వైసీపీ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వైసీపీ కోసం , జగన్ కోసం చేయాల్సినదంతా చేసి విజయసాయిరెడ్డి తర్వాత కోటరీ దెబ్బకు సైడైపోయారు. రాజ్యసభ సీటుకు కూడా రాజీనామా అకస్మాత్తుగా రైతన్న అవతారం ఎత్తారు. పురుగు మందు పిచికారీ చేస్తూ, ఎరువులు చల్లుతూ ఆయన విడుదల చేస్తున్న వీడియోలు విడుదల చేస్తున్నారు. అయితే దాన్ని అడ్డం పెట్టుకుని .. తాను రైతుగా చెప్పుకుని అమరావతి రైతులపై ప్రేమ కురిపిస్తున్నట్లుగా నటిస్తున్నారు. గతంలో చేసిన అన్యాయాన్ని ఆయన మర్చిపోరు. ఆయన టార్గెట్ .. జగన్ రెడ్డికి దగ్గర కావడమే. అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతోంది.
వైసీపీ అధికారం కోల్పోయినప్పటి నుండి పార్టీలో ఒక వర్గం సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉంది. సజ్జల ఇచ్చిన తప్పుడు సలహాల వల్లే జగన్ ప్రజలకు దూరమయ్యారని, పార్టీ పరిస్థితి ఇలా తయారైందని జగన్ వద్ద ఒక బలమైన వర్గం ఫిర్యాదు చేస్తోంది. అయితే జగన్ మాత్రం ఆయనను నమ్ముతూనే ఉన్నారు. కానీ ఇటీవల జగన్ కూడా సజ్జలను కొంత దూరం పెడుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. సజ్జల స్థానంలో ఒక సమర్థుడైన, పార్టీ పునాదుల నుంచి ఉన్న నాయకుడు కావాలని జగన్ భావిస్తున్న తరుణంలో.. విజయసాయిరెడ్డి పేరు మళ్లీ తెరపైకి వస్తోంది.
పార్టీలోని ఒక వర్గం జగన్ రెడ్డికి విజయసాయిరెడ్డి ప్రాముఖ్యతను గుర్తు చేసే పనిలో పడింది. సజ్జల వ్యూహాలు పార్టీని నాశనం చేశాయి, కానీ సాయిరెడ్డి లాంటి వారు పార్టీ కష్టకాలంలో అండగా నిలబడ్డారు అని జగన్ చెవిలో వేస్తున్నట్లు తెలుస్తోంది. సాయిరెడ్డికి మళ్లీ పగ్గాలు అప్పగిస్తే పార్టీకి పూర్వవైభవం వస్తుందని వారు నమ్ముతున్నారు. అందుకే, సాయిరెడ్డి కూడా గతంలో లేని విధంగా సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ జగన్ రెడ్డి వాదనను వినిపిస్తున్నారు. సజ్జలకు చెక్ పెట్టేందుకు సాయిరెడ్డి బాగా దగ్గరవుతున్నారు. వచ్చే ఆరు నెలల కాలంలో మళ్లీ వైసీపీలో విజయసాయిరెడ్డి యాక్టివ్ కావడం ఖాయమని ఆ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.


