బీజేపీ ఆస్తులు 6 వేల కోట్లు – ఎవరెవరు ఇచ్చారో ?

బీజేపీ ఆస్తుల విలువ కొండలా పెరిగిపోతోంది. 2021-22లో కాంగ్రెస్ పార్టీకి 805 కోట్ల ఆస్తులు ఉన్నాయి. 120 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ…. 60 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీకి ఉన్న ఆస్తులు అవి. కానీ బీజేపీకి ఉన్న ఆస్తుల విలున రూ.6,046 కోట్లు. ప్రకటించింది. ఈ ఏడాది మరింత పెరిగి ఉంటుంది. ఏడీఆర్ ఈ రిపోర్టు విడుదల చేసింది. 2020-21లో బీజేపీ ఆస్తుల విలువ రూ.4,990 కోట్లు కాగా ఏడాదిలో ఇరవై శాతం పెరిగింది. ఎనిమిది జాతీయ పార్టీల ఆస్తుల విలువ కలిపి 2021-22లో రూ.8,829 కోట్లుగా ఉంది. ఇందులో 70శాతం బీజేపీదే.

అప్పుల విషయానికి వస్తే కాంగ్రెస్‌ మొదటి స్థానంలో ఉంది. 2021-22లో ఆ పార్టీ తన అప్పులను రూ.41.95 కోట్లుగా చూపింది. అదే కాలంలో బీజేపీ అప్పులు కేవలం ఐదు కోట్ల రూపాయలు మాత్రమే.. రాజకీయ పార్టీలకు నిధులు ఎవరు ఇస్తున్నారో రహస్యంగా ఉంచుతున్నారు. ఎలక్టోరల్ బాండ్ల విధానం తీసుకు వచ్చి… రహస్యంగా కార్పొరేట్ సంస్థలతో కొనుగోలు చేయిస్తున్నారు. సహజంగానేఈ ఎలక్టోరల్ బాండ్లలో 90 శాతం బీజేపీ కోసమే కొంటున్నారు. లేకపోతే ఏం జరుగుతుందో వారికి తెలుసు.

కాగ్‌ ప్యానల్‌లోని అర్హత కలిగిన, ప్రాక్టీస్‌ చేస్తున్న ఛార్టర్డ్‌ అకౌంటెంట్లతో రాజకీయ పార్టీల ఖాతాలను ఆడిట్‌్‌ చేయించాలన్న డిమాండ్లు చాలా కాలంగా ఉన్నాయి. ప్రస్తుతం రాజకీయ పార్టీలు తమంత తామే ఛార్టర్డ్‌ అకౌంటెంట్లను నియమించుకుంటూ ఖాతాలు ఆడిట్‌ చేయించుకుంటున్నాయి. పారదర్శకంగా రాజకీయ పార్టీలు ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వినిపిస్తున్నా…. కీలక పార్టీలు ఆ ఆలోచన చేయడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

సుకుమార్.. మీరు సూప‌రెహె..!

ఇండస్ట్రీలో డబ్బులు తేలిగ్గా ఇస్తారేమో కానీ క్రెడిట్లు ఇవ్వరు. ముఖ్యంగా రచయితలు ఈ విషయంలో అన్యాయమైపొతుంటారు. ఓ రైటర్ తో ట్రీట్మెంట్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే.. ఇలా అన్నీ రాయించి, చివరికి ఆ...

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close