స్పందించలేదు. చర్యలు తీసుకుంటామని మొక్కుబడి ప్రకటన చేశారు. కానీ.. మీడియానే అసలు ఎవరు దాడి చేశారో కూడా ఆధారాలతో సహా ప్రచురించింది. కానీ పోలీసులకు మాత్రం కనిపించలేదు.

ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడి ప్రణాళిక ప్రకారం జరిగింది. ఉద్దేశపూర్వంగా కొట్టారు. తమ గురించి వ్యతిరేకంగా రాస్తే.. చంపేస్తామని హెచ్చరికల్లో భాగంగానే ఈ దాడులు జరిగాయి. జగన్ రెడ్డి చొక్కా మడత పెట్టాలని ఇచ్చిన పిలుపు వెనుక ఉన్నది ఇదే. జగన్ రెడ్డి సర్వీస్ బ్యాచ్ అధికారులు మాత్రం నేరస్తులకే కొమ్ము కాస్తున్నారు. బాధితులపైనే కేసులు పెడుతున్నారు. ఏ మాత్రం సిగ్గుపడకుండా ఖాకీ డ్రెస్‌కు అవమానాలు తెస్తున్నారు.

ఉరవకొండలోనూ జర్నలిస్టులపై దాడి జరిగింది. అక్కడా పోలీసులది అదే నిర్లిప్తత. తీవ్ర విమర్శలు వచ్చాక.. ఎవరో పదిహేను మందిని అరెస్టు చేశామని చెప్పుకొచ్చారు. పోలీసుల వ్యవహారశైలి తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఇలాంటి వారితో ఎన్నికలు నిర్వహించడం అంటే… ఇక అరాచక రాజ్యంలో నేరస్తులకు ప్రజల్ని వదిలేసినట్లేనని అనుకోవచ్చు. ఈ నేరంలో అసలు తప్పు పోలీసులదే. ఏం చేసినా చర్యలు ఉండవన్న నేరస్తుల ధైర్యం కారణంగానే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క్రికెట్ మ్యాచ్‌లో ‘కుబేర‌’ స‌ర్‌ప్రైజ్‌

నాగార్జున మ‌న‌సు మ‌ల్టీస్టార‌ర్ల‌వైపు మ‌ళ్లింది. ఇప్పుడాయ‌న చేతిలో రెండు మ‌ల్టీస్టార‌ర్లు ఉన్నాయి. వాటిలో 'కుబేర‌' ఒక‌టి. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. ధ‌నుష్ క‌థానాయ‌కుడు. ఇందులో నాగార్జున కీల‌క పాత్ర పోషిస్తున్న...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ -...

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని ఫోటో మాయం..కారణం అదేనా..?

ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమవ్వడం చర్చనీయాంశం అవుతోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close