తిరుపతి ఎంపీ గురుమూర్తి వద్ద పని చేసిన గన్ మెన్ హైదరాబాద్ లో డ్రగ్స్ దందా చేస్తూ దొరికిపోయాడు. తన బామ్మర్ది పెళ్లి అని చెప్పి లీవ్ తీసుకున్నాడు. అక్కడ పెళ్లి లేదు.. ఏమీ లేదు.. డ్రగ్స్ దందా కోసం హైదరాబాద్ వెళ్లారు. అక్కడ పోలీసులకు దొరికిపోయాడు. ఆయన పేరు గుణశేఖర్. ఏకంగా రెండు కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ను ఆయన గ్యాంగ్ నుంచి స్వాధీనం చేసుకున్నారు.
కానిస్టేబుల్ గుణశేఖర్ పేరుకే కానిస్టేబుల్. కానీ గురుమూర్తి, పెద్దిరెడ్డికి బాగా దగ్గర . ఎంతగా ఉంటే గుణశేఖర్ తల్లి జడ్పీటీసీ సభ్యురాలు. తండ్రి ఎంపీటీసీ. ఆ స్థాయిలో ప్రాధాన్యం ఇచ్చారంటే ఖచ్చితంగా వైసీపీ బ్రాండ్ లో తెర వెనుక ఏదో ఉండి ఉంటుంది. అదేమిటంటే..ఈ డ్రగ్స్ దందా అన్న మాట. వైసీపీ పెద్దలే పెద్ద గంజాయి, డ్రగ్స్ ముఠాలను నడుపుతారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటివి జరిగినప్పుడు.. ఆ ఆరోపణల్లో నిజం ఉందేమో అన్న అనుమానాలు ప్రజలకు కలుగుతాయి.
840 గ్రాముల కొకైన్ బాపట్ల జిల్లా అద్దంకి నుంచి కూకట్పల్లికి తీసుకువచ్చినట్లుగా గుర్తించారు. ఈ డ్రగ్స్ వారికి అద్దంకిలో ఎవరిచ్చారు.. ఆ ముఠా ఏంటి అనేది హైదరాబాద్ పోలీసులు వెలికి తీయాల్సి ఉంది. కానిస్టేబుల్ దొరికిపోయినట్లుగా సమాచారం రాగానే.. గురుమూర్తి ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఇప్పుడు ఆ కానిస్టేబుల్ తన వద్ద గన్మెన్గా లేడని.. తన ప్రమేయం ఉంటే విచారణ చేయాలని సీబీఐకి లేఖ రాస్తానని చెప్పుకొచ్చారు. వెంటనే గురుమూర్తి భుజాలు తడుముకున్న వైనం చూసి.. జనం నవ్వుతున్నారు.