తెలంగాణ నిజంగా సంపన్న రాష్ట్రమేనా?

పదమూడు లక్షల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఇంతకన్నా టాప్ ప్రయారిటీ ప్రభుత్వానికి ఇంకేం ఉంటుంది? ఏ ఊరికి వెళ్లినా మూడు నాలుగు నెలల్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తానని హామీలు కుమ్మరించే ముఖ్యమంత్రి కేసీఆర్, మౌలికమైన విషయాల గురించి మాత్రం మాట్లాడరు. అదో రకం పరిపాలన కావచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్ మెంట్ కు సంబంధించి ప్రయివేటు కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1900 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఉంది గత ఏడాది చెల్లించాల్సిన మొత్తం కూడా ఉంది.

కొత్త విద్యా సంవత్సరం మొదలైంది. తరగతులు జరుగుతున్నాయి. ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్ము మాత్రం కాలేజీలకు రాలేదు. అది వచ్చినా రాకపోయినా కాలేజీలు తమ సిబ్బందికి ప్రతి నెలా జీతాలు ఇవ్వాల్సిందే. ఇంకా ఇతరత్రా మెయింటెనెన్స్ ఖర్చులు భరించాల్సిందే. విద్యను వ్యాపారంగా కాకుండా ఉన్నంతలో పిల్లలకు మంచి చదువు చెప్పాలనే భావనతో కాలేజీలను నడిపించే వారు కూడా ఉన్నారు. అలాంటి వారి పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. గుజరాత్ తర్వాత మనదే సంపన్న రాష్ట్రమని ఒకటికి పదిసార్లు చెప్పే ముఖ్యమంత్రి, ఈ సొమ్ము విడుదలలో జాప్యం ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు.

ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్ము ఏ సమయంలో ఎంత శాతం విడుదల చేయాలనేదానిపై ఒక విధానం రూపొందిచవచ్చు. ఆ ప్రకారం చెల్లింపులు జరపవచ్చు. ఇప్పుడు అలా జరగకపోవడంతో ఫీజు కడితేనే కాలేజీకి రండి అని కొన్ని చోట్ల విద్యార్థులపై ఆంక్షలు విధిస్తున్నారట. అలా అయితే నష్టపోయేది ఎవరు? నోరు తెరిసే వేల కోట్ల లెక్కలు చెప్పే ప్రభుత్వాధినేతలు, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటున్నారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. భావిపౌరుల చదువుకంటే ప్రభుత్వానికి ప్రాధాన్యం ఏం ఉంటుంది?

పైగా ఖజానా ఖాళీ ఉందా అంటే అదీ లేదు. ఇది సంపన్న రాష్ట్రం. నిధులకు కొదువ లేదు. డబ్బు చెట్లకు కాస్తుందా అనే తరహాలో ముఖ్యమంత్రి విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటారు. సువిశాలమైన సచివాలయ భవనం ఉన్నా, మరో దానికోసం వందల కోట్లు ఖర్చు చెయ్యడానికి సిద్ధపడతారు. ఒకసారి, రెండుసార్లు కాదు, మూడు సార్లు ముఖ్యమంత్రి కాన్వాయిలో కార్లను మార్చడానికి కోట్లు ఖర్చు చేస్తారు. అప్పుడప్పుడూ పల్లెల్లో విహారానికి కోట్లు ఖర్చు పెట్టి లగ్జరీ బస్సును కొంటారు. ఇన్ని చేస్తున్న ముఖ్యమంత్రికి, విద్యార్థుల చదువు ముఖ్యం అనిపించడం లేదా అనేదే విద్యార్థి సంఘాల ప్రశ్న. ఉద్యమాల గడ్డ వరంగల్ జిల్లా జనగామలో కడుపుమండిన విద్యార్థులు ఫీజు రీయింబర్స్ మెంట్ సంగతి ఏందని డిప్యుటీ సీఎం కడియం శ్రీహరిని నిలదీశారు.

ప్రభుత్వ దృష్టి మారుతోందా లేక దుబారా వల్ల ఖజానా కరిగిపోతోందా అనేది కేసీఆర్ సర్కారే చెప్పాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close