శ్మశానం కామెంట్లతో బొత్స రగిల్చిన అమరావతి సెంటిమెంట్..!

తెలుగుదేశం పార్టీ రాజధాని సెంటిమెంట్ ను.. రగిలిస్తోంది. బొత్స సత్యనారాయణ.. రాజధానిపై గత కొద్ది రోజులుగా చేస్తున్న వివాదాస్పద ప్రకటనలను.. నిన్న శ్మశానంతో పోల్చి మరో రేంజ్ కు తీసుకెళ్లారు. వెంటనే .. టీడీపీ నేతలు.. ఈ అంశాన్ని అంది పుచ్చుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సహా.. నేతలందరూ ప్రభుత్వంపై ఒక్క సారిగా ఎదురుదాడికి దిగారు. ప్రజా రాజధానిని శ్మశానంతో పోల్చి ఆంధ్రులనే కాదు.. శంకుస్థాపనకు వచ్చిన ప్రముఖులను కూడా అవమానించారని ప్రతిపక్ష నేత చంద్రబాబు మంమడిపడ్డారు. హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం మీ కళ్లకు శ్మశానంలా కనిపిస్తున్నాయా… రైతుల త్యాగాలను అవహేళన చేస్తారా.. అని ప్రశ్నిచారు. ప్రజల మనోభావాలను గౌరవించలేని బొత్సకు మంత్రిగా కొనసాగే హక్కు లేదని .. అమరావతి అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే బొత్సను బర్తరఫ్ చేయాలని చంద్రబాబు జగన్ ను డిమాండ్ చేశారు.

మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బొత్సపై మరింత ఘాటుగా విరుచుకుడ్డారు. ప్రజా దేవాలయం శాసనసభను శ్మశానంతో పోల్చుతారా .. సచివాలయం వీళ్లకు శ్మశానంలా కనిపిస్తోందా.. సీఎం, మంత్రులు శ్మశానంలో కూర్చొని పాలన చేస్తున్నారా అని ప్రశ్నల వర్షం కురిపించారు. చట్టసభలను అవమానించినందుకు ప్రివిలేజ్ నోటీసులిస్తామని యనమల ప్రకటించారు. నారా లోకేష్ కూడా.. బొత్సపై విభిన్నమైన విమర్శలు చేశారు. ఇన్నాళ్ళూ బొత్స మెదడు అరికాల్లో ఉందనుకున్నా.. అసలు మెదడే లేదని నిన్న ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో తేలిపోయిందని సెటైర్ వేశారు. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి పడిన కష్టం.. వైసీపీ నేతలకు అర్థమవుతుంది అనుకోవడం అత్యాశేనన్నారు. వైసీపీ నేతలు కూర్చున్న చెట్టునే నరికేసుకుంటున్నారన్నారు.

రాజధాని ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు… రాయలసీమ నేతలు కూడా… బొత్స ప్రకటనపై మండిపడ్డారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. బొత్సను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బొత్స ప్రకటన.. రాజధాని రైతుల్లోనూ అసంతృప్తికి కారణం అయింది. ఓ వైపు… నిర్మాణాలు ఆపవద్దని జగన్ ఆదేశించన వార్త హైలెట్ అయిన సమయంలోనే.. బొత్స శ్మశానం వ్యాఖ్యలు చేశారు. ఇదంతా.. రాజధానిపై జరుగుతున్న గేమ్ ప్లాన్ ఏమో అనే అనుమానాలు రాజధాని రైతుల్లో ప్రారంభమయ్యాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

షర్మిల రాజకీయానికి జగన్ బెదురుతున్నారా..?

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై జగన్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మరుసటి రోజే షర్మిలకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close