గుర్తుకొస్తున్నావు… ఇంద్ర‌జా!!

చిలిపిక‌ళ్లు
చ‌లాకీ న‌ట‌న‌
మురిపించే మోము
క‌వ్వించే నవ్వు
మ‌త్తెక్కించే మాట‌
ఇవ‌న్నీ క‌లిస్తే శ్రీ‌దేవి..!

ఒక్క మాట‌లో చెప్పాలా…? సృష్టిలో ఉన్న సోయ‌గాన్నంతా వెండి తెర‌తో పొట్లం క‌డితే… శ్రీ‌దేవి!
‘అస‌లు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంట‌దా’ అంటూ శ్రీ‌దేవిని చూసి ఆశ్చ‌ర్య‌పోతే.. ఆ త‌ప్పు మీది కాదు.
పూల రెక్క‌లు, కొన్ని తేనె చుక్క‌లు
రంగించి, ఇలా బొమ్మ‌గా మార్చిన బ్ర‌హ్మదేవుడిదే!

ఆమె అందం చూసి థియేట‌ర్లు మెటిక‌లు విరుచుకున్నాయి. ఫ్లాష్ లైట్లు దిష్టి చుక్క పెట్టాయి. వెండితెర ఎర్ర తివాచీలా మారింది. నెంబ‌ర్ వ‌న్ కిరిటం ముచ్చ‌ట ప‌డుతూ.. ఆమె నెత్తినెక్కి కూర్చుంది. అదీ.. శ్రీ‌దేవి అంటే.

ప‌ద‌హారేళ్ల వ‌య‌సుకు గాలాలేసిన శ్రీ‌దేవి..
వ‌సంత కోకిల‌లో క‌న్నీళ్లు పెట్టించిన శ్రీ‌దేవి
ఆకు చాటు పిందె త‌డిసింది అంటూ రెచ్చ‌గొట్టిన శ్రీ‌దేవి
అబ్బ‌నీ తీయ‌నీ.. దెబ్బ కొట్టిన శ్రీ‌దేవి
హీరోయిన్ అనే అక్ష‌రాల్ని బంగారు వ‌న్నెలో ముంచిన శ్రీ‌దేవి..
మ‌న క‌ళ్ల ముందు నుంచి మాయ‌మైపోయి.. నేటికి స‌రిగ్గా యేడాది.

ఇంకెంతో జీవితం చూడాల్సిన వ‌య‌సులో
ఇంకెన్నో అద్భుతాలు చేయాల్సిన త‌రుణంలో
హ‌ఠాత్తుగా, ఎవ్వ‌రికీ చెప్ప‌కుండా మాయ‌మైపోయింది ఇంద్ర‌జ‌.
శ్రీ‌దేవి లేదు.. అనే మాటని న‌మ్మ‌డానికే సినీ ప్రియుల మ‌న‌సులు ఇంకా ఒప్పుకోవడం లేదు. ఇంకా ఇంకా ఆమె జ్ఞాప‌కాల్లో మునిగిపోతూ, ఆమెనే త‌ల‌చుకుంటూ, ఇంకా శ్రీ‌దేవి మ‌న‌మ‌ధ్యే ఉంది అనే ఊహ‌ల్లో, క‌ల‌ల్లో బ‌తికేస్తున్నారు.
ఎన్నో గొప్ప జ్ఞాప‌కాలు, ఇంకెన్నో గొప్ప క్ష‌ణాల్ని కానుక‌గా ఇచ్చిన శ్రీ‌దేవిని ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేం..!

”వి మిస్ యూ శ్రీ‌దేవి”

(ఈరోజు శ్రీ‌దేవి తొలి వ‌ర్థంతి సంద‌ర్భంగా)

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close