హీరో సైకిల్: చెరో రెండున్నరేళ్లు పంచుకునే ప్రతిపాదన టిడిపి చేస్తుందా ?

సోషల్ మీడియాలో తాజాగా “హీరో సైకిల్” ట్రెండింగ్ అవుతోంది. ఆచంట లో టిడిపి జనసేన కలిసి అధికారాన్ని పంచుకుని వైఎస్ఆర్సిపి కి షాక్ ఇచ్చిన తర్వాత 2024 ఎన్నికలలో టిడిపి జనసేన కలిసి మళ్లీ పోటీ చేస్తాయేమో అన్న సందేహాలు, చేస్తే బాగుంటుంది అన్న ప్రతిపాదనలు జోరు గా వస్తున్నాయి. అయితే ఈ హీరో సైకిల్ కాన్సెప్ట్ పై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

టిడిపి జనసేన కలసి పని చేయాలి అంటున్న మాజీ మంత్రులు, నేతలు:

ఆచంటలో టిడిపి జనసేన మధ్య అవగాహన కుదిరిన తర్వాత మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ భవిష్యత్తులో మళ్లీ టిడిపి జనసేన కలిసి పని చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల రఘురామకృష్ణంరాజు కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వెలిబుచ్చిన సంగతి తెలిసిందే. మరొక సందర్భంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఒకవేళ టిడిపి జనసేన కలిసి పోటీ చేస్తే కచ్చితంగా 2024లో అధికారాన్ని సాధిస్తారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

టిడిపి అనుకూల మీడియా లో కూడా ఇదే చర్చ:

ఆంధ్రప్రదేశ్ లో ఏ మీడియా ఏ పార్టీకి కొమ్ము కాస్తోంది అన్న విషయం చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఇప్పుడు టిడిపి అనుకూల చానల్స్ కొన్ని టిడిపి జనసేన కలిసి 20 24 ఎన్నికల్లో పోటీ చేస్తే బాగుంటుందనే కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే సముచితమైన రీతిలో సీట్లు , ఒకవేళ అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ కి ఉప ముఖ్యమంత్రి పదవి, జనసేన పార్టీకి కొన్ని కీలక మంత్రి పదవులు ఇవ్వడానికి టిడిపి సిద్ధంగా ఉందంటూ కథనాలు ప్రసారం చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అంతర్గత అభిప్రాయాన్ని ప్రతిబింబించే ఈ చానల్స్ లో వస్తున్న కథనాలు కచ్చితంగా తెలుగుదేశం పార్టీ లో అంతర్గతంగా జరుగుతున్న చర్చ ని ప్రతిబింబిస్తున్నాయి అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కలుగుతుంది.

అప్పుడు చేతులారా దూరం చేసుకుని, ఇప్పుడు స్నేహం కోసం ఆరాటం:

పవన్ కళ్యాణ్ 2014లో తెలుగుదేశం పార్టీకి బేషరతుగా మద్దతు ఇచ్చాడు. ఒక ఎమ్మెల్యే సీటు తీసుకోకుండా , పైసా ప్రయోజనం ఆశించకుండా ఆ పార్టీ కోసం పని చేశాడు. సభ లు నిర్వహించాడు. అయితే అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పట్ల నోటితో పలకరించి నొసటి తో వెక్కిరించే వైఖరి ప్రదర్శించింది. తెలుగుదేశం పార్టీ నేత లైన అశోక్ గజపతిరాజు, చింతమనేని ప్రభాకర్ లు పవన్ కళ్యాణ్ ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. అసలు పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదు అని అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానిస్తే, సొంత అన్న ని గెలిపించుకోలేని పవన్ కళ్యాణ్ మమ్మల్ని గెలిపించాడని ఎలా అంటారు అంటూ చింతమనేని వ్యాఖ్యానించాడు. వీరిద్దరి వ్యాఖ్యలు ఒక ఎత్తైతే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, మరియు స్టార్ అయినటువంటి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఎవరో నాకు అసలు తెలియదు అంటూ అహంకారంగా చేసిన వ్యాఖ్యలు జనసేన పార్టీ అభిమానులను చిర్రెత్తించాయి. పైగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా పనిచేసే అగ్ర చానల్స్ లో పవన్ కళ్యాణ్ పై జరిగిన విష ప్రచారం వెనుక టిడిపి ఉందని అభిప్రాయం ఆ పార్టీ అభిమానుల లో బలంగా కలిగింది. దీంతో పవన్ కళ్యాణ్ కూడా సరైన సమయం చూసి ఆ పార్టీకి వ్యతిరేకంగా టర్న్ తీసుకున్నారు. అయితే జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ని సముచితమైన రీతిలో గౌరవించి అంటే ఆ స్నేహం విడిపోయేది కాదన్న అభిప్రాయం విశ్లేషకుల్లో ఉంది.

చెరో రెండున్నర సంవత్సరాలు అధికారం పంచుకునే ప్రాతిపదిక టీడీపీ చేస్తోందా?

అధికారం చేపట్టిన నాటి నుండి జగన్ తెలుగుదేశం పార్టీ నేతల పట్ల కక్ష పూరిత వైఖరి ప్రదర్శిస్తున్నారని, మరొక పర్యాయం వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీని ఆ పార్టీ నేతలను బతకనివ్వడు అన్న అభిప్రాయం ఆ పార్టీ నేతలలోను, క్యాడర్ లోను బలంగా వినిపిస్తోంది. దూరం చేసుకున్న పవన్ కళ్యాణ్ ని మళ్లీ దగ్గరకు తీసుకు రావాలంటూ ఆ పార్టీ నేతలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చింతమనేని, పితాని వంటి నేతలు ఈ తరహా వ్యాఖ్యలు ఇప్పటికే చేసి ఉన్నారు. అయితే జనసేన వైపు నుండి ఎటువంటి ప్రతి స్పందన రావడం లేదు. జనసేన క్యాడర్ లో కూడా చంద్రబాబుతో కలిస్తే తమ పార్టీకి భవిష్యత్తు ఉండదని, ఒకసారి అధికారం వస్తే, మళ్లీ 2018లో పవన్ మీద విషప్రచారం చేసినట్లుగా మళ్లీ చేయరు అన్న గ్యారెంటీ లేదని అభిప్రాయం వినిపిస్తోంది.

ఈ లెక్కన జనసేన పార్టీ ని తమ వైపు తిప్పుకోవాలంటే చెరో రెండున్నర సంవత్సరాలు అధికారం పంచుకునే విధంగా ప్రతిపాదిండం ఒకటే మార్గం అన్న అభిప్రాయం తెలుగుదేశం పార్టీ సీనియర్ల లోని ఒక వర్గం వినిపిస్తోంది. అయితే మరొక వర్గం మాత్రం అనవసరంగా జనసేన ను తాము బలోపేతం చేయడం ఎందుకు అన్న వాదన వినిపిస్తోంది.

ఇంకొక పర్యాయం జగన్ ప్రభుత్వం వస్తే తెలుగుదేశం పార్టీకి అత్యంత గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందన్న విశ్లేషణల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రెండున్నర సంవత్సరాలు అధికారం పంచుకునే ప్రాతిపదికన జనసేన పార్టీని కలుపుకుపోయే ప్రయత్నం చేస్తుందా లేక ఇవన్నీ కేవలం రూమర్స్ గా మిగిలిపోతాయా అన్నది వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క్రికెట్ మ్యాచ్‌లో ‘కుబేర‌’ స‌ర్‌ప్రైజ్‌

నాగార్జున మ‌న‌సు మ‌ల్టీస్టార‌ర్ల‌వైపు మ‌ళ్లింది. ఇప్పుడాయ‌న చేతిలో రెండు మ‌ల్టీస్టార‌ర్లు ఉన్నాయి. వాటిలో 'కుబేర‌' ఒక‌టి. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. ధ‌నుష్ క‌థానాయ‌కుడు. ఇందులో నాగార్జున కీల‌క పాత్ర పోషిస్తున్న...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ -...

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని ఫోటో మాయం..కారణం అదేనా..?

ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమవ్వడం చర్చనీయాంశం అవుతోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close