టీడీపీలో ముస‌లం వస్తే వైకాపాకి ఎందుకు టెన్ష‌న్‌..?

గెలుపు త‌మ‌దే అనే ధీమా ఎన్నిక‌లైన మ‌రుక్ష‌ణం నుంచి వైకాపా నేత‌ల్లో దండిగా క‌నిపిస్తూ వ‌చ్చింది. అలాంట‌ప్పుడు, వారి పాయింటాఫ్ వ్యూలో తెలుగుదేశం పార్టీలో ఏం జ‌రిగినా, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇప్పుడేం చేస్తున్నా… అది మూణ్ణాళ్ల ముచ్చ‌టే క‌దా. వైకాపా నేత‌ల‌ అంచ‌నాల ప్ర‌కారం ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌బోయేది వారే. ఆ ధీమా వంద శాతం ఉన్న‌ప్పుడు ఈ ఇర‌వై రోజుల‌పాటూ ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు ఏం చేస్తే వారేకేం..? కానీ, ఈలోగా కూడా ఇంకా ఫిర్యాదులు, విమ‌ర్శ‌లు ఆప‌డం లేదు వైకాపా నేతలు. హైద‌రాబాద్ లోని లోట‌స్ పాండ్ లోని పార్టీ కార్యాల‌యంలో వైకాపా నేత శ్రీ‌కాంత్ రెడ్డి మాట్లాడుతూ… న‌ల‌భైయేళ్ల అనుభ‌వం అని చెప్పుకునే చంద్ర‌బాబు, రాష్ట్రంలోని వ్య‌వ‌స్థ‌ల‌న్నింటినీ నిర్వీర్యం చేశార‌ని విమ‌ర్శించారు. అండ‌ర్ వ‌రల్డ్ నుంచి త‌న‌కు స‌హాకారం అందుతోంద‌నీ, మాఫియా త‌న వెన‌క ఉంద‌నే అర్థం వ‌చ్చిన‌ట్టుగా చంద్ర‌బాబు మాట్లాడుతున్నార‌ని చెప్పారు.

ఈ త‌ర‌హా అర్థం వ‌చ్చేలా చంద్ర‌బాబు చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై కేసు న‌మోదు చేయాల‌ని ఎన్నిక‌ల సంఘాన్ని శ్రీ‌కాంత్ రెడ్డి కోరారు. కేసు న‌మోదు చేస్తేనే ప్ర‌జ‌ల‌కు చ‌ట్టంపై న‌మ్మ‌కం ఉంటుంద‌న్నారు. వీడియో కాన్ఫ‌రెన్స్ లో స‌ట్టా మార్కెట్ గురించీ, మ‌ట్కా గురించీ చంద్ర‌బాబు ఎలా మాట్లాడ‌తార‌ని నిల‌దీశారు. ఇలాంటి వ్య‌క్తి నాయ‌కుడిగా ఉండే త‌మ భ‌విష్య‌త్తు ఏంట‌నే ఆందోళ‌న ప్ర‌జ‌ల‌కు క‌లుగుతోంద‌న్నారు. తెలుగుదేశం పార్టీలో ముస‌లం మొద‌లైంద‌నీ, చంద్ర‌బాబును భ‌రించే స్థితిలో లేమ‌ని ఆ పార్టీ నాయ‌కులే అనుకుంటున్న ప‌రిస్థితి ఉంద‌న్నారు. చంద్రబాబు విధానాలతో విసిగిన‌వారంతా ఒక గ్రూపుగా ఏర్ప‌డుతున్నార‌ని, ఆయ‌న్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నార‌నీ శ్రీ‌కాంత్ రెడ్డి చెప్పారు.

స‌రే, ఈయ‌న చెబుతున్న‌ట్టే టీడీపీలో ముస‌లం వ‌చ్చిందే అనుకుందాం. అది ఎవ‌రికి ప్ల‌స్ అవుతుంది… వారికే క‌దా! ఇలాంటి నాయ‌కుడి సార‌థ్యంలో రాష్ట్రం ఉంటే భ‌విష్య‌త్తు ఏంట‌ని శ్రీ‌కాంత్ రెడ్డి ఎందుకు ఆందోళ‌న చెందాలి? వైకాపాకి అనుకూలం‌గానే ఫ‌లితాలు వ‌స్తాయి, ప్ర‌భుత్వం తామే ఏర్పాటు చేయ‌బోతున్నామ‌నే ధీమాతో ఉన్నారు క‌దా! అలాంట‌ప్పుడు రాష్ట్ర భ‌విష్య‌త్తు టీడీపీ చేతిలోనే ఉంటే ఎలా అనే ఈ ఆందోళ‌న‌ ఎందుకు..? ప‌రిస్థితుల‌న్నీ వారికి అత్యంత సానుకూలంగా క‌నిపిస్తున్న‌ప్పుడు…. ఈ టెన్ష‌న్ ఎందుకు?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రిజర్వేషన్లపై కేసీఆర్ సైలెన్స్… కవిత కోసమేనా..?

దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు, రాజ్యాంగంపై రగడ కొనసాగుతోంది. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లేనని, రాజ్యాంగం రద్దుకు మద్దతు ఇవ్వడమేనని కాంగ్రెస్ వాదిస్తుండగా.. తాము రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని, రిజర్వేషన్లను ఎట్టి...

మూగబోయిన భాగ్యనగర్ రైలు కూత…ఆ లీడర్లపై ప్యాసింజర్ల ఆగ్రహం

దాదాపు నలభై ఏళ్లపాటు పరుగులు పెట్టిన భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైలు కూత మూగబోయింది. మూడో రైల్వే మరమ్మత్తుల పేరిట దక్షిణ మధ్య రైల్వే అధికారులు భాగ్యనగర్ రైలును రద్దు చేశారు. ఇతర...

నెల్లిమర్ల రివ్యూ : అడ్వాంటేజ్ జనసేన లోకం మాధవి !

తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా జనసేన పట్టుబట్టి తీసుకున్న నియోజకవర్గం నెల్లిమర్ల. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ నియోజకవర్గం పరిధిలోనే బోగాపురం ఎయిర్ పోర్టు నిర్మించాల్సి ఉంది. కానీ జగన్ దాన్ని...

లోకేష్ యువగళం – మరో సారి బ్లాక్ బస్టర్ !

నారా లోకేష్ మంగళగిరిలో సైలెంట్ గా ప్రచారం చేసుకుంటే .. నారా లోకేష్ ఎక్కడ అని వైసీపీ నేతలు ఆరా తీస్తూ ఉంటారు. నారా లోకేష్ బయటకు వస్తే ప్రచారం ప్రారంభిస్తే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close