యూ టర్న్ సంగతి సరే.. మీ టర్న్ సంగతేంటి..?

ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష పార్టీ వైకాపా నాలుగున్నరేళ్లుగా అలుపెరుగని పోరాటం సాగిస్తోంది. కేవలం జగన్మోహన్ రెడ్డి పోరాటాలూ దీక్షల వల్లనే ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశం ఇప్పటికీ నిలబడి ఉందనీ వారే చెప్పుకుంటారు. దీక్షలూ ఉద్యమాల అయిపోయాయి, చివరి అస్త్రంగా ఎంపీల రాజీనామాలు అన్నారు. ఆ తరువాత, ప్రజల్లోకి వెళ్లి ఎడ్యుకేట్ చేస్తామన్నారు. తాజా పార్లమెంటు సమావేశాలకు వచ్చేసరికి… వైకాపా ఎంపీలు రాజీనామాలు చేసి ఏం సాధించారనేది ప్రజలకు ప్రశ్నగానే కనిపిస్తోంది. ప్రత్యేక హోదాకి సంబంధించి వైకాపా గొప్పగా చెప్పుకుంటున్న పోరాటం ఎక్కడుందీ, ఏమైందీ, ఏం సాధించిందీ అనేది ప్రశ్నే.

ఈ చర్చ ప్రజల్లో మొదలయ్యేసరికి… ఇప్పుడు టీడీపీ వైపు వేలెత్తి చూపిస్తోంది ఆ పార్టీ పత్రిక సాక్షి. ‘టీడీపీలో యూ టర్న్ టెన్షన్’ అంటూ నేటి సాక్షిలో ఓ కథనం రాశారు. యూటర్న్ అనే మాట టీడీపీ వర్గాలను తీవ్రంగా టెన్షన్ పెడుతోందట. దేశవ్యాప్తంగా చంద్రబాబు యూ టర్న్ గురించే మాట్లాడుకుంటున్నారట. ఇంటర్నెట్ లో యూ టర్న్ అంకుల్ అని సెర్చ్ చేస్తే.. చంద్రబాబు నాయుడు ఫొటోలే వస్తుండటం విస్మయానికి గురిచేస్తోంది. మొట్టమొదటి సారిగా వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబును యూ టర్న్ అంకుల్ అన్నారనీ, ఆ తరువాత దేశమంతా అది చర్చనీయమైందనీ, చివరికి పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చంద్రబాబు యు టర్న్ తీసుకున్నారని మాట్లాడరంటూ ఆ కథనంలో రాశారు. అంతేకాదు, ప్రత్యేక హోదాకి సంబంధించి చంద్రబాబు ఎప్పుడెప్పుడు ఏయే వ్యాఖ్యలు చేశారనే జాబితా కూడా ఇచ్చారు.

ఓకే, ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ తీసుకున్నది యూ టర్నే అనుకుందాం. అది ఎందుకు తీసుకుందనే చర్చ ఈ కథనంలోగానీ, వైకాపా నేతల వ్యాఖ్యల్లోగానీ కనబడనివ్వరూ వినబడనివ్వరు. మిత్రపక్షమైన టీడీపీ భాజపా నుంచి ఎందుకు బయటకి వచ్చేసింది..? కేంద్రంలోని అధికార పార్టీతో, అదీ మోడీ లాంటి నాయకత్వం ఉన్న జాతీయ పార్టీతో… ఒక రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీ పోరాటానికి దిగేంత సాహసం ఎందుకు చేసింది..? మోడీతో కోరి వైరం కొనితెచ్చుకోవడం చంద్రబాబుకు ఏమన్నా సరదానా..? టీడీపీ ఎందుకు చేసిందనే ఇలాంటి ప్రశ్నలకు ప్రజల దగ్గర సమాధానాలున్నాయి. కేవలం రాష్ట్ర ప్రయోజనాల నేపథ్యంలోనే టీడీపీ పోరాటం చేస్తోంది. ఇది ప్రజలందరికీ తెలిసిన సత్యం.

సరే, టీడీపీది యూ టర్నే అనుకుందాం. మరి, వైకాపాది ఏ టర్న్..? నాలుగేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ… ప్రత్యేక హోదాపై పోరాటం చేసి, అలిసిపోయిన పార్టీ చేసిందేంటి..? అసెంబ్లీకి వెళ్లరు, పార్లమెంటులో ఉండరు. కేవలం అధికారం వస్తే ఏదో చేస్తామనే తప్ప… ప్రతిపక్షంలో ఏం చేశామన్నది జగన్ చెప్పలేరు. టీడీపీ కేంద్రంతో పోరాడుతుంటే, భాజపాతో సత్సంబంధాల కోసం వెంపర్లాటను ఏ టర్న్ అంటారు..? రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా, అధికార పార్టీ వెంట నడవాలన్న కనీస ధర్మాన్ని ఒక్కటంటే ఒక్క సందర్భంలోనూ పాటించకపోవడం ఏ టర్న్..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close