ఓటీటీ మార్కెట్ పై ‘వి’ ఎఫెక్ట్ ఎంత‌?

‘వి’ సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో అని చాలామంది నిర్మాత‌లు ఆసక్తిగా ఎదురు చూశారు. అమేజాన్ తో పాటు మిగిలిన ఓటీటీ సంస్థ‌లూ… `వి`పై బాగా ఫోక‌స్ చేశాయి. కార‌ణం సింపుల్‌. ఈ సినిమా రిజ‌ల్ట్ ని బ‌ట్టి – త‌మ సినిమాల్ని ఓటీటీల‌కు ఇచ్చుకోవాలా వ‌ద్దా? అనే విష‌యంలో నిర్మాత‌ల‌కు ఓ క్లారిటీ వ‌స్తుంది. అటు ఓటీటీ సంస్థ‌ల‌కు సైతం… `పెద్ద సినిమాలు కొనాలా, వ‌ద్దా` అనే విష‌యంలో ఓ నిర్ణ‌యానికి రావొచ్చని.

`వి` పెద్ద సినిమా. దాదాపు 33 కోట్ల‌కు ఈ సినిమాని అమేజాన్ కొనేసింది. అంటే.. సినిమా బ‌డ్జెట్ ఓటీటీ ద్వారా వ‌చ్చేసిన‌ట్టే. అస‌లు సినిమాలు విడుద‌ల అవుతాయా? కావా? ఆ డ‌బ్బులు నిర్మాత‌కు ఎప్పుడు తిరిగొస్తాయి? అనే సందేహాల మ‌ధ్య ఉక్కిరి బిక్కిరి అవుతున్న వేళ‌, ఓటీటీ ద్వారా ఓ ఆదాయ మార్గం దొర‌క‌డం నిజంగానే ఓ అనుకోని వ‌రం. లాభాల మాట ప‌క్క‌న పెడితే, పెట్టిన పెట్టుబ‌డి తిరిగి వ‌స్తుంద‌న్న భ‌రోసాని ఓటీటీ వేదిక క‌ల్పించింది.

`వి`లాంటి పెద్ద సినిమాని, ఇంత భారీ మొత్తం వెచ్చించి అమేజాన్ కొన్న‌దీ అంటే.. మిగిలిన సినిమాలూ అటు వైపు దృష్టి సారించే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉంటాయి. ఓటీటీ వైపు కొత్త సినిమాలు ప్ర‌వాహంలా వ‌చ్చి ప‌డిపోయే ఛాన్సుంది. కానీ.. `వి` రిజ‌ల్ట్ బాగా తేడా కొట్టేసింది. ఈ సినిమాపై విప‌రీత‌మైన నెగిటీవ్ ట్రోలింగ్‌. ఇంట్లో ఫ్రీగా అమేజాన్ లో సినిమా చూసేద్దాం అనుకున్న వాళ్లు సైతం.. ఆ ట్రోలింగ్ ల‌కు భ‌య‌ప‌డి, `వి` వైపు చూడ‌ని ప‌రిస్థితి. ఈ సినిమా రిజ‌ల్టు తెలుసుకొని, స‌బ్ స్రైబ్ చేసుకుందాం అనుకున్న వాళ్లు సైతం.. లైట్ తీసుకున్నారు. `వి` కోసం కొత్త గా చేరిన‌ స‌బ్ స్రైబ‌ర్లు ఎంత మంది అన్న లెక్క‌.. అమేజాన్ ద‌గ్గ‌ర త‌ప్ప‌కుండా ఉంటుంది. అయినా.. అమేజాన్ టార్గెట్, ఈ సినిమాతోనే 33 కోట్లు సంపాదించేద్దాం అని కాదు. త‌న ద‌గ్గ‌ర కంటెంట్ బ్యాంక్ పెంచుకోవ‌డానికి, ఉన్న స‌బ్ స్కైబ‌ర్ల‌ని కాపాడుకోవ‌డానికి ఇలాంటి సినిమాలు కొన‌డం అవ‌స‌రం.

కాక‌పోతే.. ఇక ముందు కొత్త సినిమాల్ని కొనడానికి మాత్రం అమేజాన్ లాంటి సంస్థ‌లు ఆచి తూచి అడుగులేస్తాయి. ఇంతింత పెద్ద మొత్తంలో ఆఫ‌ర్లు ఇవ్వ‌క‌పోవొచ్చు. సినిమా రిజ‌ల్ట్ తేడా కొడుతుందేమో అని, ముందుగానే భ‌య‌ప‌డి త‌మ సినిమాని ఓటీటీకి అమ్మేసుకుందాం అనుకున్న వాళ్ల‌కు.. ఇప్పుడు చుక్కెదుర‌య్యే ప్ర‌మాదం ఉంది. ఎందుకంటే సినిమాల్ని ఓటీటీల‌కు ఇచ్చుకోవ‌డానికి నిర్మాత‌లు రెడీగా ఉన్నా, ఓటీటీ సంస్థ‌లు మాత్రం – త‌మ సినిమాల్ని కొన‌డానికి సిద్ధంగా లేక‌పోవొచ్చు. ఎందుకంటే..`వి` ఎఫెక్ట్ అలాంటిది. నిశ్శ‌బ్దం, గుడ్ ల‌క్ స‌ఖీ, సోలో బ‌తుకే సో బెట‌రు.. ఇవ‌న్నీ దాదాపుగా ఓటీటీ రిలీజ్ కి రెడీ అయిపోయాయి. ఇవ‌న్నీ మెల్ల‌మెల్ల‌గా ప్ర‌మోష‌న్లు ప్రారంభించుకుని, విడుద‌లకు స‌మాయాత్తం అవ్వ‌బోతున్నాయి. వీటిలో ఒక‌టో రెండో – హిట్ట‌యితే త‌ప్ప‌, మ‌ళ్లీ ఓటీటీ మార్కెట్ పై ఆశ‌లు చిగురించ‌వు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close