అబ్దుల్ కలాం అవార్డుల నగదు ఇవ్వరా ?

జగన్ సర్కార్ కొత్తగా అధికారంలోకి వచ్చిన సమయంలో విద్యార్థుల ప్రతిభా పురస్కారాలకు అబ్దుల్ కలాం పేరు తీసేసి.. వైఎస్ఆర్ పేరు పెట్టాలనే జీవో వచ్చింది. ఇది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. తర్వాత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారని మీడియా ప్రకటన వచ్చింది. మళ్లీ అబ్దుల్ కలాం పేరు పెట్టారు. నవంబర్ 11వ తేదీన అవార్డుల ప్రదానోత్సవం కూడా చేసేశారు. కానీ.. అ అవార్డుల కింద ఇవ్వాల్సిన నగదు, ట్యాబ్ మాత్రం ఇంత వరకూ ఇవ్వలేదు. ఆ అవార్డుల కింద.. లక్షలకు లక్షలు ఏమీ ఇవ్వరు. ఒక్కొక్కరికి రూ. 20వేలు.. రూ. ఆరు వేలు విలువ చేసే ట్యాబ్ మాత్రమే ఇస్తారు. కానీ ఇప్పటికీ ఇవ్వలేదు.

చదువులో ప్రతిభ చూపించేవారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో… చంద్రబాబు ప్రభుత్వం అబ్దుల్ కలాం పేరు మీద పురస్కారాలు ఇస్తోంది. ఇందులో భాగంగా.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏడాది 7500 మంది ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకునే వారికి అవార్డులు ఇస్తున్నారు. ఈ పురస్కారాలు పొందిన వారికి రూ. 20వేల చెక్కు, ట్యాబ్ అప్పుడే వేదికపైనే ఇచ్చేవారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పేరు మార్పు వివాదం జరిగింది. తర్వాత జరిగిన అవార్డుల ఫంక్షన్‌లో.. చెల్లని చెక్కులు, ఫోటోలు దిగడానికి మాత్రమే కొన్ని ట్యాబ్‌లు తీసుకు వచ్చారు. కార్యక్రమం ముగిసిన తర్వాత చెక్కులు, ట్యాబ్‌లు విద్యార్థుల నుంచి వెనక్కి తీసుకున్నారు. డబ్బులు బ్యాంకులో వేస్తామని.. ట్యాబ్‌లు స్కూళ్లకు పంపుతామని సమచారం ఇచ్చారు.

విద్యా సంవత‌్సం ముగుస్తున్నా… వాటి జాడలేదు. తమ పిల్లలకు వచ్చిన అవార్డులకు వచ్చిన నగదు, ట్యాబ్‌ల సంగతేమిటని.. తల్లిదండ్రులు అధికారుల్ని సంప్రదిస్తూంటే.. బడ్జెట్ లేదనే సమాధానం వస్తోంది. కొసమెరుపేమిటంటే.. అవార్డుల ప్రధానోత్సం జరిగిన రోజున ప్రశంసా పత్రం, మెడల్‌ను ప్రదానం చేశారు. మెడల్‌కు వైసీపీ రంగు వేసేశారు. అప్పట్లో ఈ మెడల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అవార్డులు పొందిన వారికి ఆ రంగులే మిగిలాయి. డబ్బులు, ట్యాబ్ మాత్రం ఇప్పటి వరకూ అందలేదు. వైఎస్ఆర్ పేరు పెట్టనివ్వలేదనే.. ఇవ్వట్లేదేమోనన్న అభిప్రాయాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు.. కక్ష పూరితంగా వ్యవహరిస్తున్న తీరు చూస్తే.. కావొచ్చని.. కొంత మంది నమ్ముతున్నారు కూడా…!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు..!!

సినీ నిర్మాత బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. హీరా గ్రూపు సీఈఓ నౌహీరా షేక్ ఫిర్యాదు ఆధారంగా ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బండ్ల...

ఏపీ ఉద్యోగుల చైతన్యం – 4 లక్షలకుపైగా పోస్టల్ బ్యాలెట్స్ !

ఏపీలో పోస్టల్ బ్యాలెట్స్ ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సారి ఉద్యోగుల్లో మరింత ఎక్కువగా చైతన్యం కనిపిస్తోంది. ఎన్నికల విధులు... ఎన్నికల సంబంధిత విధుల్లో ఉండేవారు పోస్టల్ బ్యాలెట్స్ వినియోగించుకోవచ్చు....

గవర్నర్ పై లైంగిక ఆరోపణలు..!!

వెస్ట్ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ పై రాజ్ భవన్ లో పని చేసే మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేసింది. ఉద్యోగం పేరిట ఆనంద్ బోస్ తనను లైంగికంగా వేధించారంటూ...

రిజర్వేషన్లపై కేసీఆర్ సైలెన్స్… కవిత కోసమేనా..?

దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు, రాజ్యాంగంపై రగడ కొనసాగుతోంది. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లేనని, రాజ్యాంగం రద్దుకు మద్దతు ఇవ్వడమేనని కాంగ్రెస్ వాదిస్తుండగా.. తాము రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని, రిజర్వేషన్లను ఎట్టి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close