విక్ర‌మ్ కె.కుమార్‌కి వైజ‌యంతీ పిలుపు

వైజ‌యంతీ మూవీస్ పూర్వ వైభ‌వంతో క‌ళ‌క‌ళ‌లాడుతోంది. ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యంతో ఓ హిట్టుకొట్టిన ఆ సంస్థ‌… ఇప్పుడు మ‌హాన‌టితో చ‌రిత్ర‌లో నిలిచిపోయే సినిమా తీసిన ఖ్యాతి ద‌క్కించుకుంది. నాగార్జున – నానిల మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్కిస్తున్న వైజయంతీ మూవీస్ ఇప్పుడు ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయ‌డానికి రంగం సిద్ధం చేస్తోంది. మ‌రోవైపు అగ్ర ద‌ర్శ‌కుల‌కు అడ్వాన్సులు ఇచ్చే ప‌నిలో ప‌డింది. అందులో భాగంగా విక్ర‌మ్ కె.కుమార్‌కి కూడా వైజ‌యంతీ అడ్వాన్సులు అందించిన‌ట్టు స‌మాచారం. 13బి, మ‌నం లాంటి సూప‌ర్ హిట్ల‌తో విక్ర‌మ్ కె.కుమార్ తెలుగులోనూ పాపుల‌ర్ అయ్యాడు. అయితే అత‌న్నుంచి వ‌చ్చిన `హ‌లో` బాగా నిరాశ ప‌రిచింది. నానితో ఓ సినిమా అనుకున్నారు గానీ, అనుకోకుండా ఆ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు వైజ‌యంతీ కోసం ఓ క‌థ రెడీ చేస్తున్నారు విక్ర‌మ్‌. అది ఎన్టీఆర్ కోస‌మా, లేదంటే మ‌రో క‌థానాయ‌కుడి కోస‌మా..? అనేది మాత్రం తెలియాల్సివుంది. ఇక మీద‌ట వైజ‌యంతీ మూవీస్ మాత్రం ఇది వ‌ర‌క‌టిలా వ‌రుస‌గా సినిమాలు చేస్తుంద‌న్న‌మాట‌. ఓ ప్రతిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ ఫామ్‌లోకి రావ‌డం, చిత్ర నిర్మాణం ముమ్మ‌రం చేయ‌డం.. ప‌రిశ్ర‌మ‌లో ఆహ్వానించ‌ద‌గిన ప‌రిణామం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎలక్షన్ ఎజెండా డిసైడ్ చేసిన రేవంత్ రెడ్డి

ఎన్నికలకు ఎజెండా డిసైడ్ చేసే పార్టీకే ఎక్కువ ఫలితాలు వస్తాయి. అలాంటి అజెండా డిసైడ్ చేయడానికి అందరూ ప్రయత్నిస్తారు. ఈ విషయంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. ముస్లిం రిజర్వేషన్ల...

కేసీఆర్ చెప్తున్న ఆ వ్యాఖ్యలను నమ్మి జనం ఓటేస్తారా..?

తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనని కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావులు పదేపదే చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడ చూసినా ఇదే రొటీన్ డైలాగ్ లా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో...

పెద్దిరెడ్డి విశ్వరూపం – వాడిపోతున్న రోజా !

నగరి వైసీపీలో ఐదు మండలాల ఇంచార్జ్‌లతో పాటు ఇతర నేతలంతా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి.. రోజాను ఘోరంగా ఓడించి .....

ప్రశ్నించిన మహిళ చెంప చెల్లుమనిపించిన కాంగ్రెస్ అభ్యర్ధి

ఫించన్ రావడం లేదని నిలదీసిన ఉపాధి కూలీ మహిళ చెంప చెల్లుమనిపించారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. శుక్రవారం నిజామాబాద్ జిల్లా గోవింద్ పేట్ , చేపూర్, పిప్రి గ్రామాల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close