స్పెషల్ ప్యాకేజీ వల్ల అదనపు మేలు 15 వేల కోట్లే!

ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాదని తేల్చెయ్యడానికే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం, కూడబలుక్కున్నట్టు స్పెషల్ పేకేజి పాటమొదలుపెట్టాయి. ఈ ప్యాకేజీ వల్ల ఎపికి రెండు లక్షల కోట్లరూపాయలకు పైగానిధులు వస్తాయని కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్ లు తాజాగా ప్రకటించారు.

రెవెన్యూ లోటు కింద 3500 కోట్లు, పోలవరానికి 19 వేల కోట్లు, అమరావతికి1000 కోట్లు, ఏడు వెనుకబడిన జిల్లాలకు 1050 కోట్లు, వివిధ విద్యా సంస్థల ఏర్పాటుకు 10 వేల కోట్లు వస్తాయని సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. అందులో 20 నుంచి 30 శాతం వరకు నిధులు రొటీన్ గా వచ్చేవేనని చెప్పారు.

చట్టంలో పేర్కొన్న ఏడు జిల్లాలకు కేంద్రం ఇచ్చే 1050 కోట్లు రూపాయల నిధులు కూడా పాత అకౌంట్! మొత్తంమీద 2019-20 నాటికి 65 వేల కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉందని, అయితే, పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలను మినహాయిస్తే అదనంగా వచ్చేది 10నుండి 15 వేల కోట్ల రూపాయలు మాత్రమే నన్నది వీరి నిర్ధారణ.

రాష్ట్ర ఆర్ధికమంత్రిత్వ శాఖ అధికారులు చేసిన అధ్యయనాల ప్రకారం స్పెషల్ పేకేజివల్ల రాష్ట్రానికి ”అదనంగా” వచ్చే సాయం లక్షలకోట్ల రూపాయలు కాదనీ వేల కోట్లరూపాయలు మాత్రమే నని లెక్కతేలిపోయింది.

హుద్ హుద్ తుపానుకి స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ 1000 కోట్లరూపాయల తక్షణ సహాయాన్ని ప్రకటించి వాయిదాల్లో విడుదల చేసిన 640 కోట్లరూపాయల మొత్తం కూడా కేంద్రప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం స్పెషల్ ప్యాకేజీ లో లెక్కలోకివస్తాయని రాష్ట్ర అధికారి ఒకరు చెప్పారు.

2006లోనే ఒప్పందం కుదిరిన విశాఖ పెట్రో కెమికల్స్‌కు కొత్త ముసుగువేసి ప్యాకేజిలో పొందుపరిచారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజిలో ఉన్న కొన్ని అంశాలు పరిశీలించిన అనంతరం ప్యాకేజీ పై జరుగుతున్న ప్రచారానికీ ప్రయోజనాలకీ పొంతనే లేదని అధికారులు గట్టిగా చెబుతున్నారు.

విభజనకు ముందుగా అప్పటి కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించిన, ప్రతిపాదించిన పథకాలనే స్పెషల్ ప్యాకేజీ లో పొందుపరచారు. ఇంతే కాకుండా ఈ ప్యాకేజీ లోని అంశాల్లో 70 నుంచి 80 శాతం అంశాలు విభజన చట్టం ప్రకారం అమలు చేసి తీరవలసినవే!

చట్టాన్ని అమలు చేయడమే ఎపికి కేంద్రం చేస్తున్నమేలు ఎలా అవుతుందో నరేంద్రమోదీ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలకే తెలియాలి!

పోవలరం ప్రాజెక్టును తామే పూర్తి చేస్తామని చెప్పిన కేంద్రం తాజా ప్రకటన ప్రకారం కేవలం పది వేల కోట్లు మాత్రమే ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2014 తరువాత అయ్యే ఖర్చును మాత్రమే భరించనున్నట్లు ఆప్రకటనలో వుంది. ఈ ప్రకారం అంచనా వ్యయంలో 10 నుంచి 12 వేల కోట్లు రూపాయలు మాత్రమే వచ్చే అవకాశాలున్నాయి. వాస్తవానికి సహాయ, పునరావాసం ఖర్చుతో కలిపి ప్రాజెక్టు ఖర్చు 28 వేల కోట్లు అవుతుందని అంచనా వేస్తూండగా కేంద్రం ఆప్రస్తావనే తీసుకురాలేదు.

రాష్ట్ర విభజన తరువాత రాజధాని నిర్మాణ బాధ్యత తమదేనని అప్పట్లో కేంద్రం ప్రకటించింది. అయితే తాజాగా అమరావతి నిర్మాణానికి మరో వెయ్యి కోట్లు మాత్రమే ఇస్తానని చెప్పడం ద్వారా మొత్తం కేటాయింపులను 2500 కోట్లకు పరిమితం చేసినట్టయింది.

కృష్ణా, గుంటూరు జిల్లాల అభివృద్ధికి అదనంగా వెయ్యి కోట్లు ఇచ్చినా అవి రాజధాని నిర్మాణంలోకి రావని అధికారులు అంటున్నారు. కేవలం సచివాలయం, శాసనసభ, రాజ్‌భవన్‌, హైకోర్టు, ఇతర ప్రభుత్వ కట్టడాలు మినహా మిగిలిన రాజధాని నిర్మాణ భారం రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తోంది. ఈ పరిస్థితి మరిన్ని అప్పులకు దారితీసే ప్రమాదం ఉంది.

దేశ వ్యాప్తంగా వివిధ రోడ్లకు కేంద్రం నిధులు ఇస్తోంది. మన రాష్ట్రానికి గతంలో కూడా కేంద్ర ప్రభుత్వాల నుండి ఇదే విధంగా నిధులు అందాయి. మౌలిక వసతుల కల్పనలో భాగంగా రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత పెరిగిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా అనేక రోడ్ల ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఆ పెండింగ్‌లో ఉన్న వాటి దుమ్ముదులిపి తాజాగా 65 వేల కోట్లరూపాయలు ప్రకటించారని చెబుతున్నారు.

నిర్మలా సీతారామన్‌ ప్రకటిరచిన జాబితాలో ఉన్న వాటిలో అనేకం రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నవే కావడం గమనార్హం. 13వ షెడ్యూల్‌లో ఉన్న సంస్థలను గతంలోనే కేంద్రం ప్రకటించింది. వాటిలో కొన్ని ప్రారంభ దిశగా ఉన్నాయి. వాటిని కూడా కేంద్రం హోదాకు సమానంగా రాష్ట్రానికి ఇచ్చిన ప్రాజెక్టులుగానే చూపించడం విశేషం.

అలాగే చట్టంలో చెప్పిన మరికొన్ని కేంద్ర సంస్థలను కూడా తాజా ప్యాకేజిలో ఇచ్చినట్లుగా చూపించారు. చాలాకాలంగా పెండింగ్ లో వున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను విస్తరించే కార్యక్రమానికి కేంద్రం గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. అయితే ఇది కేంద్రం తన సంస్థకు చేస్తున్న అభివృద్ధే తప్ప రాష్ట్రానికి ప్రత్యేకంగా చేస్తున్నది కాదని అధికారులు విశ్లేషిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా కేంద్రం నిర్మించనున్న ఇళ్లల్లో రాష్ట్రానికి కూడా 1.93 లక్షల ఇళ్లను కేటాయించారు. ఇది సర్వసాధారణంగా జరిగే ప్రక్రియగానే అధికారులు చెబుతున్నారు. విశాఖ మెట్రో రైల్‌ కూడా చట్టంలో ఉన్న హామీయేనని, దీనిని జైకా రుణంతో నిర్మిస్తున్నామని సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడిరచారు.

రాష్ట్రానికి వివిధ ప్రాజెక్టుల ద్వారా అప్పులు ఇవ్వడాన్ని కూడా కేంద్రం ఎపికి చేస్తున్న మేలుగానే చూపిస్తోంది. అమరావతి నిర్మాణానికి హడ్కో ద్వారా 7500 కోట్లు రుణం తానే ఇప్పిస్తున్నట్లు చెప్పింది. అయితే ఇటువంటి రుణాల్లో రాష్ట్ర వాటా కూడా కొంత వుంటుంది. దాన్ని రాష్ట్రమే చెల్లించుకోవాలి.

ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్లుగానే మన రాష్ట్రానికి కూడా కొన్ని స్మార్ట్‌ సిటీలను, అమృత్‌ సిటీలను కేంద్రం ప్రకటించింది.ఇవి రాష్ట్రానికి మాత్రమే ప్రత్యేకంగా ఇచ్చేవి కాబోవని అధికారులు చెబుతున్నారు.

కేంద్ర ప్రత్యేక సహాయం ద్వారా వచ్చే మొత్తాన్ని ప్రత్యేకహాదాతో ఒనగూడే ప్రయోజనాలతో పోల్చలేమన్న అభిప్రాయం ఉన్నతస్థాయి వర్గాల్లోనే వ్యక్తమవుతోంది.

ప్రత్యేక హోదాలో కీలకాంశం పారిశ్రామిక రాయితీలే!, ప్యాకేజీలో అటువంటివి లేవు. పారిశ్రామిక వేత్తలకు నేరుగా ఇచ్చే రాయితీలకు, రాష్ట్ర ప్రభుత్వానికి అందే నిధులకు పోలిక పెట్టలేమని అధికారులు వివరిస్తున్నారు.

ప్యాకేజీ వల్ల వచ్చేది 70 వేల కోట్ల రూపాయలేనని ఒక దశలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు…తరువాత అంకెను పక్కకి నెట్టేసి ఇది బ్రహ్మాండమైన ప్యాకేజీ అని ప్రస్తుతించడం గమనార్హం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close