మొండి, అహంభావాల సాక్ష్యం: నిరర్ధక సభాపర్వం

వెనక్కిరావడమెలాగో తెలియని మొండివ్యూహంతో సోనియా, మెజారిటీయే సమస్యని పరిష్కరిష్కరిస్తుందన్న అహంభావంతో నరేంద్రమోదీ భంగపడిన సభాపర్వమిది.

ఎందుకైనాగాని పార్లమెంటుని స్తంభింపజేసే పోరాటానికి కాంగ్రెస్ మల్లికార్జున ఖర్గే, గులాం నబీఆజాద్ వంటి సీనియర్ నేతలు సముఖంగా లేరని గ్రహించిన సోనియా పోరాటానికి స్వయంగా కొంగుబిగించారు. రాహుల్ అదేస్ధాయిలో రెచ్చిపోయారు. పార్టీని ఎన్నడూలేనంత పాతాళానికి తీసుకుపోయాక కూడా తల్లీకొడుకులకు అంతర్గత ప్రజాస్వామ్యం అవసరం గురించి ఏమీ అర్ధంకాలేదని స్పష్టమైంది.

ఏ సమస్యలూ లేకుండా మోదీ ఐదేళ్ల పాలన సాగితే… మరో ఐదేళ్లు ఆయనే అధికారంలో ఉంటారనీ, తమ రాజకీయాలకు తెరపడుతుందనీ సోనియా భావన. పార్లమెంటును స్తంభింపజేస్తే బీజేపీకి సుష్మాను తొలగించక తప్పదు. దీంతో సుష్మా, మోదీ వ్యతిరేక అసమ్మతిని రాజేస్తారని సోనియా అంచనాఅని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే అదేదీ జరగలేదు. పార్లమెంటు ప్రతి ష్టంభన ద్వారా కాంగ్రెస్‌కు ఒరిగిందేమీ లేదు.

లోక్‌సభలో మెజారిటీని వున్న మోదీ ప్రభుత్వానిక సభ్యులనుంచి ఎలాగూ మద్దతు వుటుందికనుక గట్టెక్కుతామని భావించారు అధికార పార్టీ, ప్రతిపక్షాన్ని గౌరవించి, వారి మద్దతును కూడగట్టుకోవాల్సి వున్న రాజనీతిని ఆయన మరచేపోయారు. సైతం ప్రతిపక్షాలతో రాజీకి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. బీజేపీ మంత్రులు రాహుల్‌ను, కాంగ్రెస్‌ను అతిగా హేళన చేశారు. మోదీ మంత్రివర్గం లోన ఆరుగురు సీనియర్ మంత్రులు మినహా మిగిలినవారందరూ అనుభవం, నైపుణ్యం లేనివారు. ఈపరిస్ధితిని చక్కదిద్దుకోకపోతే మెల్లగా మోదీ ప్రతిష్ట దిగజారిపోతుంది. కాంగ్రెస్‌లాగా బీజేపీ కూడా మిత్రులను మరచిపోవడమే కాదు, శత్రువులను తయారు చేసుకోవడంలో ఆరితేరింది. కాంగ్రెస్‌లాగే బీజేపీ కూడా అహంభావం, వివేకంలేకపోవడం వల్ల విఫలమౌతోంది. 2004-14 మధ్య బీజేపీ ఏవిధంగా పార్లమెంటును స్తంభింపజేసిందో కాంగ్రెస్ కూడా అదే బాటలో దేశానికి చెడు చేసింది.

బిజెపి, కాంగ్రెస్ పార్టీలను ఒకేసారి తిరస్కరించిన డిల్లీ ప్రజల మార్గాన్నే దేశమంతటికీ సూచిస్తున్నతీరులో పార్లమెంటు వర్షాకాలం సమావేశాలు ముగిశాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close