ఐదు కోట్లు అడిగాడా.. ఎక్కువే!

ముకుంద‌, కంచె… ఇలా డీసెంట్ సినిమాల‌తో ప్ర‌యాణం సాగిస్తున్నాడు వ‌రుణ్ తేజ్‌. న‌టుడిగా వ‌రుణ్ ఓకే అనిపించుకొన్నా.. ఆ సినిమాలేం హిట్లుగా నిల‌వ‌లేదు. లోఫ‌ర్ అయితే ఫ్లాప్‌గా మిగిలిపోయింది. అయితే వ‌రుణ్ క్రేజ్ సినిమా సినిమాకీ పెరుగుతూ వ‌చ్చింది. దాంతో.. ఇప్పుడు పారితోషికం హైక్ చేసేశాడ‌ట‌. లోఫ‌ర్‌కి రూ.2 కోట్లు తీసుకొన్న వ‌రుణ్‌… ఇప్పుడు మిస్ట‌ర్ కోసం ఏకంగా రూ.5 కోట్లు అడుగుతున్నాడ‌ని టాక్‌. దాంతో మిస్ట‌ర్ సినిమా డైలామాలో ప‌డిన‌ట్టైంది. శ్రీ‌నువైట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి ముందు నుంచీ ఇబ్బందులే. సెకండాఫ్ స‌రిగా రాలేద‌న్న సాకు చూపి ఈ సినిమా స్టార్ట్ అవ్వ‌కుండా అడ్డుకొన్నాడు వ‌రుణ్‌. అయితే అదేం లేద‌ని, వీసాలు రాకే సినిమా ఆల‌స్య‌మైంద‌ని చిత్ర‌బృందం క్లారిటీ ఇచ్చింది. అయితే.. ఇప్పుడు పారితోషికంతో మోకాలడ్డుతున్నాడు వ‌రుణ్‌.

అయితే అస‌లు స‌మ‌స్య పారితోషికం కాద‌ని, ప్ర‌స్తుతం ఉన్న పరిస్థితుల్లో శ్రీ‌నువైట్ల‌తో సినిమా చేయ‌డం వ‌రుణ్‌కి ఇష్టం లేద‌ని, అందుకే పారితోషికం ఎక్కువ డిమాండ్ చేస్తున్నాడ‌ని చెప్పుకొంటున్నారు. దిల్‌రాజు సినిమా కోసం రెండున్న‌ర కోట్ల‌కే అగ్రిమెంట్‌పై సంత‌కాలు చేసిన వ‌రుణ్‌, మిస్టర్ కోసం రెట్టింపు పారితోషికం డిమాండ్ చేయ‌డం చూస్తేనే.. వ‌రుణ్‌కి ఈ సినిమా చేయాల‌న్న ఆస‌క్తి లేద‌న్న విష‌యం అర్థ‌మైపోతోంద‌ని ఆయ‌న సన్నిహితులు గుస‌గుస‌లాడుకొంటున్నారు. ముందు శేఖ‌ర్ క‌మ్ముల సినిమాని మొద‌లెట్టాల‌న్న ఆలోచ‌న‌లో వ‌రుణ్ ఉన్నాడ‌ని, అందుకే ఇలా త‌ప్పించుకొంటున్నాడ‌ని చెప్పుకొంటున్నారు. మ‌రి వ‌రుణ్ మ‌న‌సులో ఏముందో, ఎందుకు మిస్ట‌ర్‌ని దూరంగా పెడుతున్నాడో, ఆయ‌న‌కే తెలియాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close