‘తులసీవనం’ వెబ్‌సిరీస్‌ రివ్యూ: క్రికెట్ బెట్టింగ్ వ్యధలు

తరుణ్ భాస్కర్ బ్రాండ్ తో ఓ ప్రాజెక్ట్ వస్తుందంటే సహజంగానే ఆసక్తి ఏర్పడుతుంది. ‘తులసీవనం’ వెబ్ సిరీస్ ఆయన సమర్పణలో ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చింది. టీజర్, ట్రైలర్ ఇదొక న్యూ ఏజ్ యూత్ కంటెంట్ అనే నమ్మకాన్ని ఇచ్చాయి. ఇటివలే #90 వెబ్ సిరిస్ తో ఈటీవీ విన్ సత్తా చాటింది. మరా విజయాన్ని తులసీవనం కొనసాగించిందా? ఇంతకీ తులసీవనం కథేంటి?

తులసీ రామ్ (అక్షయ్‌)ది కర్నూల్. అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తులసీ తండ్రి మంచి పలుకుబడి వున్న మనిషే. వృత్తి వ్యవసాయమే అయినా ఢిల్లీ స్థాయిలో ఎంపీలతో పరిచయాలు వుంటాయి. తులసీని కలెక్టర్ గా చూడటం తండ్రి కల. కానీ తులసీకి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం. ఇండియా టీంకి ఓపెనర్ గా చేయాలనేది అతని కల. చిన్నప్పుడే తన కల గురించి తండ్రికి చెప్పగా ఆయన ఓ బెట్ వేస్తాడు. అందులో ఓడిపోయిన తులసి, తండ్రి చెప్పినట్టే వింటాడు. అలా ఆటకు దూరమైపోతాడు. చదువు కూడా సరిగ్గా ఎక్కదు. ఇంజినీరింగ్‌ లో దాదాపు సబ్జెక్ట్ లన్నీ వుండిపోతాయి. హైదరాబాద్ లో ఫ్రెండ్ రూమ్ లో ఉంటూ అవి క్లియర్ ప్రయత్నాల్లో ఉంటాడు. ఇంతలో అతనికి మళ్ళీ క్రికెట్ మీద ఇష్టం పుడుతుంది. ఇంట్లో ఐఏఎస్ కోచింగ్ అని అబద్ధం చెప్పి క్రికెట్‌ ట్రైనింగ్ కోసం దిల్లీ వెళ్తాడు. మరి తులసీ క్రికెటర్ అయ్యాడా? ఢిల్లీలో తనకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? తులసీ సంగతి ఇంట్లో తెలిసిందా? ఇదంతా మిగతా సిరిస్.

ప్రతి కుర్రాడి జీవితం ఒకేలా వుండదు. చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు.. ఇది కామన్ సైకిల్. ఈ సైకిల్ అందరికీ ఒకేలా కుదరదు. కొంతమంది అనుకున్న సమయంలో చదువు పూర్తి చేయలేరు. కొంతమంది ఉద్యోగంలో త్వరగా కుదురుకోలేరు. ఇంకొంతమంది రియాలిటీకి దూరంగా బ్రతుకుతుంటారు. ఇంకొంతమంది తెగిన గాలిపటంలా ఎటుపడితే అటు తిరుగుతుంటారు. ఇలా తెగిన గాలిపటం లాంటి కుర్రాడి కథని తులసీవనంలో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు అనిల్ రెడ్డి. తులసీని ఐఏఎస్ గా చుడాలనేది అతని తండ్రి కల. తొలి సీన్ లోనే ‘నేను యాక్టర్ అవుతా’ అని షూటింగ్ కి వస్తాడు తులసీ. రెండో సీన్ లోనే దేశానికి క్రిటర్ ఆడే సత్తా తనలో వుందని ఫీలౌతాడు. ఇలాంటి భిన్నమైన పాత్రతో ‘తులసీవనం’ సిరిస్ ని మలిచాడు దర్శకుడు అనిల్.

తరుణ్ భాస్కర్ స్టయిల్ లో సాగే కథనం ఇది. ఎదో లక్ష్యం కోసం పాత్రలు ప్రయత్నిస్తున్నట్లుగా వుండవు. సహజమైన పాత్రలు, అంతకంటే సహజమైన మాటలతో సన్నివేశాలని చెప్పడం ఆయన స్టయిల్. ఇందులో కూడా అదే కనిపిస్తుంది. సిరిస్ ఆద్యంతం ఫన్ టోన్ లోనే వుంటుంది. షూటింగ్ లొకేషన్ లో మొదలయ్యే తొలి సన్నివేశంతో ఈ సిరిస్ ఎలా ఉండబోతుందో ఒక ఐడియా వచ్చేస్తుంది. తులసీ పాత్రని పరిచయం చేసిన తీరు, తను తన కథ చెప్పుకోవడం, చైల్డ్ ఎపిసోడ్, కార్పొరేట్ క్రికెట్ మ్యాచ్ లు.. ఇవన్నీ తొలి ఎపిసోడ్ లో లైటర్ వెయిన్ లో సాగిపోతాయి.

ఇది క్యారెక్టర్ బేస్డ్ సిరిస్. కథ కంటే తులసీ పాత్రని ఫాలో అయితేనే ఇందులో లీనం అవ్వగలం. ఏది ఆడిగినా అది సమకూర్చే తల్లితండ్రులు ఉన్నప్పటికీ కొందరు పిల్లలు పెద్దగా కష్టపడని, రియాలిటీకి దూరంగా వుండే డ్రీమ్స్ తో బ్రతుకుతుంటారు. తులసీ క్యారెక్టర్ ఒక దశలో ఇలానే అనిపిస్తుంది. పాతికేళ్ళు దగ్గర పడుతున్న తరుణంలో విరాట్ కోహ్లిలా అయిపోదామని తులసీ ఢిల్లీ వెళ్ళిపోయే వ్యవహారం ఇలానే వుంటుంది. అయితే వెంటనే తత్త్వం బోధపడిపోతుంది. మళ్ళీ హైదరాబాద్ వచ్చి పడతాడు. ఇక్కడి నుంచే తులసీ జీవితంలో ఎంతోకొంత సంఘర్షణ తెరపైకి వస్తుంది. ఒక దశలో క్రికెట్, క్రికెట్ బెట్టింగ్, తాగుడు తప్పితే మరో ప్రపంచం వుండదు. క్రికెట్ బెట్టింగ్ యువతని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టేస్తుందో రియాలిటీకి దగ్గరగా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. బెట్టింగ్ లో డబ్బులు పోయిన తర్వాత తన జీవితంపై అసహ్య పడుతూ కన్నీళ్లు పెట్టుకుంటాడు తులసీ. ఈ సన్నివేశం కదిలిస్తుంది. చేసిన అప్పుని తీర్చడానికి ఉద్యోగంలో చేరుతాడు. అక్కడ దీపిక అనే అమ్మాయి పరిచయం అవుతుంది. దీంతో పాటు తనకి ఎంతో ఇష్టమైన క్రికెట్ మళ్ళీ అతని జీవితంలోకి వస్తుంది. ఇక్కడితో ఈ సీజన్ ని ముగించారు. తర్వాత దీపికతో తులసీ ప్రయాణం ఏమైయిందనేది తర్వాత ఎపిసోడ్స్ లో తెలుసుకోవాలి.

తులసీరామ్‌ పాత్రలో అక్షయ్‌ సహజంగా కనిపించాడు. తన స్క్రీన్ ప్రజెన్స్ కూడా డీసెంట్ గా వుంది. స్నేహితుడి పాత్రలలో చేసిన వెంకటేష్ కాకమాను, విష్ణు పాత్రలు కూడా అలరిస్తాయి. దీపిక పాత్రలో చేసిన ఐశ్వర్య పర్వాలేదనిపిస్తుంది. మాటలని చాలా సహజంగా రాసుకున్నారు. అయితే చాలా బీప్ డైలాగులు వున్నాయి. దాని కోసం సెపరేట్ గా ఓ బీప్ సౌండ్ ని కూడా క్రియేట్ చేసుకున్నారు. ఆర్ఆర్ కథకు తగ్గట్టు లైటర్ వెయిన్ లో వుంది. కెమార వర్క్ కూడా బావుంది చిత్రీకరణలో తరుణ్ భాస్కర్ ఛాయలు కనిపిస్తాయి. అయితే కథనంలో చాలా లింకులు మిస్ అయినా ఫీలింగ్ కలుగుతుంది. ఏ అంచనాలు లేకుండా సరదాగా ఓ యూత్ ఫుల్ కంటెంట్ చూడాలనే ఆడియన్స్ ఈ సిరిస్ ని ఓసారి చూడొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close