ఫ్లాష్ బ్యాక్‌: జామ‌కాయ‌ల దొంగ‌… శ్రీ‌కాంత్‌

చిన్న‌ప్ప‌టి స‌ర‌దాలే వేరు. జామ తోట్లలో ఆడుకునే ఆట‌లు, మామిడి కాయ‌ల దొంగ‌త‌నం, కాల్వ గ‌ట్ల‌లో స్నానాలు.. ఎప్ప‌టికీ తీపి జ్క్షాప‌కాలు. అయితే అప్పుడ‌ప్పుడూ ఆ అల్ల‌రి శ్రుతిమించుతుంటుంది. నాన్నారి చేతిలో దెబ్బ‌లు కూడా తినాల్సివ‌స్తుంటుంది. శ్రీ‌కాంత్ బాల్యంలోనూ ఇలాంటి మ‌ర్చిపోలేని సంఘ‌ట‌న ఒక‌టి జ‌రిగింది.

శ్రీ‌కాంత్ ఇప్పుడంటే కంప్లీట్ ఫ్యామిలీ మేన్ అయిపోయాడు గానీ, చిన్న‌ప్పుడు ఒక‌టే అల్ల‌రి. స్నేహితుల‌తో క‌లిసి స్కూలు ఎగ్గొట్టి మ‌రీ సినిమాల‌కు వెళ్ల‌డం, ప‌క్కింట్లోని జామ‌కాయ‌ల్ని దొంగ‌త‌నం చేయ‌డం, కాల్వ‌ల్లో ద‌గ్గ‌ర ఈత కొట్ట‌డం… ఇలా అల్ల‌రి ఓ రేంజులో సాగేది. ప‌క్కింట్లో జామ కాయ‌ల దొంగ‌త‌నం శ్రీ‌కాంత్ బాల్యంలో నిరంత‌రం సాగే ప్ర‌క్రియ‌. కాయ‌ల‌న్నీ మాయ‌మైపోతున్నాయి గానీ, ఎవ‌రు తెంచుకెళ్తున్నారో ఆ ప‌క్కింటి వాళ్ల‌కు అర్థ‌మ‌య్యేది కాదు. ఓసారి ఆ దొంగ ఎవ‌రో క‌నిపెడ‌దామ‌ని కాప‌లా కాస్తే.. శ్రీ‌కాంత్ దొరికిపోయాడు. `మీ అబ్బాయి మా ఇంట్లో దొంగ‌త‌నం చేశాడు` అంటూ ప‌క్కింటివాళ్లు శ్రీ‌కాంత్ ఇంటిపైకి దాడి చేసినంత ప‌ని చేశారు. దాంతో.. శ్రీ‌కాంత్ నాన్న‌కు చాలా కోపం వ‌చ్చేసింది. ఆ రోజున శ్రీ‌కాంత్ వీపు వాచేలా త‌న్నులు తిన్నాడు. నాన్న దెబ్బ‌ల‌కు భ‌య‌ప‌డిపోయి… శ్రీ‌కాంత్ ఇంట్లోంచి పారిపోయాడు. రాత్ర‌యినా శ్రీ‌కాంత్ జాడ లేదు. శ్రీ‌కాంత్ కోసం ఊరంతా గాలించారు. కానీ ఎక్క‌డా క‌నిపించ‌లేదు. రాత్రికి శ్రీ‌కాంత్ స్నేహితుడొక‌డు ఇంటికొచ్చి… ‘శ్రీ‌కాంత్ కాల్వ గ‌ట్టు ద‌గ్గ‌ర ఉన్నాడు. మీరు కొట్ట‌నంటే ఇంటికొస్తాడ‌ట‌. కొడితే మాత్రం ఆ కాల్వ‌లోనే దూకి చ‌చ్చిపోతాడ‌ట‌’ అంటూ క‌బురు తీసుకొచ్చాడు. ‘వాడు ఎక్క‌డున్నా ఇంటికొస్తే చాలు. అస్స‌లు కొట్టం’ అని మాట ఇచ్చాకే.. శ్రీ‌కాంత్ ఇంటికొచ్చాడ‌ట‌. అప్ప‌టి నుంచీ శ్రీ‌కాంత్‌పై ఒక్క దెబ్బ కూడా ప‌డ‌లేదు. కొడితే మ‌ళ్లీ ఎక్క‌డ పారిపోతాడో అన్న భ‌యం వాళ్ల‌ది. అదీ.. శ్రీ‌కాంత్ మ‌ర్చిపోలేని ఓ చిన్న‌నాటి సంగ‌తి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గవర్నర్ పై లైంగిక ఆరోపణలు..!!

వెస్ట్ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ పై రాజ్ భవన్ లో పని చేసే మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేసింది. ఉద్యోగం పేరిట ఆనంద్ బోస్ తనను లైంగికంగా వేధించారంటూ...

రిజర్వేషన్లపై కేసీఆర్ సైలెన్స్… కవిత కోసమేనా..?

దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు, రాజ్యాంగంపై రగడ కొనసాగుతోంది. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లేనని, రాజ్యాంగం రద్దుకు మద్దతు ఇవ్వడమేనని కాంగ్రెస్ వాదిస్తుండగా.. తాము రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని, రిజర్వేషన్లను ఎట్టి...

మూగబోయిన భాగ్యనగర్ రైలు కూత…ఆ లీడర్లపై ప్యాసింజర్ల ఆగ్రహం

దాదాపు నలభై ఏళ్లపాటు పరుగులు పెట్టిన భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైలు కూత మూగబోయింది. మూడో రైల్వే మరమ్మత్తుల పేరిట దక్షిణ మధ్య రైల్వే అధికారులు భాగ్యనగర్ రైలును రద్దు చేశారు. ఇతర...

నెల్లిమర్ల రివ్యూ : అడ్వాంటేజ్ జనసేన లోకం మాధవి !

తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా జనసేన పట్టుబట్టి తీసుకున్న నియోజకవర్గం నెల్లిమర్ల. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ నియోజకవర్గం పరిధిలోనే బోగాపురం ఎయిర్ పోర్టు నిర్మించాల్సి ఉంది. కానీ జగన్ దాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close