బీహార్ ఎన్నికలు: సీట్ల సర్దుబాట్లలో బిజెపి పైచేయి!

లోక్ సభ ఎన్నికల ఫలితాల నుంచి నేర్చకున్న పాఠం ప్రకారం ”కలసివుంటే కలదు సుఖం” సూత్రం ప్రకారం బీహార్ లో ముందుగా అవగాహనకు వచ్చిన నితీష్ లాలూ కాంగ్రెస్ కూటమిదే మొదటి రౌండులో పైచేయిగా కనిపింది. దీనికి విరుగుడు మంత్రమన్నట్టు ”ఒకరికోసం అందరు అందరికోసం ఒకరు” అనే విధానంతో సీట్లు సర్దుబాటు చేసుకుని బిజెమి కూటమి రెండో రౌండులో ఆధిక్యత సాధించినట్టు కనిపిస్తోంది. పోటీ నితీష్ కూటమి వేపే ఏకపక్షమని ఏడాదిగా విస్తరిస్తున్న అభిప్రాయాన్ని సీట్ల సర్దుబాటుతో బిజెపి తుంచివేసింది.

ఏడాదిన్నర మోదీ పాలనలో ఆయన పలుకుబడి ప్రతిష్ట జన సామాన్యంలో బలహీనమౌతున్న నేపధ్యంలో బీహార్ ఎన్నికల్లో బిజెపి కూటమి గెలవడం ముఖ్యం. లేకపోతే ఈ ప్రభావం వచ్చే ఏడాది జరిగే అస్సాం, పశ్చిమ బెంగాల్, పాండిచేరి, తమిళనాడు కేరళ రాష్ట్రాల పడుతుంది.

243 శాసనసభా స్ధానాలున్న బీహార్ లో బీజేపీ 160 స్థానాలు తీసుకుని రాంవిలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్‌జేపీకి 40, కుష్వాహా పార్టీ ఎల్‌జేఎస్‌పీకి 23, జీతన్‌రాం మాంఝీ పార్టీ హెచ్‌ఏఎంకి 20 సీట్లు ఇచ్చింది. కేంద్రంలో అధికారంలో ఉన్నందువల్ల మిత్రులను దారికి తెచ్చుకుని సీట్ల సర్దుబాటును బీజేపీ సజావుగా పూర్తి చేసుకోగలిగింది.

నితీష్, లాలూ యాదవ్‌లు సీట్ల సర్దుబాటుపై లెక్కలు వేసుకుంటుండగానే సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ) అధినేత ములాయంసింగ్ యాదవ్ తన పార్టీకి ఇస్తామన్న స్థానాలపై సంఖ్య నచ్చక కూటమినుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడం ఆ కూటమికి తొలిగాయం.

మరోవైపు ఎంఐఎం పార్టీ నేత అసదుద్దీన్ ఒవైసీ ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు వెల్లడించి ఆ నాయకద్వయాన్ని మరింత కుంగదీశారు. ముస్లిం ఓటర్లు అధికంగా ఉండే సీమాంచల్ (అరారియా, పూర్నియా, కిషన్‌గంజ్, కతిహార్ జిల్లాలు) ప్రాంతంలో మాత్రమే ఎంఐఎం పోటీ చేస్తున్నది. అక్కడ మొత్తం 24 స్థానాలున్నాయి.

నిరుడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బిహార్‌లో కూడా మోదీ గాలి వీచింది. అక్కడున్న 40 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ 22 గెల్చుకోగా, దాని మిత్రపక్షాలకు 9 స్థానాలు లభించాయి. విడివిడిగా పోటీచేసిన అధికార జేడీ (యూ)కు 2, కాంగ్రెస్‌కు 2, ఆర్జేడీకి 4 వచ్చాయి. గెల్చుకున్న స్థానాలు తక్కువే అయినా ఓట్ల శాతం ఎన్డీయేతో పోలిస్తే తమకే అధికమని, కనుక అసెంబ్లీ ఎన్నికల్లో సమష్టిగా పోటీ చేద్దామని జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్‌లు భావించాయి. అయితే దేవగౌడ, ములాయం తప్పుకోవడంతో జనతా పరివార్ పుట్టకముందే చనిపోయినట్టయింది. ఇప్పుడు అందులో చెప్పుకోదగిన పార్టీలు జేడీ(యూ), ఆర్జేడీలు మాత్రమే. కాంగ్రెస్ ఉన్నా దానికి అరటికెట్టు కి మించిన ప్రాముఖ్యత కనబడదు

నితీష్‌కుమార్… తమ పార్టీతో సమానంగా ఆర్జేడీకి 100 సీట్లు కేటాయించడం, మరో 40 స్థానాలు కాంగ్రెస్‌కు ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీపడినప్పుడు ఈ పార్టీలన్నిటికీ కలిపి ఎన్‌డీఏ కన్నా 9 శాతం అధికంగా మొత్తం 45 శాతం ఓట్లు మీద వచ్చాయి. కూటమిగా అదే స్థాయిలో ఫలితాలు వస్తాయనడానికి లేదు. లాలూ అవినీతి ఆయన పాలనలో రాష్ట్రంలో నెలకొన్న అరాచకాలు కూటమికి ప్రతికూల అంశాలే అవుతాయి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌ల్కి.. క‌మ‌ల్.. కంశుడు!

ప్ర‌భాస్ అభిమానులే కాదు, ఇండియ‌న్ సినిమా మొత్తం ఆశ‌గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్.. 'క‌ల్కి'. ప్ర‌భాస్ తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ లాంటి దిగ్గ‌జాలు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్‌,...

దర్శి రివ్యూ : హోరాహోరీ – కానీ బూచేపల్లికి ఎన్నో మైనస్‌లు !

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన రెండే మున్సిపాలిటీల్లో ఒకటి దర్శి. రెండోది తాడిపత్రి. తాడిపత్రిలోనూ కష్టం మీద గెలిచారు కానీ దర్శిలో మాత్రం టీడీపీ స్వీప్ చేసింది. నిజానికి అక్కడ నాయకుడు...

గత ఎన్నికలలో వైసీపీ కోసం ప్రచారం చేసిన వాళ్లేరి ?

అధికార అహంకారం జగన్మోహన్ రెడ్డిని అందరికీ దూరం చేసింది. తాను ఎవరి సాయంతో అధికారం అందుకున్నారో .. వాళ్లందర్నీ అవమానించి , వేధించడంతో దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ...

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close