వరుసగా 9 విజయాలతో తన జైత్ర యాత్ర కోనసాగిస్తున్నాడు అనిల్ రావిపూడి. ‘హిట్ మిషన్’ అనే టైటిల్ కూడా సొంతం చేసుకొన్నాడు. రాజమౌళి తరవాత ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్నది రావిపూడికే. సంక్రాంతికి రావడం, ఓ సూపర్ హిట్టు కొట్టడం అలవాటు అయిపోయింది. 2027 సంక్రాంతికి తన సినిమాని బరిలో దించబోతున్నాడు. వెంకటేష్ – కల్యాణ్ రామ్ లతో చేస్తున్న మల్టీస్టారర్ ఇది. ఓ కథానాయికగా కృతిశెట్టి ఎంపిక చేశారు. మరో హీరోయిన్ గా కీర్తి సురేష్ పేరు పరిశీలనలో ఉంది. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్తుంది.
అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ బిజినెస్ అప్పుడే క్లోజ్ అయిపోయిందని టాక్. డీల్ ఏమిటన్నది బయటకు రాలేదు కానీ, ఓటీటీ మాత్రం హాట్ కేక్ లా అమ్మేశార్ట. అది కూడా రికార్డు ధరకు. రావిపూడి నుంచి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వర ప్రసాద్ గారు’ రెండూ జీ5 చేజిక్కించుకొంది. వాటికి మంచి టీ.ఆర్.పీ రేటింగులు కూడా బాగా వచ్చాయి. ఈ సినిమా కూడా జీ5 నే చేజిక్కించుకొందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. తన ప్రతి స్క్రిప్టునీ వైజాగ్ లో రాయడం అనిల్ రావిపూడికి సెంటిమెంట్. ఈ స్క్రిప్టు పనులూ అక్కడే జరుగుతున్నాయి. ఇప్పటికి ఫస్ట్ ఆఫ్ లాక్ చేసినట్టు సమాచారం.


