కవితపై ఈడీ చార్జిషీట్‌లో ఉన్న విషయాలు ఇవే !

ఢిల్లీ మద్యం విధానంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అసలైన పెట్టుబడిదారు అని.. ఆమె బినామీగా వ్యవహరించిన అరుణ్‌ పిళ్లై తన వాంగ్మూలంలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారని ఈడీ గతంలో దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్‌లో పేర్కొంది. రూ.100 కోట్ల లంచాల గురించి కవితకు తెలుసని పిళ్లై అంగీకరించారని తెలిపింది.

సౌత్ గ్రూప్ లీడర్ కవితే !

సౌత్‌ గ్రూప్‌ శరత్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవ మాగుంట, కె.కవిత తరఫున ప్రాతినిధ్యం వహించిన అరుణ్‌ పిళ్లై, అభిషేక్‌ బోయినపల్లి, బుచ్చిబాబు)తో కలిసి మనీశ్‌ సిసోడియా, ఇతర ఆప్‌ నేతల ప్రతినిధి విజయ్‌నాయర్‌ ఈ కుట్ర చేశారని వివరించింది. మద్యం విధానం రూపకల్పనకు ముందు, తర్వాత కూడా విజయ్‌నాయర్‌తో కవిత పలుసార్లు సమావేశమయ్యారు. సమీర్‌ మహేంద్రు వాంగ్మూలం ప్రకారం.. తన వెనక ఎవరున్నారో చెప్పాలని అడగ్గా తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుమార్తె ఎమ్మెల్సీ కవిత అని సమీర్‌కు అరుణ్‌ పిళ్లై వెల్లడించారు. 2022 తొలినాళ్లలో హైదరాబాద్‌లోని కవిత నివాసంలో జరిగిన సమావేశంలో ఆమెతోపాటు సమీర్‌ మహేంద్రు, శరత్, అరుణ్‌ పిళ్లై, అభిషేక్‌ బోయినపల్లి, కవిత భర్త అనిల్‌ పాల్గొన్నారు.

బినామీగా అరుణ్ పిళ్లై

అరుణ్‌పిళ్లై తన కుటుంబ సభ్యుడితో సమానమని, అతడితో కలసి వ్యాపారం చేస్తున్నామని, తమ వ్యాపారాన్ని భారీగా ముందుకుతీసుకెళ్లాలని భావిస్తున్నామని సమీర్‌కు కవిత తెలిపారు. ఈ సమయంలోనే ఇండోస్పిరిట్స్‌ ఎల్‌1 దరఖాస్తు సమస్యపై కవిత ఆరా తీశారు. రూ.100 కోట్ల ముడుపులకు బదులుగా కవితకు ఇండోస్పిరిట్స్‌లో వాటా ఇవ్వడంపై.. ఆమెకు, ఆప్‌ నేతలకు మధ్య అవగాహన/ఒప్పందం ఉందని అరుణ్‌ పిళ్లై తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఆ సౌత్‌ గ్రూపులో మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవ మాగుంట, శరత్‌రెడ్డి, కె.కవిత ప్రముఖ వ్యక్తులని తెలిపింది. ఈ సౌత్‌గ్రూపునకు ప్రతినిధులుగా అభిషేక్‌ బోయినపల్లి, అరుణ్‌ పిళ్లై, బుచ్చిబాబు వ్యవహరించారని తెలిపింది. రూ.100 కోట్ల కిక్‌బ్యాక్‌లు బదిలీ చేయడానికి విజయ్‌ నాయర్, దినేశ్‌ అరోరాలతో కలిసి అభిషేక్‌ బోయినపల్లి కుట్ర చేశారని పేర్కొంది.

స్కాం డబ్బులతో హైదరాబాద్ లో ఆస్తులు కొన్న కవిత

ఢిల్లీ మద్యం వ్యాపారంలో వచ్చిన సొమ్ముతో సదరు వ్యక్తులు హైదరాబాద్‌లో ప్రాపర్టీలు కొన్నారని ఈడీ పేర్కొంది. ఫీనిక్స్‌ శ్రీహరితో కలిసి కవిత భర్త అనిల్, బుచ్చిబాబు హైదరాబాద్‌లో ప్రాపర్టీలు కొన్నారని తెలిపారు. కవిత చాలా రోజులుగా విచారణకు వెళ్లడం లేదు. ఈ కారణంగానే ఆమెను అరెస్టు చేసినట్లుగా భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఘరానా మోసం… బ్రతికున్నా చంపేస్తున్నారు..!!

హైదరాబాద్ చుట్టుప్రక్కల మీ పేరిట ప్లాట్ ఉందా..? డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయని తీరిగ్గా ఉన్నారా..? అయినా ప్లాట్ల విషయంలో ప్రమాదం పొంచి ఉందండోయ్. నకిలీ ఆధార్ , నకిలీ ధృవీకరణపత్రాలు, నకిలీ ఓనర్...

క్రికెట్ మ్యాచ్‌లో ‘కుబేర‌’ స‌ర్‌ప్రైజ్‌

నాగార్జున మ‌న‌సు మ‌ల్టీస్టార‌ర్ల‌వైపు మ‌ళ్లింది. ఇప్పుడాయ‌న చేతిలో రెండు మ‌ల్టీస్టార‌ర్లు ఉన్నాయి. వాటిలో 'కుబేర‌' ఒక‌టి. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. ధ‌నుష్ క‌థానాయ‌కుడు. ఇందులో నాగార్జున కీల‌క పాత్ర పోషిస్తున్న...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ -...

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close