ఏపీ డిప్యూటీ సీఎం ఫ్యామిలీ డబుల్ గేమ్ !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వస్తున్న మార్పులు.. వైసీపీ నేతల్ని కూడా తొందరపడేలా చేస్తున్నాయి. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో కొన్ని నియోజకవర్గాల్లో పాతుకుపోయిన కుటుంబాలు ఇప్పుడు.. కొంత మందిని టీడీపీలోకి చేర్పించేస్తున్నారు. సైలెంట్‌గా ఈ రాజకీయం నడిచిపోతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి కుటుంబానికి కురుపాం నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. ఆమె భర్త పరీక్షిత్ రాజు అరకు పార్లమెంట్ వైసీపీ అధ్యక్షునిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన సోదరి ని టీడీపీలోకి పంపుతున్నారు.

తాను తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లుగా పుష్పశ్రీవాణి భర్త పరీక్షీత్ రాజు సొంత చెల్లలు ప్రకటించారు. దీనికి పరీక్షిత్ రాజు తండ్రి మద్దతు ఉన్నట్లుగా తెలుస్తోంది. పుష్ప శ్రీవాణి మామ చంద్రశేఖరరాజు కొన్నాళ్ల క్రితం వైసీపీకి గుడ్ బై చెప్పారు.ఆయన టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు కుమార్తెను కూడా టీడీపీలో చేర్పించి.. కురుపాంలో పోటీ చేయాలనే ఆలోచన చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. వైసీపీకి ఎదురుగాలి వీచినా … టీడీపీ ద్వారా తమ కుటుంబ పట్టు నిలుపుకుంటున్నట్లుగా ఉంటుదంని వారు భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఛాయలు ఎక్కువగా కనిపిస్తూండటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.

వైసీపీలో ముఖ్యనేతలు కొంత మంది ఇప్పటికే ఈ తరహా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. కొంతమంది టీడీపీతో టచ్‌లోకి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. పరిస్థితి దిగజారిపోతోందనే అంచనాకు వచ్చిన ఎక్కువ మంది. .. అదే పని చేస్తున్నారు. మంత్రి వర్గ విస్తరణ తర్వాత పరిస్థితి మరింత ఎక్కువ అవుతుందని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ దీన స్థితికి ఇది మరో సాక్ష్యం !

నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కసరత్తు కోసం బీఆర్ఎస్ చేపట్టిన సమావేశానికి పట్టు మని నలభై మంది నేతలు రాకపోవడం ఆ పార్టీ దుస్థితిని తెలియచేస్తోంది. బీజేపీ...

బీజేపీకి దొరికిన పీవోకే అస్త్రం !

బీజేపీ గట్టి పోటీ ఎదుర్కొంటోందని ప్రచారం జరుగుతున్న సమయంలో రిజర్వేషన్ల రద్దు పై ప్రజల్లో జరిగిన చర్చ ఆ పార్టీని సమస్యల్లోకి నెట్టింది. చచ్చినా రిజర్వేషన్లు రద్దు చేయబోమని ప్రజల్ని బతిమాలుకోవాల్సి వచ్చింది....

రేవంత్ రాజీనామా…? త్వరలో కొత్త బాస్?

లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త పీసీసీ అద్యక్షుడి నియామకం ఉంటుందని హైకమాండ్ ఇప్పటికే ప్రకటించడంతో పార్టీ ఆ దిశగా కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. జూన్ నెలాఖరులో లోకల్ బాడీ...

ఈసీపై నిందలేయడానికే ప్లాన్డ్ హింస !

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ అనంతర హింస దేశం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా ఫలితాలు వచ్చిన తర్వాత ఎక్కువగా హింస జరుగుతుంది. అది రెండు, మూడు రోజుల్లో సద్దుమణిగిపోతుంది. కానీ ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close