టిడిపి నేతల వర్గీక’రణం’

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఎదురుదెబ్బలు కాపునాడు కల్లోలం రాజధాని గజిబిజి వంటివాటితోనే ఉక్కిరిబిక్కిరవుతుంటే ఇప్పుడు అదనంగా ఎస్‌సి రిజర్వేషన్లపై వివాదం రాజుకుంటున్నది. అది కూడా అధికార పక్షంలో అంతర్గత ఘర్షణగా మారడం మరింత ఇబ్బందికరమవుతున్నది. తన హయాంలో వర్గీకరణ చేసిన చంద్రబాబు తర్వాత ఆమోదం పొందలేకపోయారు. ఇప్పటికీ కేంద్రం దాన్ని పక్కనపెడుతున్నది. వివిధ సందర్భాలలో వర్గీకరణ సమస్య ముందుకు వస్తూనే వుంది. తాజాగా మాదిగదండోరా నాయకుడు మందకృష్ణ దీనిపై అల్టిమేటం జారీ చేశారు. అధికారికంగా స్పందన వచ్చేలోగానే వ్యవసాయమంత్రి పత్తిపాటి పుల్లారావు మందకృష్ణపై విమర్శలు గుప్పించారు. ఆ అవకాశమే లేదని తోసిపారేశారు. పుల్లారావు వ్యాఖ్యలపై కృష్ణమాదిగ స్పందించడానికి ముందే సంక్షేమ శాఖా మంత్రి రావెల కిశోర్‌బాబు వాటిని కొట్టిపారేశారు.తమ ప్రభుత్వం వర్గీకరణకు కట్టుబడి వుందని ఆ విషయాలు మాట్లాడేందుకు తామంతా వున్నామని చెప్పారు.కొంతకాలం కిందట టిడిపిలో చేరిన మాజీ కాంగ్రెస్‌ మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ మరింత తీవ్ర స్తాయిలో పత్తిపాటి పుల్లారావు పై విరుచుకుపడ్డారు. మీశాఖలో అనేక సమస్యలు వుంటే మా సంగతి మీకెందుకని ఆక్షేపించారు. రావెల, పీతల సుజాత వంటివారు మాట్లాడతారని వ్యాఖ్యానించారు. ఇంతలో గృహనిర్మాణ కార్పొరేషన్‌ అద్యక్షుడు దళిత నేత వర్ల రామయ్య డొక్కా వరప్రసాద్‌పై ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ నుంచి వచ్చిన మీకు ఇంకా తెలుగుదేశం పద్ధతులు అలవడలేదని ఎద్దేవా చేశారు. వర్గీకరణ సమస్య తమ అధినేత చూసుకుంటాడని మందకృష్ణ సలహాలు అవసరం లేదని విమర్శించారు. మరో వైపున మందకృష్ణ 48 గంటల్లోగా వర్గీకరణపై వైఖరి చెప్పకపోతే తమ వాళ్లతో కలసి కార్యాచరణ ప్రకటిస్తానని ‘అల్టిమేటం’ జారీచేశారు.ఈ విషయంలో ఆయనకు ప్రధాన ప్రత్యర్థి ఎస్‌సి సంక్షేమ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకరరావు ఎదురుదాడి చేయడమే తరువాయి. ఏమైనా కాపుల రిజర్వేషన్‌ సమస్యతో మొదలుపెట్టి కులాల వారీ సమస్యలు వరుసగా పెరిగే సంకేతాలు స్పష్టం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైఎస్ ఫ్యామిలీ స్టోరీలో చెల్లికి అన్ననే విలన్

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిది ఎంత నేరో మైండో షర్మిల ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు. రాజకీయ ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడం అంటే.. వారి వ్యక్తిత్వాన్ని కించ పర్చడమే అని జగన్ రెడ్డి అనుకుంటూ...

చైతన్య : టాలీవుడ్ పౌరుషం ఇంతేనా ?

సినీ పరిశ్రమ ఏపీలో లేదు. కానీ పరిశ్రమను ఏపీ ప్రభుత్వం ఎంతగా వేధించిందో చూస్తే టాలీవుడ్ లో భాగం అనుకునే ఎవరికైనా పళ్లు పటపట కొరకాలని అనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి దేశ రెండో...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్…కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..?

పోలింగ్ కు ముందే బీఆర్ఎస్ కు షాక్ ఇవ్వాలని , తమతో టచ్ లోనున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకుకోవాలని కాంగ్రెస్ భావిస్తోందన్న చర్చ హాట్ టాపిక్ అవుతోంది. చేరికలకు సంబంధించి రాష్ట్ర...

కంచుకోటల్లోనే జగన్ ప్రచారం – ఇంత భయమా ?

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలు గట్టిగా ముఫ్పై నియోజకవర్గాల్లో జరిగాయి. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు ఉంటే.. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కనీసం యాభై నియోజకవర్గాల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close