గెలుపు కోసం ట్రంప్ ప్రచారాస్త్రం చైనానే..!

2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో.. డొనాల్డ్ ట్రంప్‌కు… హిల్లరీ క్లింటన్‌కు మధ్య పోటీ. డొనాల్డ్ ట్రంప్ బ్యాక్‌గ్రౌండ్ చూసి.. ఆయనకు అసలు ప్రెసిడిన్షియల్ అభ్యర్థిగా అర్హతే లేదనుకున్నారు. సర్వేల్లోనూ అదే తేలింది. కానీ.. అనూహ్యంగా ఆయన విజయం సాధించారు. ఇప్పుడు కూడా.. సర్వేల్లో ఆయన వెనుకబడే ఉన్నారు. కానీ ట్రంప్‌లో ఎలాంటి చీకూచింతా లేదు. నాలుగేళ్ల క్రితం ఆయనలో ఉన్న ఉత్సాహం ఇప్పుడూ కొనసాగుతోంది. నాలుగు రోజుల పాటు జరిగిన రిపబ్లికన్ కన్వెన్షన్‌కు కుటుంబ సమేతంగా హాజరైన ట్రంప్.. వచ్చే నాలుగేళ్లు ఏం చేస్తానో కూడా చెప్పారు.

అమెరికా అమెరికన్లకే.. మేక్ అమెరికా గ్రెట్ ఎగైన్… లాంటి నినాదాలతో గత ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్.. ఇప్పుడు కూడా అదే ఆలోచనా విధానాన్ని కొనసాగిస్తూ నినాదాల్లో కొంత మార్పు తీసుకొచ్చారు. సురక్షితమైన, శక్తిమంతమైన, గతంకంటే గొప్పగా ఉండే అమెరికాను ప్రజల ముందు ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తానంటున్నారు. ట్రంప్‌కు ప్రజల్లో ఆదరణ ఎంత ఉందో తెలియదు కానీ.. ఆయన మాత్రం చైనాను బూచిగా చూపించి.. గెలిచేందుకు సిద్ధమవుతున్నారు. చైనా పట్ల కఠినమైన వైఖరి పాటించి తీరుతామని చెబుతున్నారు. ఒక వేళ తాను గెలవకపోతే.. అమెరికా.. చైనా చేతుల్లో చిక్కుకుంటుందని ప్రజల్ని భయపెడుతున్నారు.

ట్రంప్ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారు. తన పాలనలో మచ్చగా మిగిలిపోయిన వాటిని ఆయన ప్రస్తావించడం లేదు. జాత్యాహంకార దాడుల గురించి చెప్పడం లేదు. నల్ల జాతీయులకు భద్రత ఎలా కల్పిస్తారో చెప్పడం లేదు. ప్రజల ఆదాయాలు పెరిగేందుకు ఏం చేస్తారో కూడాచెప్పడం లేదు. డెమొక్రటిక్ కన్వెన్షన్‌లో బైడెన్ ప్రసంగం ఆకట్టుకునేదిగా ఉంటే… ట్రంప్ బోర్ కొట్టించారని మీడియాలో రివ్యూలు వచ్చాయి. సర్వేల్లో బైడెన్ ముందున్నారు. కానీ తాను గెలిచి తీరుతానని ట్రంప్ అంటున్నారు. గెలవకపోతే.. ఆ ఫలితాల్ని ఆమోదించబోనని కూడా చెబుతున్నారు. మొదటిసారి పోటీ చేసినప్పుడు కూడా ఇంతే చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క్రికెట్ మ్యాచ్‌లో ‘కుబేర‌’ స‌ర్‌ప్రైజ్‌

నాగార్జున మ‌న‌సు మ‌ల్టీస్టార‌ర్ల‌వైపు మ‌ళ్లింది. ఇప్పుడాయ‌న చేతిలో రెండు మ‌ల్టీస్టార‌ర్లు ఉన్నాయి. వాటిలో 'కుబేర‌' ఒక‌టి. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. ధ‌నుష్ క‌థానాయ‌కుడు. ఇందులో నాగార్జున కీల‌క పాత్ర పోషిస్తున్న...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ -...

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని ఫోటో మాయం..కారణం అదేనా..?

ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమవ్వడం చర్చనీయాంశం అవుతోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close