వరుణ్ తేజ్, శ్రీనువైట్లల లవ్ స్టోరీ

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ముకుంద సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక తన రెండో ప్రయత్నంగా క్రిష్ దర్శకత్వంలో కంచె అంటూ వచ్చి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. అయితే కంచె సినిమాతో వచ్చిన క్రేజ్ కాస్త కమర్షియల్ పంథాలో వచ్చిన లోఫర్ తో పోగొట్టుకున్నాడు. మాస్ ఇమేజ్ కోసం వరుణ్ తేజ్ లోఫర్ ప్రయత్నం పర్వాలేదనిపించినా సినిమా మాత్రం నిరాశ పరచిందని చెప్పాలి. ఇక క్రిష్ తో తీసే మరో సినిమా రాయబారి కూడా అర్ధాంతరంగా ఆగిపోయింది.

ప్రస్తుతం వరుణ్ తేజ్ వెంకీ అట్లూరి ‘ఫీల్ మై లవ్’ సినిమా ఒక్కటే చేస్తున్నాడు. ఇది సెట్స్ మీదకు రాకముందే మరో సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నాడట మెగా హీరో. ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్న శ్రీనువైట్ల ఓ లవ్ స్టోరీతో వరుణ్ తేజ్ ను కలిశాడట. మంచి హిట్ కొట్టాక మళ్లీ స్టార్ హీరోల వైపు చూడకూడదు అనుకున్నాడు శ్రీనువైట్ల. అందుకే వరుణ్ తేజ్ తో సినిమాకు సిద్ధమయ్యాడు.

ఫీల్ మై లవ్ సినిమా స్టార్ట్ అయిన కొద్దిరోజులకే శ్రీనువైట్ల సినిమా కూడా స్టార్ట్ అవనుందని సమాచారం. అయితే దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో రానుంది. ఇక ఈ సినిమా మిగతా స్టార్ కాస్ట్ ఎవరన్నది త్వరలో వెళ్లడయ్యే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చైతన్య : ప్రభుత్వం శాశ్వతం.. సీఎం కాదు – ఇంగితం లేదా నాగేశ్వర్ !

ఎంత మేధావులమని చెప్పుకున్నా తాత్కలిక లాభాలో తాము వ్యతిరేకించే వారిని గట్టిగా వ్యతిరేకించాలన్న కురచబుద్దితో వారి ప్రత్యర్థుల్ని సపోర్టు చేసి నవ్వుల పాలవుతూంటారు. ఆ జాబితాలో చాలా కాలంగా ప్రొ.నాగేశ్వర్ కూడా...

కడపలో సీన్ మార్చేస్తున్న షర్మిల !

షర్మిలతో రాజకీయం అంత తేలిక కాదని ఆమె నిరూపిస్తున్నారు. హోంగ్రౌండ్ లో కడప ఎంపీగా గెలిచేందుకు ఆమె చేస్తున్న రాజకీయ వైసీపీ నేతలకు మైండ్ బ్లాంక్ చేస్తోంది. రెండు రోజుల...
video

‘వీర‌మ‌ల్లు’ టీజ‌ర్‌: లెక్క‌లు స‌రిచేసే రాబిన్ హుడ్‌

https://www.youtube.com/watch?v=4TriF7BfHyI ప‌వ‌న్ క‌ల్యాణ్ - క్రిష్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు'. ప‌వ‌న్ రాజ‌కీయాలు, ఇత‌ర సినిమాల బిజీ వ‌ల్ల‌... 'వీర‌మ‌ల్లు'కి కావ‌ల్సిన‌న్ని డేట్లు కేటాయించ‌లేక‌పోయాడు. దాంతో ఈ సినిమా పూర్త‌వుతుందా,...

వృద్ధాప్య పెన్షన్ – జగన్‌ను ముంచిన సలహాదారుడెవరు ?

2014లో తాను సీఎం అయ్యే నాటికి రూ. 200 ఉన్న వృద్ధాప్య పెన్షన్ ను అధికారంలోకి రాగానే రూ. వెయ్యి చేశారు. మళ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు రూ....

HOT NEWS

css.php
[X] Close
[X] Close