ఈవీఎంల భ‌ద్ర‌త‌పై విజ‌యసాయికి ఎందుకింత టెన్ష‌న్‌?

ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చిన ద‌గ్గ‌ర్నుంచీ వైకాపా ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చేస్తున్న హ‌డావుడి చూస్తున్నాం. ఏపీలోని ఉన్న‌తాధికారుల‌పై న‌మ్మ‌కం లేదంటారు, పోలీసులు టీడీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటారు, ఎన్నిక‌లు విధుల‌కు ఏపీ అధికారుల‌కు ప‌నికిరారంటారు… మొత్తానికి, ఏదైతేనేం అనుకున్న‌ట్టుగానే ఫిర్యాదులు చేశారు, ఆశించిన‌ట్టుగానే ఈసీ ద్వారా కొన్ని బ‌దిలీలూ మార్పులూ చేయించుకున్నారు. ఎన్నిక‌లు జ‌రిగిపోయాయి క‌దా.. ఇక్క‌డితో ఆగొచ్చు క‌దా! కానీ, ఆయ‌న ఇంకా హ‌డావుడి ప‌డుతూనే ఉన్నారు. ఈవీఎంల‌ను ఎలా భ‌ద్రంగా స్ట్రాంగ్ రూముల్లో దాచాలో ఎన్నిక‌ల సంఘానికే సూచ‌న‌లు ఇస్తూ మొన్న‌నే ఒక లేఖ రాసిన సంగ‌తి తెలిసిందే. దానికి కూడా రాష్ట్ర పోలీసులు ప‌నికిరారు, కేంద్ర బ‌ల‌గాల ప‌హారా పెట్టాలీ, సీసీ టీవీ కెమెరాలు పెట్టాలంటూ ఓ పెద్ద లేఖ రాశారు. ఇప్పుడు సొంత పార్టీ నేత‌ల‌కు ఒక సర్క్యులేష‌న్ జారీ చేశారు.

స్ట్రాంగ్ రూముల వ‌ద్ద వైకాపా ప్ర‌తినిధులు అత్యంత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు విజ‌య‌సాయిరెడ్డి. అన్ని జిల్లాల్లో ఈవీఎంలు స్ట్రాంగ్ రూముల్లో భ‌ద్రంగా ఉన్నాయనీ, వాటికి మూడంచెల భ‌ద్ర‌త క‌ల్పిస్తార‌ని నేత‌ల‌కు చెప్పారు. ఓట్ల లెక్కింపు రోజు వ‌రకూ పార్టీకి చెందిన‌వారు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌న్నారు. స్ట్రాంగ్ రూమ్ బ‌య‌ట టెంట్ వేసుకుని, ఒక్కో రాజ‌కీయ‌ పార్టీకి ఇద్ద‌రు ప్ర‌తినిధులు ఉండే అవ‌కాశం ఉంటుంద‌నీ, దాన్ని పూర్తిగా వినియోగించుకోవాల‌ని సూచించారు. 24 గంట‌లు షిఫ్టులో ఒక‌రు లేదా ఇద్ద‌రు చొప్పున ప్ర‌తినిధులు అక్క‌డ ఉండాల‌నీ, మూడు షిఫ్టుల్లో అయినా ప్ర‌తినిధులు అక్క‌డ ఉండొచ్చ‌ని జిల్లాల‌కు చెందిన నేత‌ల‌కు ఆయ‌న సూచించారు.

ఎన్నిక‌లు జ‌రిగిన ప్రతీసారీ ఇవన్నీ స‌ర్వ‌సాధార‌ణంగా జ‌రిగేవే. ఇవ‌న్నీ ఎన్నిక‌ల సంఘం విధులు. ఈవీఎంల‌కు ఎలాంటి భ‌ద్ర‌త క‌ల్పించాలో వారు చూసుకుంటారు. ఈసీకి ఇవ‌న్నీ కొత్తేం కాదు. స్ట్రాంగ్ రూముల ద‌గ్గ‌ర పార్టీల ప్ర‌తినిధులు ఉండ‌టం కూడా స‌ర్వ‌సాధార‌ణ‌మైన విష‌య‌మే, రెగ్యుల‌ర్ గా జ‌రిగేదే. దీనిపై టెన్ష‌న్ ప‌డాల్సిన ప‌నిలేదు. బ‌హుశా ఆయ‌న‌కి ఎన్నిక‌లు కొత్తేమో అనే అభిప్రాయం క‌లిగించేలా ఆయ‌న హ‌డావుడి ప‌డుతున్నారు. ఈ అతి స్పంద‌న చూస్తుంటేనే… ఈసీ ప‌నితీరుపై వారికి కూడా అనుమానాలున్నాయా, వారికీ పూర్తిగా న‌మ్మ‌కం లేదేమో అనిపిస్తుంది. లేదంటే, ఎన్నిక‌లు సంఘం చేయ్యాల్సిన రోజువారి విధులను కూడా ఎలా నిర్వ‌ర్తించాల‌నే స‌ల‌హాలు విజ‌యసాయి రెడ్డి ఇవ్వ‌డ‌మెందుకు?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close