తెలంగాణ సర్కార్‌కు మళ్లీ హైకోర్టు నుంచి “కరోనా మొట్టికాయలు”..!

వైరస్ కట్టడి విషయంలో.. తెలంగాణ సర్కార్ పనితీరు … హైకోర్టును ఏ మాత్రం మెప్పించలేకపోతోంది. ఎన్ని సార్లు చెప్పినా… ప్రభుత్వం లైట్ తీసుకుంటూండటంతో మరోసారి హైకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానం ఆదేశాలను పాటించని అధికారును సస్పెండ్ చేసి.. కేసు ఎందుకు పెట్టకూడదని..అటార్నీ జనరల్‌ను నేరుగా ప్రశ్నించింది. కరోనా విషయంలో… తాము పదే పదే ఆదేశిస్తున్న ఎందుకు పట్టించుకోవడం లేదని.. న్యాయస్థానం ప్రభుత్వంపై మండిపడింది. కరోనా పరీక్షలు పెంచకపోవడం.. సమాచారాన్ని పూర్తి స్థాయిలో వెల్లడించకపోవడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది.

కొద్ది రోజులుగా తెలంగాణ సర్కార్‌పై కరోనా విషయంలో హైకోర్టు మండి పడుతూనే ఉంది. టెస్టులు నిలిపివేయడం దగ్గర్నుంచి అనేక సార్లు.. ప్రభుత్వం తీరును హెచ్చరించింది. ర్యాపిడ్ టెస్టులు చేయాలని.. ప్రైవేటు ఆస్పత్రుల సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని .. ఎక్కడెక్కడ కేసులు నమోదయ్యాయో.. అందరికీ తెలిసేలా చేయాలని ఆదేశించింది. సమాచారం తెలుసుకోవడం ప్రజల హక్కు అని స్పష్టం చేసింది. అయితే.. ప్రభుత్వం మాత్రం.. తాను అనుకున్నదే చేస్తోంది. టెస్టుల సంఖ్యను పెద్దగా పెంచలేదు కానీ.. యాంటీజెన్ టెస్టులను మాత్రం ప్రారంభించింది. హైకోర్టు చెప్పిన విషయాలను అమలు చేయకపోగా.. తప్పుడు సమాచారంతో.. తప్పుదోవ పట్టిస్తున్నారని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఓ వైపు కేసులు పెరుగుతూంటే.. మరో వైపు ప్రజలను ప్రభుత్వం గాలికొదిలేసినట్లుగా ఉందని న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది. హైకోర్టు.. ప్రతీ వారం విచారణలోనూ.. ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. టెస్టులను పెంచడం దగ్గర్నుంచి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం వరకూ.. అనేక అంశాలపై..ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. అయితే.. ప్రభుత్వం లైట్ తీసుకుంటూ వస్తోంది. కొన్ని కొన్ని సార్లు హైకోర్టు హెచ్చరికలను పక్కన పెట్టి… అభినందించిందంటూ.. మీడియా బులెటిన్లలో చెప్పుకుంది. ఇది కూడా కోర్టు దృష్టికి వెళ్లింది. దీనిపైనా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము మొట్టికాయలు వేస్తూంటే.. అభినందించామని ప్రచారం చేసుకుని ప్రజలను ఎలా తప్పుదోవ పట్టిస్తారని ధర్మానసం ప్రశ్నించింది.

కరోనా విషయంలో తెలంగాణ సర్కార్ ఏం చేయాలనుకుంటో.. ఏం చేస్తుందో.. హైకోర్టుకు స్పష్టంగా చెప్పలేకపోతోంది. అసలు ఎలాంటి ప్రణాళికలు లేవన్న అభిప్రాయం వినిపిస్తోంది. టెస్టుల సంఖ్యను పెంచడం దగ్గర్నుంచి.. రోగులకు వైద్య సేవలు అందించడం వరకూ.. ఎలాంటి ప్రత్యేకమైన ప్రణాళికలు లేవన్న అభిప్రాయం.. హైకోర్టు విచారణతోనే వెలుగులోకి వస్తోంది. హైకోర్టు ఎ్ని సార్లు చెప్పినా… తెలంగాణ సర్కార్ తీరు మాత్రం మారకపోవడం.. విమర్శలకు కారణం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close