తండ్రైన రామ్ చరణ్ – మీడియా కవరేజీ కూడా తప్పేనా ?

రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఆడపిల్ల జన్మించింది. అపోలో ఆస్పత్రిలో ఆమె డెలివరి అయింది. ఈ న్యూస్ అందరికీ చెప్పేందుకు అపోలో ఆస్పత్రి ముందు మీడియా పెద్ద ఎత్తున గుమికూడింది. కనీసం యాభై కెమెరాలు ఉంటాయి. ఆ కెమెరాల ఫోటోలు పట్టుకుని సోకాల్డ్ జర్నలిస్టులు నీతులు చెప్పడానికి.. విలువలు వల్లే వెయడానికి సోషల్ మీడియాలో దిగిపోయారు. ఆ వార్త అంత పెద్దదా.. అంత పెద్ద ఎత్తున కవరేజీ ఇవ్వాలా అని నోళ్లు నొక్కకోవడం ప్రారంభించారు. వీరంతా ఎవరో కాదు.. పేరు మోసిన జర్నలిస్టులమని తమకు తామే సర్టిఫికెట్ ఇచ్చుకున్నోళ్లు. జర్నలిజం అంటే వీరి దృష్టిలో ప్రతీ దానిలో తప్పులు వెదకడమే.

ఓ జర్నలిస్ట్ ఇంత దిగజారిపోయామా అని బాధపడతాడు..అందులో అంత దిగజారిపోవడానికి ఏముందో సామాన్య జర్నలిస్టులకు అర్థం కాదు. రామ్ చరణ్ మెగా పవర్ స్టార్. ఆయనకు బిడ్డ పుట్టడం అంటే .. ఖచ్చితంగా న్యూసే. ఎంటర్‌టెయిన్మెంట్ సెక్షన్ ఆడియన్స్ కు.. రీడర్స్ కు అంత కంటే పెద్ద వార్త ఉండదు. ప్రాధాన్యం ఉంటుంది. జనాలు ఆసక్తి గా చూస్తారు..చదువుతారు. అందుకే కవరేజీ ఇవ్వడానికి మీడియా సంస్థలు ప్రాధాన్యం ఇస్తాయి. అందులో తప్పేముంది ?. పైగా ఇప్పుడు డిజిటల్ మీడియా పెరిగిపోయింది. ఓ ఈ మెయిల్ తో యూట్యూబ్ చానల్ ఓపెన్ చేసుకుని.. సొంత జర్నలిజం చేసుకుని ఉపాధి పొందేవారు వందల్లో ఉన్నారు. అలాంటి వారికి.. ముఖ్యంగా డిజిటల్ మార్కెట్ లో ఇలాంటి వార్తలకే ప్రాధాన్యం ఉంటుంది.

ఇంకా సమాజానికి పనికొచ్చే అంశాలపై మీడియా ఇంత ప్రాధాన్యత ఇవ్వదని కొంత మంది ఫీలైపోయారు. అది ప్రధానమంత్రి కార్యక్రమం కాదని మరికొంత మంది సైటైర్లు వేశారు. నిజానికి ఇలా చెప్పిన వాళ్లు కూడా ప్రధాని మోదీ .. అమెరికా టూర్ కు వెళ్లారన్న సంగతిని కూడా తెలుసుకోవడానికి ఆసక్తి చూపరు.. కానీ రామ్ చరణ్ బిడ్డ విశేషాలంటే మాత్రం టక్కున చదివేస్తారు. అయినా సరే వారే నీతులు చెప్పడానికి ముందుకు వస్తారు.

ఏ న్యూస్ కు ప్రయారిటీ ఇవ్వాలో దేనికి ఇవ్వాలో… జర్నలిస్టులే ఒకరికి ఒకరు నీతులు చెప్పాలనుకోవడంతోనే సమస్య వస్తోంది. వారు తాము జర్నలిస్టు దిగ్గజాలం అనే సంగతిని మర్చిపోయి సాధారణంగా ఆలోచిస్తే… తాము చేస్తున్నది ఏమిటన్న సిగ్గుతో తలొంచుకుంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు..!!

సినీ నిర్మాత బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. హీరా గ్రూపు సీఈఓ నౌహీరా షేక్ ఫిర్యాదు ఆధారంగా ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బండ్ల...

ఏపీ ఉద్యోగుల చైతన్యం – 4 లక్షలకుపైగా పోస్టల్ బ్యాలెట్స్ !

ఏపీలో పోస్టల్ బ్యాలెట్స్ ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సారి ఉద్యోగుల్లో మరింత ఎక్కువగా చైతన్యం కనిపిస్తోంది. ఎన్నికల విధులు... ఎన్నికల సంబంధిత విధుల్లో ఉండేవారు పోస్టల్ బ్యాలెట్స్ వినియోగించుకోవచ్చు....

గవర్నర్ పై లైంగిక ఆరోపణలు..!!

వెస్ట్ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ పై రాజ్ భవన్ లో పని చేసే మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేసింది. ఉద్యోగం పేరిట ఆనంద్ బోస్ తనను లైంగికంగా వేధించారంటూ...

రిజర్వేషన్లపై కేసీఆర్ సైలెన్స్… కవిత కోసమేనా..?

దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు, రాజ్యాంగంపై రగడ కొనసాగుతోంది. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లేనని, రాజ్యాంగం రద్దుకు మద్దతు ఇవ్వడమేనని కాంగ్రెస్ వాదిస్తుండగా.. తాము రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని, రిజర్వేషన్లను ఎట్టి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close