త‌మ‌న్నా తీసుకొంది త‌క్కువే.. కానీ ఈ ప్రచారం ఏంటి?

ఐటెమ్ పాట‌ల‌కు కేరాఫ్ అడ్రస్స్‌గా నిలిచింది త‌మ‌న్నా. ఓ స్టార్ హీరోయిన్‌, పైగా డాన్సింగ్‌లో తిరుగులేని హీరోయిన్ ఐటెమ్ పాట‌లు చేయ్య‌డానికి రెడీగా ఉంటే, పైగా హీరో ఎవ్వర‌నేది ప‌ట్టించుకోకుండా సై అంటుంటే.. ఇక అడ్డేముంది? అందుకే త‌మ‌న్నాకు ఐటెమ్ గాళ్‌గా అవ‌కాశాలు వెల్లువెత్తుతున్నాయి. త‌మ‌న్నా కూడా ఐటెమ్ పాట‌లు చేయ‌డం త‌ప్పేందుకు అవుతుంది? అని ఎదురు ప్రశ్నిస్తోంది. త‌న నుంచి స్పెష‌ల్ సాంగ్స్‌కి లైన్ క్లియ‌ర్‌. అందుకే ఆమెకు ఇంత డిమాండ్‌. అయితే త‌మ‌న్నా ఒక్కో పాట‌కు ఎంత తీసుకొంటోంది? అస‌లు ఐటెమ్ పాట విష‌యంలో త‌మ‌న్నా స్ట్రాట‌జీ ఏమిటి? అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. బెల్లంకొండ సురేష్ త‌న‌యుడు శ్రీ‌నివాస్‌తో త‌మ‌న్నా చేసిన రెండు ఐటెమ్ గీతాల‌కు అర‌కోటి చొప్పున తీసుకొన్నట్టు ప్రచారం జ‌రిగింది. అది నిజం కూడా. రెండు పాట‌ల‌కు గానూ త‌మ‌న్నాకి అక్షరాలా కోటి రూపాయ‌లు ద‌క్కింది. జాగ్వార్ కోసం త‌మ‌న్నా రూ.1 కోటికిపైగానే వ‌సూలు చేసింద‌ని చెబుతున్నారు. ఇంకొంత‌మంది రెండు కోట్లు అంటున్నారు. మ‌రి నిజ‌మెంత‌? త‌మ‌న్నాకు జాగ్వార్ నిమిత్తం ఎంత ద‌క్కింది?

ఈ పాట కోసం త‌మ‌న్నాకు రూ.60 ల‌క్షలు ముట్టాయ‌న్నది విశ్వస‌నీయ వ‌ర్గాల స‌మాచారం. కానీ బ‌య‌ట మాత్రం ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ ప్రచారాన్ని చిత్రబృందం చూసీ చూడ‌న‌ట్టు వ‌దిలేస్తోంది. త‌మ‌న్నాకి ఎంత ఎక్కువ ఇచ్చార‌ని చెబితే అంత మైలేజీ క‌దా? అందుకే ఇలాంటి ప్రచారం కూడా త‌మ సినిమాకి హైప్ తీసుకొస్తోంద‌ని న‌మ్ముతోంది జాగ్వార్ టీమ్‌. మ‌రోవైపు త‌మ‌న్నా కూడా సైలెంట్‌గానే ఉంది. దానికి కార‌ణం.. ఒక్క పాట‌కు కోటి రూపాయ‌లు తీసుకొందంటే… ఇక ముందు ఐటెమ్ పాట‌లు అడిగేవాళ్లు కూడా అదే రేంజులో ముట్టజెబుతారు క‌దా? అందుకే ఈ హైప్‌ని తాను కూడా ఎంజాయ్ చేస్తోంది. ఎక్కువ పారితోషికం కావాల‌ని త‌మన్నా డిమాండ్ చేయ‌లేద‌ని, కుమార‌స్వామి తానంత‌ట తానే రూ.60 ల‌క్షలు ఏక మొత్తంగా ఇచ్చేశాడ‌ని, త‌మ‌న్నా కూడా ఆనందంగా ఒప్పుకొంద‌ని టాక్‌. అయితే.. త‌మ‌న్నా పాట కోసం పాల్గొన్న మూడు రోజులూ.. ఆమెను ఓ మ‌హారాణిలా చూశార‌ట‌. కుమార‌స్వామి ట్రీట్‌మెంట్‌తో త‌మ‌న్నా చాలా ఇంప్రెస్ అయ్యింద‌ని, అందుకే పారితోషికం త‌క్కువైనా పెద్దగా ప‌ట్టించుకోలేద‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com