ఎమ్మెల్సీలు లేనట్లే – రేవంత్ సర్కార్‌కు గవర్నర్ ఫస్ట్ షాక్ !

గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి గవర్నర్ తమిళిశై సౌందరరాజన్ షాకిచ్చారు. ఆ ఎమ్మెల్సీల భర్తీపై ప్రభుత్వం ఎలాంటి సిఫారసులు చేసినా అంగీకరించేది లేదని రాజ్ భవన్ తెలిపింది. వాటిపై ఇప్పటికే కోర్టులో కేసు ఉందని ఆ కేసు పరిష్కారం అయిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. రాజ్ భవన్ ప్రకటనతో రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ చేయాలని అనుకుంటున్న కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలినట్లయింది.

దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేస్తూ గత జూలైలో బీఆర్ఎస్ మంత్రిమండలి తీర్మానం చేసింది. ఈ నిర్ణయాన్ని గవర్నర్ తమిళిసై గతేడాది సెప్టెంబర్ 19న తిరస్కరించారు. అయితే వారి ప్లేస్ లో వేరే వారిని కేసీఆర్ రిఫర్ చేయలేదు. ఈలోపు ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ కూడా వెంటనే ఎమ్మెల్సీల్నీ భర్తీ చేయలేదు.దీంతో ఈ జనవరిలోనే హైకోర్టులో శ్రవణ్, సత్యనారాయణ పిటిషన్ వేశారు. ఒకసారి పిటిషన్ విచారణకు వచ్చింది. మళ్లీ ఈ నెల 24వ తేదీన విచారణకు రానుంది.

రెండు గవర్నర్ స్థానాలు ఖాళీగా ఉన్నందున కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను సిఫారసు చేయాలని అనుకున్నారు. కానీ కోర్టులో కేసు తేలే వరకూ ఏ సిఫార్సులు అంగీకరించేది లేదని గవర్నర్ ముందుగానే చెప్పడంతో … ఆ రెండు స్థానాల భర్తీ ఇప్పుడల్లా ఉండదని తేలిపోయింది. కోర్టులో కేసు ఎప్పుడు తేలుతుందో తెలియదు కానీ.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ఎడాదికిపైగా ఖాళీగా ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క్రికెట్ మ్యాచ్‌లో ‘కుబేర‌’ స‌ర్‌ప్రైజ్‌

నాగార్జున మ‌న‌సు మ‌ల్టీస్టార‌ర్ల‌వైపు మ‌ళ్లింది. ఇప్పుడాయ‌న చేతిలో రెండు మ‌ల్టీస్టార‌ర్లు ఉన్నాయి. వాటిలో 'కుబేర‌' ఒక‌టి. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. ధ‌నుష్ క‌థానాయ‌కుడు. ఇందులో నాగార్జున కీల‌క పాత్ర పోషిస్తున్న...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ -...

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని ఫోటో మాయం..కారణం అదేనా..?

ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమవ్వడం చర్చనీయాంశం అవుతోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close