విజ‌య్ మ‌న‌ ‘బాహుబ‌లి’ని దాటేస్తాడా?

బాహుబ‌లి సృష్టించిన ప్ర‌భంజ‌నం అంతా ఇంతా కాదు. అన్ని చోట్లా.. వ‌సూళ్ల సునామీ అంటే ఎలా ఉంటుందో చూపించింది. త‌మిళ నాట కూడా ఓ రేంజులో విజృంభించింది. అక్క‌డి సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ సాధించిన వసూళ్ల‌ని అవ‌లీల‌గా కొట్టేసింది. ఇప్ప‌టికీ బాహుబ‌లి 2 రికార్డుల్ని అక్క‌డ ఎవ్వ‌రూ బ్రేక్ చేయ‌లేదు. ఆ అవ‌కాశం విజ‌య్‌కి ఉంద‌ని త‌మిళ ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. బాహుబ‌లి 2 త‌మిళ నాట దాదాపుగా రూ.130 కోట్లు సాధించింది. దాన్ని విజ‌య్ సినిమా క్రాస్ చేస్తోంద‌ని అభిమానులు న‌మ్ముతున్నారు. దీపావ‌ళి కానుక‌గా విడుద‌లైన ఈ చిత్రం త‌మిళ‌నాట విజ‌య‌ఢంకా మోగించింది. రివ్యూలు కాస్త అటూ ఇటుగా వ‌చ్చినా, విజ‌య్ అభిమానుల‌కు మాత్రం తెగ న‌చ్చేసింది. దాంతో ఈ సినిమాపై రేగిన వివాదాలు కూడా… భారీ ప్రచారం తీసుకొచ్చాయి. 4500 థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ చిత్రం తొలి రోజే రూ.40 కోట్లు సాధించింది. ప్ర‌స్తుతం వంద కోట్ల మైలు రాయికి అతి ద‌గ్గ‌ర‌లో ఉంది. ఆదివారం కూడా సెల‌వు రోజే కాబ‌ట్టి… ఈ వ‌సూళ్ల ఉధృతి ఇంకా కొన‌సాగే అవ‌కాశాలున్నాయి.

ఈ జోరు మ‌రో వారం రోజులున్నా క‌చ్చితంగా బాహుబ‌లి 2 రికార్డుని విజ‌య్ దాటొచ్చు. పైగా అక్క‌డో హిట్ వ‌చ్చి చాలా కాలం అయ్యింది. ప్రేక్ష‌కులూ మంచి ఆక‌లితో ఎదురుచూస్తున్నారు. విజ‌య్ సినిమా హిట్ట‌యితే ఆ రేంజే వేరుగా ఉంటుంది. ఇప్పుడు త‌మిళ నాట అదే క‌నిపిస్తోంది. బాహుబ‌లి 2 రికార్డుని విజ‌య్ సినిమా దాటేస్తుందా? అని విజ‌యేంద్ర ప్ర‌సాద్‌ని అడిగితే.. ”వ‌సూళ్లు బ్ర‌హ్మాండంగా ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ అయితే దాటేస్తోంది అనిపిస్తోంది. రెండు సినిమాల‌కూ ర‌చ‌యిత నేనే క‌దా.. అందుకే ఆనందంగానే ఉంటుంది” అంటున్నారాయ‌న‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.