ఏ పుట్టలో ఏపాముందో ఎవ్వరూ చెప్పలేరు. అలానే ఏ సినిమా ఎంత వసూలు చేస్తుందో ముందే ఊహించడం కష్టం. రికార్డులు సృష్టిస్తుందనుకొన్న సినిమా… బోల్తాపడొచ్చు. ఆ… ఏముందిలే అని లైట్ తీసుకొన్న సినిమా భారీ వసూళ్లను సాధించొచ్చు. ఇప్పుడు పెళ్లి చూపులు సినిమా విషయంలో అదే జరుగుతోంది. విడుదలకు ముందు ఈ సినిమాని ఎవ్వరూ పట్టించుకోలేదు. టాలీవుడ్లో తయారవుతున్న సవాలక్ష సినిమాల్లో ఇదొకటి అనుకొన్నారు.కానీ విడుదలైన తొలి షోనుంచే పాజిటీవ్ టాక్తో దూసుకుపోతోంది. ఇప్పుడు భారీ లాభాల్ని మూటగట్టుకొచ్చింది.
రూ.60 లక్షల్లో పూర్తయిన సినిమా పెళ్లి చూపులు. ఇది తీసుకెళ్లి సురేష్ బాబు చేతిలో పెట్టారు. ఆయన ఈ సినిమాని కోటిన్నరకు కొన్నారు. మొత్తంగా తొలివారంలో రూ.3 కోట్ల షేర్ వచ్చింది. ఓవర్సీస్లో కోటిన్నర వరకూ వసూలైందట. దానికి తోడు శాటిలైట్ రెండున్నర కోట్లు పలికినట్టు టాక్. అంటే.. 60 లక్షలతో తీసిన సినిమాకి 7 కోట్లొచ్చాయన్నమాట. ఈ లాభాలు ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. ఎందుకంటే చాలా చోట్ల వసూళ్లు ఇంకా స్టడీగానే సాగుతున్నాయి. ఈమధ్యకాలంలో పది రెట్ల లాభాలు తీసుకొచ్చిన సినిమా ఇదొక్కటేనేమో. హ్యాట్రాఫ్.. పెళ్లి చూపులు.