ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌కి అడ్డంకులు త‌ప్ప‌వా?

వివాదం ఎక్క‌డుంటే అక్క‌డ రాంగోపాల్ వ‌ర్మ ఉంటాడు. లేదంటే…తానున్న చోటికే వివాదాన్ని రప్పించుకుంటాడు. కేవ‌లం కాంట్ర‌వ‌ర్సీల ద్వారానే త‌న సినిమాపై ఫోక‌స్ ప‌డేలా చేసుకోవ‌డంలో దిట్ట.. రాంగోపాల్ వ‌ర్మ‌. ప్ర‌స్తుతం తాను క‌దుపుతున్న తేనెతుట్టె.. `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌`. ఎన్టీఆర్ జీవితంలోని చీక‌టి కోణాన్ని బ‌య‌ట‌పెడ‌తా.. అని ఈసినిమా గురించి స్టేట్‌మెంట్లు ఇస్తూపోతున్నాడు వ‌ర్మ‌. ఎన్టీఆర్ కెరీర్‌లోని ఆఖ‌రి మ‌జిలీ… అంత గొప్ప‌గా ఏం సాగ‌లేదు. ల‌క్ష్మీపార్వ‌తి రాక నుంచి ఎన్టీఆర్ త‌న కుటుంబానికి దుర‌మ‌య్యారు. ఆ త‌ర‌వాతే వెన్నెపోటు రాజ‌కీయాలు మొద‌ల‌య్యాయి. ఇదంతా బాల‌కృష్ణ `ఎన్టీఆర్‌` బ‌యోపిక్‌లో ఉండ‌వు. దాన్ని వ‌ర్మ ఇప్పుడు క్యాష్ చేసుకోబోతున్నాడు. ఓ విధంగా చెప్పాలంటే ఎన్టీఆర్ రెండు భాగాలతో పాటు వ‌ర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చూస్తేనే… ఎన్టీఆర్ జీవితం మొత్తం అర్థం అవుతుంది. ఓ ర‌కంగా.. ఇది వ‌ర్మ తెలివైన ఎత్తుగ‌డ‌.

కాక‌పోతే.. ఈసినిమా స‌జావుగా విడుద‌ల అవుతుందా, లేదా? అనే ధ‌ర్మ‌సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయిప్పుడు. `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌` అని పేరు పెట్టాడు కాబ‌ట్టి.. ల‌క్ష్మీ పార్వ‌తి అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి. ల‌క్ష్మీపార్వ‌తి కూడా `సినిమా తీసుకో` అనేశారు. కాక‌పోతే… స్క్రిప్టు ముందే చూపించాల‌న్న‌ది ఆమె కండీష‌న్‌. దాన్ని నేను తుంగ‌లో తొక్కేశా.. అని వ‌ర్మ డైరెక్ట్‌గానే స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు. స్క్రిప్టు చూపించ‌క‌పోయినా.. విడుద‌ల‌కు ముందు సినిమా అయినా చూపించాలి క‌దా? వ‌ర్మ మ‌రీ మొండి ఘ‌ట్టం. కాబ‌ట్టి దానికీ ఒప్పుకోడు. ఈ విష‌యంలో వ‌ర్మ‌కీ, ల‌క్ష్మీపార్వ‌తికీ మ‌ధ్య స‌యోధ్య కుద‌ర‌డం దాదాపు అసాధ్యం. మ‌రోవైపు ఈ సినిమాని అడ్డుకోవాల‌ని నంద‌మూరి కుటుంబ స‌భ్యులు, తెలుగుదేశం పార్టీ గ‌ట్టిగా ప్ర‌య‌త్నించ‌డం ఖాయం. ఎన్టీఆర్ క‌థ‌ని సినిమాగా తీస్తున్న‌ప్పుడు ఆ కుటుంబ స‌భ్యుల అనుమ‌తి తీసుకోవాల్సిందే. ఈ విష‌యంలో వ‌ర్మ ఇప్ప‌టి వ‌ర‌కూ వాళ్ల‌ని సంప్ర‌దించ‌లేదు. ల‌క్ష్మీపార్వ‌తి అనుమ‌తి ఉంటే చాల‌న్న‌ది వ‌ర్మ ధీమా. ప్ర‌స్తుతానికి బాల‌య్య కామ్‌గా ఉన్నా, విడుద‌లకు ముందు మాత్రం ఏదో ఓ మెలిక పెట్ట‌డం ఖామ‌మ‌న్న‌ది ఫిల్మ్ న‌గ‌ర్ స‌మాచారం. ఎన్టీఆర్ పార్ట్ 1కీ 2కీ మ‌ధ్య ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌ని విడుద‌ల చేయాల‌న్న‌ది వ‌ర్మ ప్ర‌య‌త్నం. దాన్ని ఎలాగైనా ఆపాల‌న్న‌ది మ‌రో వ‌ర్గం ప‌ట్టుద‌ల‌. మ‌రి ఈ ఇద్ద‌రిలో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ఎలా న‌లిగిపోతుంది? సెన్సార్ ని దాటుకుని ఎలా రాగ‌లుగుతుంది? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close