జయలలిత కేసులో మీడియా ”అనారోగ్యం”

  • సత్యాన్వేషణకు స్వస్తి – ప్రచారానికే పరిమితం
  • జయలలిత అనారోగ్యంలో బయటపడిన మీడియా డొల్లతనం
  • కోర్టు జోక్యం చేసుకుంటే తప్ప తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యపరిస్ధితిపై అధికారికంగా వివరాలు వెల్లడించలేని పరిస్ధితి పత్రికలు, టివిల వంటి సమాచార సాధనాల డొల్లతనాన్ని బయటపెడుతోంది. టెక్నాలజీలు పెరిగి మీడియా విస్తరించినా, వేగం పెరిగినా క్వాలిటీ వేగంగా పతనమైపోతూందనడానికి ఇది ఒక తాజా ఉదాహరణ మాత్రమే! రకరకాల ‘సోర్సెస్’ తో నిరంతర సంబంధాలు కలిగివుండి, సేకరించుకున్న సమాచారాన్ని ధృవీకరించుకుని ప్రచురించే లేదా ప్రసారం చేసే జర్నలిస్టుల నైపుణ్య సామర్ధ్యాలు ఊదరగొట్టే ప్రచార శక్తులుగా మారిపోవడం విచారకరం.

    మిడియా యాజమాన్యాలు రాజకీయ ఆసక్తులతో కల్తీ అయిపోయాక, రాజకీయ అధికారం కోసమో, రాజకీయ ప్రత్యర్ధులను అడ్డుకోవడం కోసమో మీడియాలు పుట్టుకు రావడం మొదలయ్యాక జర్నలిజం స్ధాయి ”వృత్తి” నుంచి ”ఉద్యోగం” గా మారిపోయింది. ఎవరు ఏమి చెప్పినా టివిలో చూపించే ”డ్యూటీ”గా మారిపోయింది. దీన్ని పెద్దనోరున్న వారు గట్టిగానే వాడుకోగల పరిస్ధితి నెలకొంది.

    జయలలిత ఆరోగ్యస్ధితి పై ప్రజల్లో తీవ్రమైన పుకార్లు వ్యాపించాయంటే అందుకు ప్రధాన కారణం ఆమె రాజకీయ ప్రత్యర్ధి కరుణానిధి ”ఆమెకు ఏమైంది…హెల్త్ బులిటెన్లు ఎందుకు జారీ కావడంలేదు” అని ‘గట్టిగా’ ప్రశ్నించడమే!

    జయలలిత అనారోగ్యాన్ని గోప్యంగా వుంచడానికి ప్రభుత్వానికి రాజకీయ కారణాలు వుండి వుండవచ్చు. సమాచారాన్ని సేకరించకుండా వుండటానికి జర్నలిస్టులకు ఏ కారణం వుంటుంది. చెన్నైలో వున్న ఎందరెందరో సీనియర్ జర్నలిస్టులకు ప్రభుత్వ వర్గాలతో, కనీసం అపోలో ఆస్పత్రి వర్గాలతో కనీస సంబంధాలు కూడా లేవా? వివరాలు చెప్పిన వారి పేరు బయటపెట్టకుండానే పాఠకులకు సమాచారం ఇచ్చే నైపుణ్యం సీనియర్లకు కూడా లేకుండా పోయిందా? ఈ దురవస్ధ చెన్నై కి మాత్రమే పరిమితంకాదు. దేశమంతా ఇదే దుస్ధితి!

    జర్నలిస్టులు ఎవరో చెప్పిన విషయాలను సొంత కథనం అన్నట్టు యధాతధంగా తెర ఎక్కించే “లీకు” వీరులుగా మారిపోవడం వల్ల నిజానిజాలు తెలుసుకోడానికి కోర్టులను ఆశ్రయించడం మినహా పౌర సమాజానికి మరో దారి లేకుండాపోయింది…జయలలిత ఆరోగ్య పరిస్ధితులపై వార్తలు ఇవ్వడంలో మీడియా ”కొరియర్ బాయ్” పాత్రకే పరిమితమైపోవడంతో నిజానిజాలు తెలుసుకోడానికి ఒక న్యాయవాది కోర్టుకి వెళ్ళారు…ఆయన అభ్యర్ధన ప్రకారం తమిళనాడు ముఖ్యమంత్రి అనారోగ్యం వివరాలు, స్ధితిగతులపై బులిటెన్లు జారీచేయాలని హైకోర్టు ఆదేశించింది.

    Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

    Most Popular

    అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

    ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

    ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

    ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

    టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

    జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

    గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

    జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

    HOT NEWS

    css.php
    [X] Close
    [X] Close