రవితేజ సోదరుడి తనయుడు మాధవ్ భూపతిరాజు హీరోగా తెరకెక్కుతున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘మారెమ్మ’. మంచాల నాగరాజు దర్శకుడు. ఈ సినిమా టీజర్ బయటికి వచ్చింది. గ్రామంలో ఓ మహమ్మారి విజృంభిస్తుంది. మనుషులే కాదు, పశువులు కూడా వరుసగా మృత్యువాత పడతాయి. గ్రామస్తులు తమ గ్రామ దేవత మారెమ్మ తల్లిని ప్రార్ధిస్తారు. ఆ దేవతకు సంబంధించిన ఎద్దును కాపాడే బాధ్యత హీరోది. అయితే ఒక రోజు ఆ ఎద్దు అనూహ్యంగా కనిపించకుండాపోతుంది. ఇక్కడినుంచి కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తిగా చూపించారు.
ఇది మాధవ్‌కు తొలి సినిమా. సాధారణంగా తొలి సినిమా అంటే కమర్షియల్ గా సేఫ్ గా వుండే జానర్ ఎంచుకుంటారు. మాధవ్ మాత్రం ప్రస్తుత ప్రేక్షకులు అభిరుచులకు తగ్గ కథని ఎంచుకున్నారు. విలేజ్ లుక్ లో తన ప్రజెన్స్ బావుంది. వినోద్ కుమార్ కూడా కీలక పాత్రలో కనిపించారు. దర్శకుడు నాగరాజ్ తెలంగాణలో జరిగిన నిజ సంఘటనల నుంచి ప్రేరణ పొందిన కథను రాసుకున్నారు. టీజర్ లో సహజమైన గ్రామీణ నేపథ్యం కనిపించింది. సినిమాటోగ్రఫీ, నేపధ్య సంగీతం చక్కగా కుదిరాయి. ఇలాంటి రూటెడ్ కథలపై జనం ఆసక్తి చూపిస్తున్నారు. మాధవ్ తన తొలి ప్రయత్నంగా మంచి కథనే పట్టుకున్నాడు.
