‘రూల‌ర్’ కొత్త ట్రైల‌ర్‌: ఈసారి పొలిటిక‌ల్ ట‌చ్‌

బాల‌కృష్ణ సినిమా అంటే రాజ‌కీయాల వాడీ వేడీ ఉండాల్సిందే. త‌న సినిమాలో ఏదో ఓ రూపంలో, ఏదో ఓ చోట‌… పొలిటిక‌ల్ ట‌చ్ ఇస్తుంటారు బాల‌య్య‌. అయితే ప్ర‌స్తుత రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో త‌న కొత్త సినిమా `రూల‌ర్‌` ఇందుకు మిన‌హాయింపు అనుకున్నారు. రాజ‌కీయ అంశాలేం లేకుండా – ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ సినిమాని తీస్తున్నార‌నుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌చ్చిన టీజ‌ర్‌లోనూ, ట్రైల‌ర్‌లోనూ పాలిటిక‌ల్ పంచ్‌లు లేవు. కానీ.. ఇప్పుడు `రూల‌ర్‌` కొత్త ట్రైల‌ర్ వ‌చ్చింది. ఈసారి మాత్రం త‌న‌దైన వాడీ చూపించారు బాల‌య్య‌.

ఓ చోట విల‌న్‌తో బాల‌య్య `ఎల‌క్ష‌న్ ఎల‌క్ష‌న్‌కీ ప‌వ‌ర్ క‌ట్ అవుతుందిరా పోరంబోకు` అనే డైలాగ్ విసిరారు. అంటే ప్ర‌స్తుతం ఉన్న పార్టీకి, ప్ర‌భుత్వానికీ ఇదో చుర‌క అన్న‌మాట‌. అధికారం ఎప్పుడూ ఒకే చోట ఉండ‌దు. అది మారుతుంది. రేప‌టి రోజు అధికారం మా చేతికి వ‌స్తుంద‌న్న ప‌రోక్ష హెచ్చ‌రిక ఈ డైలాగ్‌లో ఉందనుకోవాలి.

తొలి ట్రైల‌ర్‌లానే ఇందులోనూ క‌మ‌ర్షియ‌ల్ ప్యాకేజీ క‌నిపించింది. బాల‌య్య నుంచి ఆశించే డైలాగులు, యాక్ష‌న్ షాట్లూ, ఆ చిలిపిద‌నం, భారీద‌నం ఇవ‌న్నీ రంగ‌రించారు.

అయితే ఓ చోట ప్ర‌కాష్ రాజ్ `సామాన్యులు కూడా బందిపోటులుగా దారిదోపిడీ దారులుగా మారుతున్నారంటే దానికి కార‌ణం.. ఆక‌లి. ముందు ఆ ఆక‌లిని చంపాలి` అంటాడు. కాక‌పోతే ఇక్క‌డ‌ ఆక‌లిని తీర్చాలి అనాలి. ఆక‌లిని చంపాలి అన‌కూడ‌దు. చంపాలి అంటే నెగిటీవ్ సెన్స్ వ‌స్తుంది. ప‌రుచూరి ముర‌ళి ఈ డైలాగ్‌ని ఏ సెన్స్‌లో రాశాడో మ‌రి..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close