ఎలక్టోరల్ బాండ్ల వివరాలు సుప్రీంకోర్టుకు ఇవ్వని ఎస్‌బీఐ !

ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన విరాళాలకు సంబంధించిన వివరాలను మార్చి 6 లోగా పొందుపర్చాలని సర్వోన్నత న్యాయస్థానం ఎస్‌బీఐని ఆదేశించింది. కానీ ఎస్‌బీఐ ఇవ్వలేదు. జూన్‌ 30 వరకు గడువును కోరుతూ ఎస్‌బీఐ.. సుప్రీంకోర్టులో దరఖాస్తును దాఖలు చేసింది. ఇలాంటి తరుణంలో అనూహ్య పరిణామం చోటు చేసుకున్నది. ఎస్‌బీఐ.. ఎలక్టోరల్‌ బాండ్లకు సంబంధించిన పత్రాలను తన వెబ్‌సైట్‌ నుంచి తొలగించింది. ఎస్‌బీఐ చేసిన ఈ పని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

‘ఆపరేటింగ్‌ గైడ్‌లైన్స్‌ ఫర్‌ డోనర్స్‌’, ‘ఫ్రీక్వెంట్లీ ఆస్‌క్డ్‌ క్వశ్చన్స్‌ (ఎఫ్‌ఏక్యూ)’ అనే పేరుతో ఉన్న లింక్‌లు, వెబ్‌పేజ్‌లు ఇప్పుడు ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో కనబడటం లేదు. ‘ఆపరేటింగ్‌ గైడ్‌లైన్స్‌ ఫర్‌ డోనర్స్‌’ అనే పత్రానికి సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ 2018, జనవరి 2న విడుదలైంది. ఇప్పుడు వాటిని తొలగించారు. సుప్రీంకోర్టు ఎలక్టోరల్‌ బాండ్లకు సంబంధించిన సమాచారాన్ని ఎన్నిలక సంఘానికి అందించటం కోసం ఎస్‌బీఐ మరో నాలుగు నెలల గడువును కోరుతోంది. ఇంత గడువు ఎందుకు … ఒక్క క్లిక్ తో వచ్చే సమాచారాన్ని ఇవ్వడానికి ఇబ్బందేమిటన్నది చాలా మందికి తెలిసిన విషయం.

షెడ్యూల్‌ ప్రకారం.. జూన్‌ లోపే ఎన్నికలు జరిగే అవకాశముంటుంది. ఆ లోగా ఎన్నికల బాండ్లకు సంబంధించిన సమాచారం బహిర్గతమైతే అధిక విరాళాలు అందుకున్న బీజేపీకి పరిస్థితులు ప్రతికూలంగా మారే అవకాశాలున్నాయని అందుకే గడువు కోరుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ‘బలమైన శక్తుల’ ప్రోద్బలంతోనే ఎస్‌బీఐ గడువును జూన్‌ 30 వరకు కోరి ఉండవచ్చని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా.. సుప్రీంకోర్టు తీర్పునూ… పట్టించుకోని పరిస్థితి వస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close