త్రివిక్ర‌మ్‌కి రిక్వెస్ట్ కాదు… ఆర్డ‌ర్ వేస్తాడ‌ట‌!

తరుణ్ ‘నువ్వే నువ్వే’తో త్రివిక్రమ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. 2002లో ఆ సినిమా విడుదలైంది. దాని తర్వాత దర్శకత్వానికి చిన్న బ్రేక్ ఇచ్చి మూడేళ్లు రచయితగా కొనసాగారు. ‘అతడు’తో దర్శకుడిగా మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన త్రివిక్రమ్ ఒక మాదిరి హీరోలవైపు చూడడం మానేసి చాలా కాలమైంది. మహేష్ బాబు లేదంటే పవన్ కళ్యాణ్ మధ్యలో కుదిరితే అల్లు అర్జున్‌తో సినిమాలు చేశారు. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హీరో. ఈ సినిమాల మధ్య త్రివిక్రమ్ చిన్న హీరోతో చేసిన ఒకే ఒక్క సినిమా ‘అ ఆ’. సినిమా ఇండస్ట్రీలో పవన్‌కల్యాణ్‌ భక్తుడు నితిన్‌ అందులో హీరో. ‘అజ్ఞాతవాసి’ ఎంత ప్లాప్ అయినా దర్శకుడిగా త్రివిక్రమ్ రేంజ్ ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. స్టార్ హీరోలు ఆయనతో సినిమా చేయడానికి వెనకడుగు వేస్తారని అనుకోవడానికి వీల్లేదు. అటువంటి స్టార్ దర్శకుడితో తప్పకుండా ఒక సినిమా చేస్తానని సరైన విజయాలు లేక సతమతమవుతున్న తరుణ్ చెబుతున్నాడు.

ఒక తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో త్రివిక్ర‌మ్‌కు తనకు మంచి ఫ్రెండ్షిప్ ఉందని తరుణ్ చెప్పుకొచ్చారు. త్రివిక్ర‌మ్‌తో మళ్ళీ మీరు సినిమా ఎప్పుడు చేస్తారు? అని ప్రశ్నిస్తే.. “శీను (త్రివిక్రమ్‌)తో తప్పకుండా చేయాలి. అతను పవన్‌కల్యాణ్‌, మహేశ్‌బాబులతో సినిమా చేస్తున్నాడు. నేను స‌క్సెస్‌లు అందుకున్న తర్వాత తనను నాతో సినిమా చేయమంటే బాగుంటుంది. స‌క్సెస్‌లు కొట్టాక త్రివిక్ర‌మ్‌తో నాతో చేయమని అడగను! ‘నాతో సినిమా చెయ్‌’ అని చెప్తా! అతనితో నాకంత చనువు ఉంది” అని తరుణ్ చెప్పాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.