ఇక తెలంగాణ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ..!

దుబ్బాక ఉపఎన్నిక ఫలితం ఎఫెక్ట్ టీఆర్ఎస్‌పై తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఫలితం వచ్చిన ఒక్క రోజులోనే మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణపై చర్చ ప్రారంభమయింది. పనితీరు ఆధారంగా మార్పుచేర్పులు ఉంటాయని ప్రగతి భవన్ నుంచి సంకేతాలు అందాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి నడుస్తోంది. గ్రేటర్ ఎన్నికలు కూడా వాటితో పాటే పూర్తవుతాయి. అవి పూర్తయిన తర్వాత మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. దుబ్బాక ఫలితంగా కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. అధికార పార్టీ ఉపఎన్నికల్లో ఓడిపోతే.. తీవ్రమైన నెగెటివ్ వేవ్ ఉన్నదన్న సంకేతాలు వస్తాయని.. అది మంచిది కాదని ఆయన భావిస్తున్నారు.

మరో వైపు వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ, మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ స్థానాలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో పార్టీ అభ్యర్థుల విజయం బాధ్యత ఆయా జిల్లాల మంత్రులదేనని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. గెలవకపోతే పదవులు ఉండవని నేరుగానే హెచ్చరికలు చేశారు. సీఎం హెచ్చరికల నేపథ్యంలో మంత్రులందరూ ఆరు ఉమ్మడి జిల్లాలకు చెందిన ఎమ్మెల్సీ ఎన్నికల పనుల్లోనే ఉన్నారు. ఓటరు నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ విషయంలో హరీష్ రావు ఫెయిలయ్యారు. దుబ్బాక ఓటమికి తనదే బాధ్యతని ప్రకటించుకున్నారు.

మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ అంశంపై తెలంగాణలో కొద్ది రోజుల నుంచి చర్చ జరుగుతోంది. ఇటీవల కొంత మంది మంత్రులపై ఆరోపణలు వచ్చాయి. కరీంనగర్‌కు చెందిన ఓ మంత్రిపై.. టీఆర్ఎస్ అనుకూల మీడియా విస్తృతమైన కథనాలు ప్రసారం చేసింది. ఈటల రాజేందర్ పై కూడా గతంలో పదవి నుంచి తీసేస్తారన్న ప్రచారం జరిగింది. అప్పట్లో అగిపోయారు. మంచి సమయం కోసం కేసీఆర్ చూస్తున్నారని చెబుతున్నారు. ఇప్పుడు.. ఎన్నికల ఫలితాల తర్వాత ఆ సమయం వస్తున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close