ఈమధ్య ఒక్కడు టైటిల్ సిరీస్ హంగామా మళ్లీ మొదలైంది. నారా రోహిత్.. అప్పట్లో ఒకడుండేవాడు అనే టైటిల్ పెట్టుకొన్నాడు. విక్రమ్ సినిమా పేరేమో.. ఇంకొక్కడు. మంచు మనోజ్ సినిమాకి ఇంకొక్కడు అనే పేరు పెట్టారు. ఇప్పుడు విశాల్ కూడా ఒక్కడొచ్చాడు అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. విశాల్ కథానాయకుడిగా సురాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. తమన్నా కథానాయిక. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఒక్కడొచ్చాడు పేరు ఖరారు చేశారు. ఈ చిత్రం కోసం ఫైట్ మాస్టర్ కనల్‌కణ్ణన్ సారథ్యంలో భారీ ఎత్తున కోటిన్నర రూపాయల వ్యయంతో ఓ ఛేజ్‌ని చిత్రీకరించారు. పాండిచ్చేరిలో భారీ సెట్స్ వేసి దినేష్ నృత్యదర్శకత్వంలో హీరో విశాల్ ఇంట్రడక్షన్ సాంగ్‌ని చాలా లావిష్‌గా చిత్రీకరించారు. విశాల్, తమన్నాలపై శోభి నృత్య దర్శకత్వంలో భారీ సెట్స్‌లో కోటి రూపాయల వ్యయంతో ఓ పాట తీశారు. హిప్ ఆప్ సంగీతం అందిస్తున్నాడు. రష్యాలో త్వరలోనే రెండు పాటల్ని తెరకెక్కిస్తారట. అక్టోబరు 29న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఆగస్ట్ 29 విశాల్ బర్త్‌డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేయనున్నట్టు చిత్రబృందం తెలిపింది.