మంచువారి.. మంచి జోక్‌

మోహ‌న్‌బాబుకి త‌న ఇంట్లో ఉన్న హీరోల‌పై ఎంత న‌మ్మ‌క‌మో? ఏ తండ్రికైనా అలాంటి న‌మ్మ‌కాలు ఉండాల్లెండి. కాక‌పోతే… మోహ‌న్‌బాబుది ఎప్పుడూ ఓవ‌ర్ ఎక్స్‌పెక్టేష‌న్సే. తాజాగా ఈడోర‌కం ఆడోర‌కంలోనూ… మోహ‌న్ బాబు మాట‌ల్లో అదే ధ్వనించింది. `గుండ‌మ్మ క‌థ‌` సినిమాని ఆయ‌నకు రీమేక్ చేయాల‌ని వుంద‌ట‌. త‌ప్పేం లేదు. కానీ హీరోలె ఎవ‌ర‌నుకొంటున్నారు?? మంచు విష్ణు, రాజ్ త‌రుణ్‌. అదే అస‌లు సిస‌లైన జోక్‌. దీనికంటే బ్ర‌హ్మాండ‌మైన జోకేంటంటే ఈసినిమాకి జి. నాగేశ్వ‌ర‌రెడ్డికి ద‌ర్శ‌కత్వ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌ట‌.

గుండ‌మ్మ క‌థ‌.. ఆల్ టైమ్ గ్రేటెస్ట్ హిట్‌. ఓ క్లాసిక్ సినిమా అది. దాన్ని ముట్టుకోవ‌డం అతి పెద్ద సాహ‌సం. ఎన్టీఆర్ – నాగ‌చైత‌న్య‌లు సైతం ఈ సినిమాని చేద్దామ‌నుకొన్నారు. కానీ.. ఇంత‌టి మ‌హోన్న‌త స‌బ్జెక్ట్‌ని త‌ల‌కెక్కుకోగ‌లిగిన ద‌మ్ము ఏ ద‌ర్శ‌కుడికి ఉంది? స‌రే.. ద‌ర్శ‌కుడు దొరికాడ‌నుకొందాం. గుండ‌మ్మ‌గా.. సూరేకాంతంని భ‌ర్తీ చేస్తారా? ఎస్వీ రంగారావు పాత్ర‌కు ధీటైన న‌టుడ్ని తీసుకొస్తారా? అస‌లు ఎన్టీఆర్‌, ఏఎన్నార్ పాత్ర‌ల‌కు విష్ణు, రాజ్ త‌రుణ్‌లు స‌రిపోతారా? ఏంటో పెద్దాయ‌న‌.. ఇవ‌న్నీ ఆలోచించ‌కుండా మాట్లాడేశారు. దాంతో ఆయ‌న సీరియ‌స్‌గా చెప్పిన విష‌యం కూడా జోకైపోయిందిప్పుడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిల రాజకీయానికి జగన్ బెదురుతున్నారా..?

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై జగన్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మరుసటి రోజే షర్మిలకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు....

నిస్సహాయుడిగా కేసీఆర్..!?

బీఆర్ఎస్ నేతలపై కేసీఆర్ పట్టు కోల్పోతున్నారా..? క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే ఆ పార్టీలో క్రమశిక్షణ లోపిస్తుందా..? నేతలు హద్దులు దాటుతున్న చర్యలు తీసుకోని నిస్సహాయ స్థితికి కేసీఆర్ చేరుకున్నారా..? అంటే అవుననే...
video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close