’96’ రీమేక్‌…. మ‌క్కీకి మ‌క్కీ!

ఇన్నేళ్ల సినీ ప్ర‌యాణంలో ఎప్పుడూ రీమేక్‌ల జోలికి వెళ్ల‌ని నిర్మాత దిల్‌రాజు. మొట్ట‌మొద‌టి సారి ఓ త‌మిళ క‌థ‌పై మ‌న‌సు పారేసుక‌న్నాడు. అదే.. ’96’. త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా, అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల మ‌న‌సుల్నీ, విశ్లేష‌కుల ప్ర‌సంశ‌ల‌నూ గెలుచుకున్న చిత్ర‌మిది. అక్క‌డ విజ‌య్‌సేతుప‌తి, త్రిష న‌టిస్తే.. ఇక్క‌డ ఆ పాత్ర‌ల‌కు గానూ శ‌ర్వానంద్‌, స‌మంత‌ల‌ను తీసుకున్నారు.

దిల్‌రాజు చేతిలో ఈ సినిమా ప‌డ‌గానే.. ఆయ‌న శైలి మార్పులూ, చేర్పులూ ఉంటాయ‌ని ఆశిస్తారంతా. దిల్‌రాజు కూడా అదే మాట చెబుతున్నాడు. కాక‌పోతే.. సీన్ బై సీన్‌.. మ‌క్కీకి మ‌క్కీ తెలుగులో దించేయ‌డానికే దిల్‌రాజు మొగ్గు చూపిస్తున్నాడ‌ని టాక్‌. దానికి కార‌ణం కూడా ఉంది. త‌మిళంలో ఈ చిత్రం తెర‌కెక్కించిన ప్రేమ్‌కుమార్ ‘ఈ సినిమాలో మార్పులు చేర్పులూ చేయ‌కూడ‌దు. చేస్తే ఆ ఫీల్ దెబ్బ‌తింటుంది’ అని గ‌ట్టిగా చెప్పాడ‌ట‌. ఆ మాట‌తో దిల్‌రాజు కూడా ఏకీభ‌వించిన‌ట్టు తెలుస్తోంది. డైలాగుల‌తో స‌హా.. త‌మిళంలో ఉన్న‌దాన్నే తెలుగులోకి త‌ర్జుమా చేస్తున్న‌ట్టు స‌మాచారం అందుతోంది. మార్పుల పేరుతో మాతృక‌ని పాడు చేసిన సంగ‌తులెన్నో ఉన్నాయి. ఉన్న‌ది ఉన్న‌ట్టు తీసినా ఫీల్ మిస్ అయిన అనుభ‌వాలెన్నో క‌నిపిస్తాయి. మ‌రి ఈ రెండింటిలో `96` ఏ జాబితాలో చేరుతుందో కాల‌మే చెప్పాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close