భారత్ కు అమెరికా నమ్మదగిన ఫ్రెండేనా?

“భారత్‌ లాంటి భాగస్వామి అమెరికాకు , అమెరికా లాంటి భాగస్వామి భారత్ కు ఇప్పుడు ఎంతో అవసరం గతంలో అడుగడుగునా ఆధిక్యతను కనబరిచే అమెరికా ఇప్పుడు ఇచ్చిపుచ్చుకునే ధోరణిక మారడం వల్ల ఆదేశంతో ఒప్పందాలు అంటే భయపడాల్సిన అవసరం ప్రస్తుతానికి కనిపించడం లేదు” ఇదే సారశంగా పత్రికలలోవిశ్లేషణలు సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ఒబామా, భారత ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు దేశాధినేతలు ప్రసంగించే ఐక్యరాజ్య సమితి వార్షిక సమావేశాలకు, మోదీ అమెరికాలో భారతీయులను ఉద్దేశించి 27 న మాట్లాడే సభకు పదిరోజులు ముందునుంచే అమెరికాలో అమెరికా, భారత్ అధికారుల సమావేశాలు విరివిగా జరుగుతున్నాయి. మీడియా పరంగా పరస్పరం ఆశిస్తున్న అంశాలను ఉభయదేశాల అధికారుల వెలిబుచ్చుతున్నారు.

పాకిస్తాన్‌తో కలిసి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న చైనా దూకుడును అడ్డుకోవడానికి అమెరికా అండాదండా ఇప్పుడు భారత్‌కు మరీ ముఖ్యం. భారత్‌, అమెరికా, జపాన్‌లు వాణిజ్య, రక్షణ రంగాల్లో గత కొద్ది కాలంగా కలిసి కదులుతున్నాయి. ఉగ్రవాదంపై నిజాయితీగా పోరాటం చేస్తున్న ప్రపంచ దేశాల్లో భారత్‌ ప్రధమ స్థానంలో ఉంటుంది. అదే విధంగా వాణిజ్యపరంగా కూడా భారత్‌ నమ్మదగిన మిత్రుడు.

అందుకే అమెరికా భారత్‌కు అనుకున్న మేరకు స్నేహ హస్తం అందించేందుకు ముందుకు వస్తున్నది. భారత దేశంతో తన రక్షణ సంబంధాలను మరింత వేగవంతం చేయడానికి, అలాగే ఆ దేశంలో హైటెక్‌ మిలిటరీ పరికరాలను సంయుక్తంగా అభివృద్ధి చేయడం, సంయుక్తంగా తయారు చేసే ప్రక్రియను వేగవంతం చేయడానికి అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్‌ ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. పెంటగాన్‌ ఒక దేశం కోసం ప్రత్యేకంగా ఇలాంటి విభాగాన్ని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి.

నరేంద్రమోదీ ప్రభుత్వం వస్తు, సేవల జి ఎస్ టి పన్ను బిల్లు ఆమోదం సహా కీలకమైన సంస్కరణలను వేగంగా పూర్తి చేసి ఆర్ధిక వ్యవస్ధను పటిష్టం చేయాలని అమెరికాలో ఒబామా ప్ర‌భుత్వ సీనియ‌ర్ అధికారి నిషా దేశాయ్ బిస్వాల్ సూచించారు. ఆమె ఆదేశపు హోమ్‌ శాఖలో దక్షిణ, మధ్య ఆసియా విభాగానికి సహాయ కార్యదర్శి పదవిని చేపట్టిన తొలి భారత సంతతి అమెరికన్‌ మహిళ.

మోదీని భారతదేశపు గొప్ప ప్రచారకుడిగా (బ్రాండ్ అంబాసిడర్) నిషా దేశాయ్ అభివర్ణించారు. మోదీ సరళమైన విధానాలు, సాహసోపేతమైన నిర్ణయాలు అమెరికాలో ప్రయివేటు రంగం దృష్టిని భారత్ లో పెట్టుబడులపై దృష్టి పెట్టేలా చేశాయన్నారు. అయితే ప్రస్తుతం భారత్‌కు వెల్లువెత్తుతున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు), క్యాపిటల్‌ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల కొనుగోళ్లు మాత్రమే మోదీ ప్రభుత్వం ఆశిస్తున్న అత్యున్నత పురోగతికి సరిపోవని ఆమె అభిప్రాయపడ్డారు వస్తూత్పత్తి రంగం, ఉపాధి కల్పన వంటి రంగాలు ఊపందుకునేందుకు వీలుగా మరిన్ని పెట్టుబడులు ప్రవహించాల్సి ఉన్నదని, తద్వారా ఆర్థిక వృద్ధి కూడా ఆశించిన స్థాయిలో పరుగుపెడుతుందని వివరించారు. మోదీ ప్రభుత్వ సంస్కరణల వేగాన్నిబట్టే ఇదంతా ఆధారపడి వుటుందన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close