రివ్యూ: విడుదల: పార్ట్‌1

Vidudhala part 1 movie telugu review

తెలుగు360 రేటింగ్ : 2.75/5

పోస్టర్ పై దర్శకుడు పేరు చూసి మరో ఆలోచన లేకుండా సినిమాకి వెళ్ళిపోయే ఇమేజ్ కొందరికి వుంటుంది. వెట్రిమార‌న్‌ ఈ కోవలోకే వస్తారు. వెట్రిమార‌న్‌ సినిమాల్లో ఎలాంటి కథలు, పాత్రలు ఉంటాయో ఆయన సినిమాని అభిమానించే వారికి ఒక ఐడియా వుంటుంది. హార్డ్ హిట్టింగ్ కథలతో, సహజత్వానికి పెద్ద పీట వేస్తూ ఆయన చేసే సినిమాలు కొన్ని కల్ట్ క్లాసిక్స్ గా నిలిచాయి. ఇప్పుడు ఆయన నుంచి మరో సినిమా వచ్చింది. అదే విడుదల : పార్ట్‌1. ఇప్పటికే తమిళనాట విడుదలైన ఈ సినిమా ఈ రోజు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొందరు టచ్ చేయడానికి కూడా ఇబ్బంది పడే కథలు ఎంపిక చేసుకునే వెట్రిమార‌న్‌.. విడుదలలో ఎలాంటి కథని చెప్పారు? అది ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇచ్చింది?

1987 నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. దట్టమైన అడవీ ప్రాంతంలో వందమంది నివాసం వున్న ఓ చిన్న ఊరు. అడవి తప్పితే అక్కడే మరే ఇతర సౌకర్యం వుండదు. ప్రజాదళం పోరాటాలకు ఆ ఊరు కేంద్ర బిందువు. ప్రజాదళం నాయకుడు పెరుమాళ్ (విజయ్ సేతుపతి). తను ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. అతడ్ని పట్టుకోవానికి పోలీసు డిపార్ట్ మెంట్ ‘ఆపరేషన్ ఘోస్ట్ హంట్’ని చేపడుతుంది. కొన్ని కంపెనీలు (క్యాంపులు) గా విడిపోయి ప్రజాదళ నాయకులని పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. రాఘవేందర్ ఓసి (కంపెనీ ఇన్‌ఛార్జ్ ) నాయకత్వంలో ‘ఈ’ కంపెనీ పని చేస్తుంటుంది. ఆ క్యాంప్ కి బదిలీ పై వస్తాడు కానిస్టేబుల్ కుమరేశన్ (సూరి). తను డ్రైవర్. క్యాంప్ కి దూరంగా పని చేస్తున్న పోలీసులకు భోజనం ఇవ్వడం అతని డ్యూటీ. ఒక రోజు రాఘవేందర్ ఆదేశాలు లెక్క చేయకుండా ఆ ఊర్లో ఓ ముసలవ్వ ప్రాణం కాపాడుతాడు సూరి. దీంతో ఆగ్రహించిన రాఘవేందర్, సూరికి లేనిపోని పనిష్మెంట్లు ఇస్తాడు. ఎన్ని పనిష్మెంట్లయినా భరిస్తాడు కానీ రాఘవేందర్ కు క్షమాపణ మాత్రం చెప్పడు సూరి. ప్రాణం కాపాడటం పోలీసు భాద్యత అనేది తన వాదన. ముసలవ్వ ప్రాణం కాపాడిన క్రమంలో మనవరాలు పాప (భ‌వానీ శ్రీ)తో కుమ‌రేశ‌న్ స్నేహం ఏర్పడుతుంది. తర్వాత ప్రేమగా మారుతుంది. ఈ క్రమంలో పాప గురించి ఓ నిజం తెలుసుకుంటాడు సూరి. ఏమిటా నిజం? పోలీసులు వెదుకుతున్న పెరుమాళ్ దొరికాడా ? అసలు ప్రజాదళం నాయకులకు, పోలీసుల మధ్య వైరం ఎందుకు ? పెరుమాళ్ ని పట్టుకోవడంలో సూరి ఎలాంటి పాత్ర పోషించాడు ? అనేది మిగతా కథ.

తీవ్ర వాదులకు, పోలీసులు మధ్య జరిగే సంఘర్షణ గురించి చాలా సినిమాలే వచ్చాయి. నక్సల్ మూమెంట్ ఉదృతంగా వుండే రోజుల్లో ఇలాంటి కథలకు ఆదరణ కూడా వుండేది. వెట్రిమార‌న్‌ విడుదల కూడా ఇలాంటి ఓ కథే. అయితే వెట్రిమార‌న్‌ లోని విలక్షణమైన శైలి.. ఈ విడుదలని ప్రత్యేకంగా నిలుపుతుంది. ఇలాంటి వాదాలు, సిద్ధాంతాలపై సినిమాలు తీసే దర్శకులు చాలా వరకూ బ్యాలెన్స్ చేయడానికి మొగ్గు చూపుతారు. కానీ వెట్రిమార‌న్‌ అలాంటి మొహమాటాల జోలికి పోలేదు. అనుకున్నది అనుకున్నట్లుగా చూపించాడు.

అడవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఓ మైనింగ్ కంపెనీ ఆహ్వానిస్తుంది ప్రభుత్వం. రోడ్లు, స్కూల్, హాస్పిటల్.. అన్ని వసతులు కల్పిస్తామని చెబుతుంది. పోలీసులు ప్రభుత్వ ఆదేశాలు మేరకు పనిస్తుంటారు. ‘’ప్రజాదళం అభివృద్ధి నిరోదకులు’’ అని పోలీసులు, ప్రభుత్వ వాదన.
‘’వందమంది వున్న ఓ ఊరుకి వంద మీటర్ల రోడ్డు వేశారంటే… అక్కడ ఉన్నదంతా దోచుకుపోవడానికే. సృష్టించలేని వనరుల్ని అంతం చేయడానికి ఏ ప్రభుత్వానికి అధికారం లేదు. మనమే దాన్ని కాపాడుకోవాలి. ముందు తరాలకి ఇవ్వాలి’’ ఇది ప్రజాదళం వాదన.

ఈ రెండు వాదాలని దరకుడు వెట్రి తనదైన శైలిలో ప్రజంట్ చేశాడు. దట్టమైన అడవి, అక్కడ మనుషులు, పోలీసులు క్యాంపులు.. అన్నీ చాలా సహజంగా చూపుతూ ఆ కథలో ప్రేక్షకులని భాగం చేసేస్తాడు. ఇది పెరుమాళ్ కథ అయినప్పటికీ.. కుమరేశన్ పాత్ర కథని ముందుకు నడుపుతుంది. మూడు సీన్లు తరవాత.. కుమరేశన్ తో ప్రయాణం మొదలుపెడతాడు ప్రేక్షకుడు. అంత సహజంగా ఆ పాత్రని తీర్చిదిద్దారు. పాప, కుమరేశన్ మధ్య నడిచే ప్రేమకథ కాస్త సాగదీత గానే వుంటుంది. అయితే ఆ ప్రేమకథ ఇందులో విడిగా వుండదు. పాప పాత్ర కూడా ఈ కథతో ముడిపడి వుంటుంది. మొదటి పార్ట్ కి క్లైమాక్స్ దొరికిందంటే.. అది ఈ ప్రేమకథ వలనే సాధ్యపడింది.

వెట్రి సినిమాల్లో హింస కాస్త ఎక్కువగానే వుంటుంది. ఇందులో కూడా సున్నిత మనస్కులు చూడాలేని హింస వుంది. విచారణ పేరుతో స్త్రీలని పోలీసులు హింసించిన తీరు అమానుషంగా వుంటుంది. బేసిగ్గా ఇలాంటి సినిమాలు తీసినప్పుడు రెండు వాదాలని బ్యాలెన్స్ చేయాలని చూస్తారు. కానీ వెట్రి అలాంటి నియమాలు ఏమీ పెట్టుకోలేదు. ఇందులో పోలీసులని విలన్స్ గానే చిత్రీకరించాడు వెట్రి. బూటకపు ఎన్ కౌంటర్లు ఎలా చేస్తారు ? అమాయకులని కాల్చి చంపినపుడు పోలీసుల ఎత్తుగడలు ఎలా వుంటాయి ? ఉద్యమాలని ప్రభుత్వాలు ఎలా వాడుకుంటాయి ? ఇలా విస్తుపోయే కోణాలు కొన్ని ఇందులో చూపించారు. అయితే విడుదల వెట్రిమార‌న్‌ సినిమాలని అభిమానించే వారికి నచ్చుతుంది కానీ మిగతా వారికి, అసలు నక్సల్ ఉద్యమం గురించి అవగాహన లేనివారికి.. ఈ సబ్జెక్ట్ అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. కథనంలో వేగం, కమర్షియల్ ఎలిమెంట్స్, ఊహించని మలుపులు కోరుకునే ప్రేక్షకులకు మాత్రం ఇది అంత ఉత్సాహాన్ని ఇవ్వలేకపోవచ్చు.

ఇది పెరుమాళ్ కథ. అయితే ఈ కథని చెప్పే భాద్యత కుమరేశన్ పై పడింది. ఆ పాత్రలో సూరి ఆశ్చర్యపరిచాడు. కామెడీ పాత్రలు చేసే సూరిని ఇలాంటి పాత్రలో చూపించాలనే వెట్రి ఆలోచనని మెచ్చుకోవాలి. నిజాయితీ, మనస్సాక్షి వున్న కానిస్టేబుల్ పాత్రలో సూరి నటన చాలా కాలం గుర్తుండిపోతుంది. తన తప్పులేదని పై అధికారికి క్షమాపణలు చెప్పని సూరి.. పాప గతం విని అక్కడి నుంచి వెళ్ళిపోయి.. తిరిగి క్షమాపణలు చెప్పే సన్నివేశం చాలా హృద్యంగా వుంటుంది. చివర్లో పెరుమాళ్ పై గన్ పెట్టే సన్నివేశంలో థియేటర్ లో విజల్స్ పడ్డాయంటే.. అది ఆ పాత్రని దర్శకుడు తీర్చిదిద్దిన తీరులోని గొప్పదనమే. పార్ట్ వన్ లో విజయ్ సేతుపతిది క్యామియో రోల్ అనే చెప్పాలి. అయితే కనిపించిన కొన్ని సీన్లే అయినా తన ప్రజన్స్ కట్టిపడేస్తుంది. పాప పాత్రలో చేసిన భ‌వానీ శ్రీ నటన మరో ఆకర్షణ. ఓసీ గా చేసిన చేత‌న్ పాత్ర ఇందులో మరో హైలెట్. చాలా క్రూరమైన పాత్రది. గౌత‌మ్ మేన‌న్‌, రాజీవ్ మీన‌న్ ప్రజన్స్ బావుంది. మిగతా నటీనటులు పరిధి మేరకనిపించారు.

సాంకేతికంగా సినిమా చాలా బావుంది. ప్రతి ఫ్రేం ని చాలా డెప్త్ తో డిజైన్ చేశాడు దర్శకుడు. ప్రేక్షకుడికి కూడా అడవిలో వున్న అనుభూతే కలుగుతుంది. ఇళయరాజా నేపధ్య సంగీతం మరో ప్రధాన ఆకర్షణ. యనభైలో జరిగే కథ ఇది. ఆ రోజుల్లో ఎలాంటి సింథ్ లు వాడేవారో ఇళయరాజా కంటే ఎవరికీ తెలుసు. ఆ డెప్త్ ని భలే పట్టుకున్నారు. రీరికార్డింగ్ అదిరిపోయింది. సింఫనీ వర్క్ అయితే చాలా బాగా కుదరింది. కెమరాపనితనం బ్రిలియంట్ గా వుంది.

పార్ట్ వన్ లో కుమరేశన్ పాత్రే చుట్టూనే సన్నివేశాలని నడిపిన వెట్రి .. అసలు కథని రెండో సగంలో ఉంచాడు. చివర్లో రెండో భాగంలోని కొన్ని సీన్లు చూపించారు. పోలీస్ స్టేషన్ లో విజయ్ సేతుపతి కాళ్ళు మీద కాళ్ళు వేసుకొని కూర్చున్న ఒక్క సీన్.. పార్ట్ 2 పై అంచనాలని పెంచుతుంది.
‘’హింస మా భాష కాదు.. కానీ ఆ భాషలో కూడా సమాధానం చెప్పగలం’’ అని చివర్లో విజయ్ సేతుపతి చెప్పిన డైలాగ్ పార్ట్ 2 లో హింస ఇంతకుమించి వుంటుందని చెప్పకనే చెబుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close