డబ్బుల్లేవ్… ఆర్టీసీ కార్మికులకు జీతాల్లేవ్..!

సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇవ్వడానికి ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం సిద్ధంగా లేదు. సోమవారం లోపు.. కార్మికులందరికీ జీతాలిస్తామని హైకోర్టుకు తెలిపిన.. ఆర్టీసీ యాజమాన్యం.. తీరా సోమవారం వచ్చే సరికి ..ఆర్టీసీ వద్ద సొమ్ము లేదనే సమాచారాన్ని హైకోర్టుకు తెలిపింది. ఆర్టీసీ వద్ద రూ.7.5 కోట్లే ఉన్నాయన్న అడ్వకేట్‌ జనరల్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టీసీ కార్మికులకు నెల జీతాలు చెల్లింపునకు రూ.224 కోట్లు కావాల్సి ఉందన్నారు. కార్మికులు సెప్టెంబర్ నెల మొత్తం పని చేశారు. వర్కింగ్ డేస్‌ను సెప్టెంబర్ 20వరకే ఉంటుంది. నెలవారీ జీతాల సైకిల్ ఇరవై తేదీ నుంచి ఇరవై తేదీ వరకూ లెక్కిస్తారు. ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తారు. ఈ లెక్క ప్రకారం.. జీతాల బిల్లు… చాలా ముందుగానే రెడీ అయి ఉంటుంది.

కార్మికులు ఐదో తేదీ నుంచి సమ్మె ప్రకటన చేశారు. ఆ లోపు జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ.. ఆర్టీసీ యాజమాన్యం వ్యూహాత్మకంగానే జీతాలు నిలిపివేసింది. సమ్మెకు, జీతాలకు ఎలాంటి సంబంధం లేకపోయినా… కావాలనే జీతాలు ఆపేశారని..కార్మికులు ఆరోపిస్తున్నారు. నిజానికి కొన్నాళ్లుగా ఆర్థిక ఇబ్బందులున్నాయని.. చెప్పిన ఒకటో తేదీ ఇవ్వాల్సిన జీతం.. ఐదో తేదీ ఇస్తున్నారు. ఇలా ఇస్తున్నా… ఉద్యోగ సంఘాలు అభ్యంతర పెట్టలేదు. ఈ వెసులుబాటును ఉపయోగించుకున్న ప్రభుత్వం.. సమ్మె ప్రారంభించిన ఉద్యోగులకు జీతాలు నిలిపివేసి.. షాక్ ఇచ్చింది. జీతాలు లేకుండానే.. ఆర్టీసీ కార్మికులు దసరా పండుగ చేసుకున్నారు.

ఇప్పుడు దీపావళి కూడా వస్తుంది. అయినప్పటికీ వారికి జీతాలు అందలేదు. ఇచ్చే ఉద్దేశం కూడా లేదని… హైకోర్టులో అడ్వకేట్ జనరల్ చేసిన వాదనతోనే స్పష్టమవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది. అంటే.. కార్మికులకు ఈ నెల జీతాలు అందనట్లే. నిధులు లేవనే మాట అబద్దమని.. కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని పూర్తి ఆధారాలతో సహా తదుపరి విచారణలో కోర్టు ముందుంచాలని నిర్ణయించాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

షర్మిల రాజకీయానికి జగన్ బెదురుతున్నారా..?

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై జగన్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మరుసటి రోజే షర్మిలకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close