వైసీపీ కాంట్రాక్టర్లూ ముందుకు రావడం లేదా..!?

ఆంధ్రప్రదేశ్‌లో విచిత్రమైన పరిస్థితి ఉంది. సాధారణంగా ఎమ్మెల్యేలపై వారి అనుచరుల నుంచి ఒత్తిడి ఉంటుంది. పార్టీ అధికారంలోకి వచ్చింది.. తమకేమైనా ఆదాయ మార్గాలు చూపించాలని విజ్ఞప్తిచేస్తూ ఉంటారు. గతంలో సీఎం జగన్ కూడా.. మన ప్రభుత్వం వచ్చాక.. నామినేషన్ పద్దతిపై అందరికీ కాంట్రాక్ట్ పనులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఏపీలో చేయడానికి బోలెడన్ని పనులు ఉన్నాయి. ఇతర పనుల సంగతి పక్కన పెడితే.. రోడ్లను రిపేర్ చేయడానికి ప్రతి నియోజకవర్గంలోనూ కోట్ల రూపాయల విలువైన పనులు ఉన్నాయి. ఆ పనులు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

కానీ.. పనులు చేయడానికి కాంట్రాక్టర్లే సిద్ధంగా లేరు. నామినేషన్ పద్దతిన అయినా పనులు ఇస్తాం చేయమని వైసీపీ ఎమ్మెల్యేలు తమ అనుచరుల్ని అడుగుతున్నా.. వారు వద్దంటున్నారు. తాము పనులు చేపట్టలేమని.. తమకు పనులేమీ వద్దని అంటున్నారు. పార్టీ క్యాడర్ తీరుతో ఎమ్మెల్యేలు కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే.. వారు మాత్రం పెద్దగా ఒత్తిడి చేయడం లేదు. అలా ఒత్తిడి చేస్తే తమకు ఇబ్బంది అని వారికి అర్థమైపోయింది. దీనికి కారణం.. కాంట్రాక్టులు తీసుకుని తర్వాత బిల్లులు చెల్లింకపోతే.. ఆ నేతలంతా తమపై పడతారని.. వారికి సర్ది చెప్పడం కష్టమని అనుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించే పరిస్థితిలో లేదు.

ఇంతకు ముందు పనులు చేసిన కాంట్రాక్టర్లకు పెద్ద ఎత్తున బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ బిల్లులు క్లియర్ చేస్తేనే వారుపనులు చేస్తామని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. మరికొంత మంది అయితే బిల్లుల కోసం కోర్టుకు వెళ్తున్నారు. ఈ పరిణామాలతో వైసీపీలో కాంట్రాక్ట్ పనులు అడిగేవారు లేరు.. ఇద్దామన్నా చేసేవారు లేకుండా పోయారు. ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందుల కారణంగా. .. పార్టీ నేతలకు కూడా ఆదాయమార్గాలు తగ్గిపోయాయన్న ఆవేదన వారి క్యాడర్‌లో కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close